టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న సమంత అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్టార్ గా రికార్డు సృష్టించింది. ‘ఏ మాయ చేసావే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. ఆ తర్వాత తెలుగులో పలువురు స్టార్ హీరోల సరసన నటించి మంచి ఇమేజ్ అందుకుంది. తెలుగు, తమిళ్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె.. కెరియర్ పీక్స్ లో ఉండగానే నాగచైతన్యను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు తీసుకోవడం గమనార్హం. ఆ తర్వాత విమర్శలు, అనారోగ్య సమస్యలు, వరుస ఫ్లాప్ లు చవిచూసి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.
అటు బాలీవుడ్ లో ‘సిటాడెల్ – హనీబన్నీ’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ఇందులో యాక్షన్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. తెలుగులో శాకుంతలం, యశోద, ఖుషి వంటి చిత్రాలు చేసింది. కానీ పెద్దగా గుర్తింపును సొంతం చేసుకోలేదు. దాంతో ‘ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి, ‘శుభం’ అనే సినిమాను నిర్మించింది. కొత్త నటీనటులతో రూపుదిద్దుకున్న ఈ సినిమా మంచి విజయం సొంతం చేసుకొని.. నిర్మాతగా సమంతకు గుర్తింపును అందించింది. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాతోపాటు అటు బాలీవుడ్ లో ‘రక్త బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది సమంత.
ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక అరుదైన గౌరవాన్ని అందుకుంది. ప్రముఖ మ్యాగజైన్ ‘గ్రాజియా ఇండియా’ లేటెస్ట్ ఎడిషన్ కవర్ పేజీపై ఈమె ఫోటో ప్రచురించింది.. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఈ స్టిల్ విడుదలవడంతో సమంతకు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మ్యాగజైన్ లో భాగమైన ఐదు మహిళా ఫోటోగ్రాఫర్లు, ఆరుగురు డిజైనర్లతో ఫోటోగ్రఫీ డే సెలబ్రేట్ చేసుకున్నట్టు గ్రాజియా స్పష్టం చేసింది. సమంతపై గ్రాజియా ప్రశంసల వర్షం కురిపిస్తూ..” 15 సంవత్సరాల నట ప్రయాణంలో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు”అంటూ ఆమెను కొనియాడింది. అంతేకాదు ఈ మ్యాగజైన్ పై ముద్రించబడిన ఫోటోలలో 22 క్యారెట్ల బంగారపు ఉంగరం, గాజులు, మెడలో చౌకర్ తో సమంత మరింత అందంగా.. మేలిమి బంగారంలా మెరిసిపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ప్రస్తుతం సమంత.. రామ్ చరణ్ హీరోగా వస్తున్న ‘పెద్ది’ సినిమాలో స్పెషల్ సాంగ్ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇదివరకే రామ్ చరణ్ తో ‘రంగస్థలం’ సినిమాలో నటించి మంచి ఇమేజ్ అందుకుంది. ఇప్పుడు మళ్లీ అదే హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ కి సిద్ధమైంది. ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తూ ఉండగా.. దివంగత నటీమణి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న ‘ఖైదీ 2’ సినిమాలో కూడా సమంత అవకాశమందుకున్నట్లు సమాచారం.
The amount of hotness she holds >>> 🔥📷@Samanthaprabhu2#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/AD5lHEBnRE
— news7telugu (@news7telug2024) August 19, 2025