ఉప్పెనతో తొలి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ బుచ్చి బాబు. సుకుమార్ శిష్యుడిగా బుచ్చి బాబు వచ్చీ రాగానే ఒక మెమొరబుల్ హిట్ కొట్టాడు. ఉప్పెన కథ, టేకింగ్, ఎమోషన్, మ్యూజిక్ వీటన్నిటితో బుచ్చి బాబు టాలెంట్ ఏంటన్నది ఆడియన్స్ కి అర్ధమైంది. ఉప్పెన హిట్ తర్వాత ఈసారి గ్లోబల్ స్టార్ రాం చరణ్ తో సినిమా లాక్ చేసుకున్నాడు బుచ్చి బాబు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో పెద్ది అంటూ చాలా పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నారు.
పెద్ది నుంచి వచ్చిన ఫస్ట్ షాట్ తోనే సినిమా హై ఇచ్చింది. మెగా ఫ్యాన్స్ కోరుకునే మెగా మాస్ ఎంటర్టైనర్ గా పెద్ది రాబోతుంది. ఐతే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్షన్ విషయంలో రెహమాన్ ఎంపిక ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. బుచ్చి బాబుకి తొలి హిట్ ఇచ్చింది దేవి శ్రీ ప్రసాద్. ఎలాగు సుకుమార్ శిష్యుడు కాబట్టి దేవితో మంచి ర్యాపో ఉంటుంది. రెండో సినిమాకు కూడా డీఎస్పీని తీసుకోవచ్చు కానీ అతన్ని కాదని అకడమీ విన్నర్ రెహమాన్ ని సెలెక్ట్ చేశాడు.
తను తీసే విలేజ్ పాలిటిక్స్, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కి రెహమాన్ సంగీతం ఎలా ఊహించాడో కానీ బుచ్చి బాబు అడిగిన దాని కన్నా ఎక్కువ ఇస్తున్నాడని పెద్ది ఫస్ట్ షాట్ తోనే అర్ధమైంది. శంకర్ డైరెక్షన్ లో చేసిన గేం ఛేంజర్ కి థమన్ మ్యూజిక్ ఇచ్చాడు. ఆ సినిమాకు ఇవ్వాల్సిన రెహమాన్ పెద్ది మ్యూజిక్ ఇస్తున్నాడు.
పెద్ది మ్యూజిక్ ఒక పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. సినిమా అంతా రా అండ్ రస్ట్రిక్ గా ఉండబోతుంది. రెహమాన్ మ్యూజిక్ గురించి డౌట్ పడే ఛాన్స్ ఉండదు. బుచ్చి బాబు ఎంత వరకు అతని నుంచి రాబడతాడు అన్నది చూడాలి. పెద్ది సినిమాలో రాం చరణ్ తో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. రెహమాన్ మ్యూజిక్ పట్ల బుచ్చి బాబు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడ. ఈ సినిమాను 2026 మార్చి 28న రిలీజ్ అనుకున్నారు. అదే తేడీన నాని ప్యారడైజ్ఝ్ కూడా రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ దగ్గర పడితే ఏ సినిమానైనా ముందుకు వెనక్కి వెర్ళ్తాఊన్నది చూడాలి. పవర్ ప్యాక్డ్ మూవీగా పెద్దిని చేస్తున్నాడు బుచ్చి బాబు.