ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పలు అంశాలపై నిశితంగా దృష్టి పెడుతున్నారు. తన శాఖలకు సంబంధించే కాకుండా.. తన పార్టీకి చెందిన కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ శాఖలకు సంబంధించి కూడా ఆయన పర్యవేక్షణ చేస్తున్నారు. ఆయా శాఖల్లో జరుగుతున్న పరిణామాలు.. వెలుగు చూస్తున్న అ క్రమాలపై పవన్ ఓ కన్నేస్తున్నారు. ఈ క్రమంలోనే బియ్యం అక్రమ రవాణా సహా.. అటవీ సంపద అక్ర మాలు.. పంచాయతీ నిధులు వంటివాటిపై దృష్టి పెట్టారు.
గతంలో బియ్యం అక్రమ రవాణాపై పవన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ముఖ్యంగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం తరలి పోకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అదేసమయంలో రేషన్ మాఫియా పై ఉక్కుపాదం మోపుతున్నట్టు కూడా ప్రకటించారు. ఇక, ఇప్పుడు అటవీ సంపద, భూములు, ముఖ్యంగా ఎర్రచందనం వంటి వాటిని సీరియస్‌గా తీసుకున్నారు. అయితే.. ఇక్కడే పలు సందేహాలు తెరమీదికి వస్తున్నాయి. పవన్ ఇప్పటి వరకు ఆగ్రవేశాలు ప్రదర్శించినా.. వాటి లో రిజల్ట్ మాత్రం కనిపించలేదు.
ఇదీ.. ఇప్పుడు జరుగుతున్న చర్చ. తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కార్నర్ చేస్తున్నారన్న వాదన వైసీపీ నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో పవన్ ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు.. ఇచ్చిన ఆదేశాలతో ఏమేరకు సక్సెస్ అయ్యారన్నది ప్రశ్న. అయితే..గతంలో సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపి.. పోసాని కృష్ణ మురళి సహా అనేక మందిని లైన్‌లోకి తీసుకువచ్చినట్టే.. ఇప్పుడు కూడా అదే తరహాలో అక్రమార్కు లకు చెక్ పెడతారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
అదేవిధంగా రేషన్ అక్రమాలకు సంబంధించిమాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై కూడా అప్పట్లో చ ర్యలు తీసుకున్నారు. దీంతో కృష్ణాజిల్లాలో అక్రమాలు దారిలో పడ్డాయి. ఇలానే ఇప్పుడు దృష్టి పెట్టిన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని పరిశీలకులు చెబుతున్నారు. ఇతర నేతల మాదిరిగా పవన్ తొందర పడే మనస్తత్వం లేదని. ముందుగా అధ్యయనం చేసి.. నెమ్మదిగా కార్యాచరణను ప్రారంభిస్తారని అంటున్నారు. చివరకు అక్రమార్కులకు చుక్కలు చూపించడం ఖాయమని జనసేన వర్గాలు చెబుతున్నాయి.


















