తనకంటే వయసులో చాలా సీనియర్ అయిన అజయ్ దేవగన్ సరసన నటిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. దేదే ప్యార్ దే సీక్వెల్ (దే దే ప్యార్ దే 2) ఇటీవల నిరంతరం చర్చల్లోకి వస్తోంది. ఈ చిత్రంలోని మొదటి పాట జూమ్ పరాబి తాజాగా విడుదలైంది. ఇందులో అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్, యో యో హనీ సింగ్ నటించారు.
ఇది రొటీన్ సాంగ్.. కానీ దీనిలో హుక్ స్టెప్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ట్రాక్ లో కవ్వాలి వైబ్స్ ఆకర్షించాయి. ఇక పాటలో నర్తించిన స్టార్లు పాదాలతో వైన్ గ్లాస్ ని ఒలికిపోకుండా కదిలించే సీన్ ఆకట్టుకుంది. విడుదలకు ముందే అభిమానులు ఇలాంటి వాటిని ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే ఈ పాటలో రకల్, దేవగన్ ల హుక్ స్టెప్ లను మించి రకుల్ గ్లామర్ ఎలివేషన్ కేంద్రక ఆకర్షణగా మారింది. ఎరుపు రంగు కోక రవికెలో రకుల్ ఎంతో అందంగా కవ్విస్తోంది. నాభి అందాలను, మెడ సొగసును ఆవిష్కరిస్తూ రకుల్ క్లాసీ స్టెప్పులతో అదరగొట్టేసింది. ప్రస్తుతం రకుల్ యూనిక్ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో సునామీలా దూసుకుపోతోంది. రకుల్ స్వతహాగా ఫిట్‌నెస్ ఫ్రీక్ గనుక, టోన్డ్ అందాలు గుబులు పుట్టిస్తున్నాయి. జూమ్ షరాబి పాటను టి-సిరీస్ – లవ్ ఫిల్మ్స్ సంయుక్తంగా విడుదల చేశాయి. కొందరు మధ్య వయస్కులు నైట్ క్లబ్ లో చేరాక అక్కడ ఎలాంటి రచ్చ చేసారన్నదే ఈ పాట థీమ్. అశ్విందర్ సింగ్- అజీజ్ నజాన్ రూపొందించిన `ఝూమ్ బరాబర్ ఝూమ్ షరాబి` అనే కవ్వాలి పాటలో హనీ సింగ్ ప్రదర్శన మరో ఆకర్షణ. `దే దే ప్యార్ దే 2` నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది.
 
			



















