ప్రముఖ నటి సమంత తన కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. దర్శకుడు రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకున్నారు. అయితే, ఇది అందరిలా జరిగిన సంప్రదాయ వివాహం కాదు. కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో ఉన్న లింగ భైరవి సన్నిధిలో అత్యంత పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ ద్వారా వీరిద్దరూ ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మధ్య ఈ వేడుక నిరాడంబరంగా జరిగింది.
‘భూత శుద్ధి వివాహం’ అనేది అనాదిగా వస్తున్న ఒక యోగ సంప్రదాయం. ఇది కేవలం భౌతికమైన కలయిక కాకుండా, దంపతుల మధ్య లోతైన ఆధ్యాత్మిక బంధాన్ని ఏర్పరిచే పవిత్ర ప్రక్రియ. ఈ క్రతువులో భాగంగా వధూవరుల దేహాల్లోని పంచభూతాలను (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం) శుద్ధి చేస్తారు. ఇలా చేయడం వల్ల వారి ఆలోచనలు, భావోద్వేగాలకు అతీతమైన శక్తివంతమైన బంధం ఏర్పడుతుందని నమ్ముతారు.
ఈ పవిత్ర వివాహ ప్రక్రియ ద్వారా దంపతుల దాంపత్య జీవితం సామరస్యంగా, శ్రేయస్సుతో సాగుతుందని, దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని ఈశా ఫౌండేషన్ వర్గాలు వివరించాయి. ఈ సందర్భంగా సమంత, రాజ్ జంటకు ఈశా ఫౌండేషన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. దేవి కృపతో వారి జీవితం ఆనందమయంగా సాగాలని ఆకాంక్షించింది.
నటి సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం భూత శుద్ధి వివాహం చేసుకున్నట్లుగా ఈశా ఫౌండేషన్ వెల్లడించింది.ఈమేరకు సమంత తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పెళ్లికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.ఈ ఫోటోల్లో పూజ క్రతువు, లింగ భైరవి దేవి సమక్షంలో ఆమె వేలికి రాజ్ నిడిమోరు ఉంగరం తొడుగుతున్నట్లుగా కనిపిస్తుంది.అలాగే ఆమె మెడలో మంగళసూత్రానికి బదులుగా దేవి పెండెంట్ ఉన్నట్లుగా ఫోటోల్లో కనిపిస్తుంది.చేతికి తొడిగిన ప్రత్యేక ఉంగరం, ఆమె మెడలో నల్ల పూసలతో కూర్చిన దేవి పెండెంట్ కనిపించేలా ఒక ఫోటోను సమంత షేర్ చేశారు.
ఈ వివాహం కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో ఉన్న లింగ భైరవి దేవి ఆలయంలో జరిగింది.సమంత ఎరుపు రంగు చీరలో, బంగారు ఆభరణాలతో అలంకరించుకొని కనిపిస్తున్నారు. ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పలువురు కామెంట్ చేశారు.లింగ భైరవి సన్నిధిలో సన్నిహితుల సమక్షంలో ఈ జంట భూత శుద్ధి వివాహం చేసుకున్నట్లుగా ఈశా సెంటర్ ప్రకటించింది.‘దేవి అనుగ్రహం వారిద్దరికీ ఉండాలి, వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని ఈశా యోగా సెంటర్ తెలిపింది.భక్తితో పాటు అందులో కొన్ని ప్రత్యేక పద్ధతులపై విశ్వాసం ఉన్నవారు ఎంచుకునే వివాహ ప్రక్రియగా దీనిని భావించవచ్చుతమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ పద్ధతి ప్రాచుర్యంలో ఉందని హైదరాబాద్‌లోని కొత్తపేటకు చెందిన పురోహితుడు శర్మ చెప్పారు.
ఈశా సద్గురు ఫౌండేషన్ వెబ్‌సైట్ ప్రకారం, భూత శుద్ధి వివాహం అనేది పెళ్లికి సంబంధించిన ఒక ప్రాచీన యోగిక్ ప్రాసెస్. లింగ భైరవి అంటే పార్వతి దేవి రూపమని పురోహితుడు శర్మ చెప్పారు.హిందూ మత విశ్వాసాలలో, ఆధ్మాత్మిక సాహిత్యంలో పంచభూతాలుగా పేర్కొనే ‘భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశాన్ని ప్రసన్నం చేసుకునే ప్రక్రియే భూతశుద్ధి’ అని ఈశా వెబ్‌సైట్ పేర్కొంది.భూత శుద్ధి వివాహం గురించి సద్గురు జగ్గీ వాసుదేవ్ ఒక వీడియోలో వివరిస్తూ.. ‘ఈ వివాహం, భూతశుద్ధి ఆధారంగానే జరుగుతుంది. ఆలోచనలు, కంపానియన్‌షిప్, భావోద్వేగాలు, శరీరం, భౌతిక ప్రపంచానికి అతీతంగా జంట మధ్య దృఢమైన బంధం ఏర్పరచడమే ఈ పెళ్లి లక్ష్యం. పంచభూతాలను ఏ స్థాయి వరకు మనం ప్రసన్నం చేసుకుంటామనే దానిపైనే మన జీవన నాణ్యత, స్వభావం, పరిధి నిర్ణయమవుతుంది. ఆ దిశగా చేసే ప్రయత్నంలో ఈ వివాహం కూడా ఒకటి’ అని వివరించారు.
అయితే.. ‘భూత శుద్ధి అంటే పంచ భూతాల నుంచి తీసుకున్నది’ అని చెప్పారు శృంగేరి పీఠం తెలంగాణ ఇన్చార్జి బంగారయ్య శర్మ.”పెళ్ళి అనే క్రతువుకు అష్ట ప్రక్రియలున్నాయి. ఈ భూత శుద్ధి వాటి పరిధిలోకి రాదు ” అని చెప్పారు.ఈశా వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. భూతశుద్ధి వివాహంలో ‘సుమంగళ’గా పిలిచే ప్రత్యేకంగా శిక్షణ పొందిన వలంటీర్లు వివాహం జరిపిస్తారు. వీరు పసుపు రంగు చీర ధరిస్తారు.సమంత షేర్ చేసిన ఫోటోల్లో కూడా పసుపు రంగు చీర ధరించిన ఒక మహిళ క్రతువు నిర్వహిస్తున్నట్లుగా కనిపిస్తోంది.భూతశుద్ధి వివాహ ప్రక్రియలో దేవి పెండెంట్ ధారణ తప్పనిసరి అని ఈశా వెబ్‌సైట్ పేర్కొంది.
దానితో పాటు దంపతుల ఇష్టం ప్రకారం, సంప్రదాయ మంగళసూత్రాన్ని కూడా వధువు మెడలో కట్టవచ్చు.ఈ వివాహ ప్రక్రియకు ముందే మ్యారేజ్ లైసెన్స్ తీసుకోవాలని వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.ఈశా యోగా (yoga)కేంద్రంలోని లింగ భైరవి దేవిని సద్గురు ప్రతిష్ఠించారు.కాగా.. సమంత భూత శుద్ధి ప్రక్రియలో వివాహం చేసుకున్నారన్న అంశంపై ‘ఎక్స్’లో చాలామంది స్పందించారు.తాము కూడా గతంలో ఇలాంటి ప్రక్రియలో పాల్గొన్నట్లు కొందరు పేర్కొనగా … మరికొందరు మాత్రం ప్రాచీన యోగలో భూత శుద్ధి ప్రక్రియ ఉన్నప్పటికీ దానికి, వివాహానికి సంబంధం లేదని పేర్కొన్నారు.సోషల్ మీడియాలో సెలబ్రిటీల పెళ్లిళ్లు అంటేనే ఒక పెద్ద హడావుడి. ఫోటోలు, వీడియోలు, మీమ్స్.. ఇలా రోజు మొత్తం దాని గురించే చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఒక టాప్ హీరోయిన్ రెండో పెళ్లి చేసుకుంటుందంటే ఆ హడావుడి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆమె కట్టిన చీర ఎంత కాస్ట్లీ, ఆభరణాలు ఏంటీ? అలాగే పెళ్లిలో భోజనాల నుంచి గెస్టుల వరకు ఇలా అన్ని విషయాల్లో ఒక బజ్ ఉంటుంది. కానీ లేటెస్ట్ గా జరిగిన సమంత పెళ్లి విషయంలో మాత్రం సోషల్ మీడియాలో ఎందుకో ఆశించిన స్థాయిలో ‘బజ్’ కనిపించలేదు. ఇది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
గతంలో సమంత తన మొదటి పెళ్లి చేసుకున్నప్పుడు, ఆ తర్వాత జరిగిన పరిణామాల సమయంలో సోషల్ మీడియా ఏ రేంజ్ లో షేక్ అయిందో తెలిసిందే. ప్రతి చిన్న విషయానికి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఇక ఆమె మాజీ భర్త రెండో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా అంతే స్థాయిలో రచ్చ జరిగింది. కానీ ఇప్పుడు సమంత డైరెక్టర్ రాజ్ నిడమూరును పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రం ఆ హడావుడి ఎక్కడా కనిపించలేదు.దీనికి కారణం ఏమై ఉంటుందా అని విషయంలో రకరకాల కామెంట్స్ వినబడుతున్నాయి. ఒకవేళ జనాలు ఇలాంటి వార్తలకు అలవాటు పడిపోయారా? లేక సమంత ఈ పెళ్లిని చాలా లో ప్రొఫైల్ లో ఉంచడమే కారణమా? గత కొంతకాలంగా ఆమె ఈ రిలేషన్ షిప్ గురించి హింట్లు ఇస్తున్నప్పటికీ, ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. పెళ్లి ఫోటోలు వచ్చాకే అందరికీ కన్ఫర్మ్ అయింది. బహుశా ఈ సైలెన్స్ స్ట్రాటజీనే ఆమె ఫాలో అయ్యారేమో అనిపిస్తోంది.
మరోవైపు ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు అయినా, సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండే పర్సన్ కాదు. పైగా వీరిద్దరి మధ్య ఉన్నది మెచ్యూర్డ్ రిలేషన్ షిప్ కావడం, ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా పెళ్లి చేసుకోవడం కూడా ఈ ‘సైలెన్స్’ కు ఒక కారణం కావచ్చు. సాధారణంగా ఇలాంటి విషయాలపై నెటిజన్లు ఎగబడి కామెంట్స్ చేస్తుంటారు. కానీ ఈసారి మాత్రం చాలా సాదాసీదాగా స్పందించారు.ఒక స్టార్ హీరోయిన్ లైఫ్ లో ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నప్పుడు, కనీసం ఆ బజ్ కూడా లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరమే. బహుశా ఆమె పర్సనల్ లైఫ్ పట్ల జనాల్లో ఆసక్తి తగ్గిందా? లేక ఆమె తీసుకున్న నిర్ణయాన్ని అందరూ గౌరవించి సైలెంట్ గా ఉన్నారా? ఏదేమైనా గతంలో జరిగిన సంఘటనలతో పోలిస్తే, ఈసారి సోషల్ మీడియా రియాక్షన్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది.
మొత్తానికి సమంత తన కొత్త జీవితాన్ని చాలా ప్రశాంతంగా మొదలుపెట్టారు. సోషల్ మీడియా గోల లేకుండా, అనవసరపు చర్చలు లేకుండా సింపుల్ గా ముగించేశారు. బహుశా ఆమె కోరుకున్నది కూడా ఇదేనేమో. సెలబ్రిటీల పెళ్లిళ్లంటే హంగామా ఉండాలనే రూల్ ఏమీ లేదుగా.. సైలెంట్ గా చేసుకోవడంలోనూ ఒక అందం ఉంటుందని ఈ పెళ్లి నిరూపించింది.

















