ఈ మధ్య హీరోయిన్లు తమ బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చెప్పేసి. కొత్త వాళ్ళ కోసం వెతుకున్నారు.. చిన్న హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్లు కూడా లవ్ లో పడుతున్నారు కొద్ది రోజులు బాగానే ఉంటున్నారు. ఆ తర్వాత బ్రేకప్ చెప్పడం కొత్త వాళ్ళ కోసం వెతుకుతున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ కుర్రాళ్లకు వాలంటైన్స్ డే స్పెషల్ గా ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆమె ఆఫర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
హీరో శర్వానంద్ నటించిన హిట్ మూవీ రన్ రాజా రన్.. ఈ మూవీతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది సీరత్ కపూర్.. ఈమె ఖాతాలో హిట్ సినిమాలు పడినా కూడా పెద్దగా క్రేజ్ ను అందుకోలేక పోతుంది. అయితే తాజాగా తన సినిమా ప్రమోషన్స్‌లో వాలంటైన్ డే రోజు విశేషాలను పంచుకొన్నారు. రాజుగారి గది 2, ఒక క్షణం, టచ్ చేసి చూడు, కృష్ణ అండబ్ హిజ్ లీలా సినిమాల్లో నటించారు. అలాగే మా వింత గాధ వినుమ, భామ కలాపం, ఉషా పరిణయం లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
ఇదిలా ఉండగా.. ఈమె గతంలో నటించిన కృష్ణ అండ్ హిజ్ లీలా అనే సినిమా ను రి రీలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్.. టాలీవుడ్ క్రేజీ హీరో టిల్లు ఫేమ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, శ్రద్దా శ్రీనాథ్ జంటగా నటించిన ఈ మూవీని రానా దగ్గుబాటి గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.. అయితే ఫిబ్రవరి 14 న మూవీను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్ ను గట్టిగానే చేస్తున్నారు. ఈ సందర్బంగా హీరోయిన్ మాట్లాడుతూ.. లవర్స్ డే ప్రాముఖ్యత చెప్పింది. అలాగే తన బ్రేకప్ స్టోరిల గురించి బయట పెట్టింది. అంతేకాదు.. ఈ ఏడాది ఎవరైనా నాకు రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే.. నేను అతడి ప్రేమను, ప్రపోజల్‌ను అంగీకరిస్తాను అని ఆమె బంపర్ ఆఫర్ ఇచ్చింది. అయితే ఆమె అభిమానులు ఈ వార్త విని సంతోషంలో మునిగిపోయారు.. అయితే వార్త వైరల్ అవ్వడంతో ఫ్యాన్సతో పాటుగా నెటిజన్స్ దారుణంగా కామెంట్స్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఆఫర్ ఆమె మెడకు చుట్టుకుంది. మరి ఈమె నచ్చిన వాడితో డేట్ చేస్తుందేమో చూడాలి. ఏది ఏమైనా ఈ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది..
ఈ అమ్మడు గతంలో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడితో రిలేషన్లో ఉన్నారన్న వార్తలు వినిపించేవి. అయితే ఈ మధ్యలో వారిద్దరికి మధ్య విభేదాలు రావడంతో ఒంటరిగానే ఉంటున్నారని చెబుతున్నారు. రకుల్ బ్రదర్ కూడా డ్రగ్స్ కేసు లో ఇటీవల అరెస్ట్ కావడం తెలిసిందే. మరి వీరిద్దరి మధ్య అసలు గొడవలు జరగడానికి కారణం ఏంటో ఆమె క్లారిటీ ఇస్తేనే తెలుస్తుంది. ప్రస్తుతం ఈమె సినిమాల పై మాత్రమే ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది.!
https://www.instagram.com/p/DF5IY2Nsrf6/?utm_source=ig_web_copy_link