ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Raghu Ram Krishna Raju: సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆకట్టుకున్న ఆర్ఆర్ఆర్..!

Raghu Ram Krishna Raju:  సాంస్కృతిక కార్యక్రమాల్లో  ఆకట్టుకున్న ఆర్ఆర్ఆర్..!
ADVERTISEMENT

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎమ్మెల్యేలు(AP MLA) , ఎమ్మెల్సీలు (MLC) తమ రాజకీయ పనుల్లో స్వల్ప విరామం తీసుకుని వినోదంతో కూడిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సాధారణంగా ప్రజాసేవలో నిత్యం నిమగ్నమై ఉండే నేతలు ఈసారి క్రీడా పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ తమ ప్రతిభను ప్రదర్శించారు. విజయవాడలోని ‘ఏ’ కన్వెషన్ సెంటర్‌లో (A Convection centre) జరిగిన ఈ కార్యక్రమాలు సందడి వాతావరణాన్ని సృష్టించాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమలోని నటనా ప్రతిభను బయటకు తీసుకువచ్చారు. ముఖ్యంగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు (Raghu Ram Krishna Raju) తన ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన మహాభారతంలోని దుర్యోధనుడి వేషధారణలో ప్రేక్షకుల ముందుకు వచ్చి నటించగా, ఆ హావభావాలు, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తన అభినయంతో ఎన్టీఆర్ పోషించిన దుర్యోధనుడిని గుర్తు చేశారు. “ఏమంటివి.. ఏమంటివి..?” అనే డైలాగ్ చెప్పినప్పుడు హాల్ కరతాళధ్వనులతో మారుమోగిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) , మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) లు కూడా ఆయన్ను అభినందిస్తూ చప్పట్లు కొట్టడం విశేషం.

ఇక టూరిజం మంత్రి కందుల దుర్గేష్ తన నటనతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. ఆయన పల్నాటి బాలచంద్రుడి పాత్రను పోషించి, అద్భుతమైన డైలాగ్ డెలివరీతో సభను ఉర్రూతలూగించారు. ఆయన వేషధారణ, హావభావాలు చూసిన సభ్యులు ప్రశంసలు కురిపించారు. వీటితో పాటు యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావులు తమ హాస్య నటనతో సభలో నవ్వుల వర్షం కురిపించారు. పాటలు పాడుతూ, సరదాగా ప్రవర్తిస్తూ అందరినీ అలరించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ క్షణాలను ఆస్వాదిస్తూ హర్షధ్వానాలు చేశారు.

ఈ కార్యక్రమంలో నేతలలోని మరొక కోణాన్ని ప్రజలు చూడగలిగారు. రాజకీయాల్లో సీరియస్ గా కనిపించే నేతలు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం వినోదాత్మకంగా అనిపించింది. వీరి నటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, కార్యకర్తలు వీటిని షేర్ చేస్తూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి రెండు రోజులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజకీయ ఒత్తిడిని మరిచి తమ వినోదం కోసం సమయం కేటాయించుకోవడం అందరికీ కొత్త అనుభూతిని కలిగించింది.

విజయవాడలో ఏ కన్వెన్షన్ సెంటర్లో ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం అత్యంత ఉత్సాహంగా సాగింది. కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దుర్యోధనుడి వేషంలో నటించి అదరగొట్టారు. సీనియర్ ఎన్టీఆర్ ఫేమస్ డైలాగ్ ‘ఏమంటివి..ఏమంటివి?’ అంటూ రఘురామకృష్ణరాజు ఏకపాత్రాభినయం చేశారు. రఘురామ డైలాగ్‌లకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో పాటు అక్కడున్న వారి చప్పట్లతో ఆ ప్రాంగణమంతా మార్మోగింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లేచి నిలబడి మరీ రఘురామను చప్పట్లతో అభినందించారు. ఇక పల్నాటి బాలచంద్రుడి వేషంలో మంత్రి కందుల దుర్గేష్ కూడా అదరగొట్టేశారు.

Tags: #APGovt#Cultural Programmes#Raghurama krishnamRajuJanasena
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Ap Cm : తిరుమల శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబం

Next Post

Pawankalyan : “రాష్ట్రానికి చంద్రబాబు మరో 15 ఏళ్లు సీఎం కావాలి”

Related Posts

Revanth Reddy
Big Story

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో పవర్ గేమ్.. అధిష్ఠానం కొత్త వ్యూహం వెనుక అసలు కథ ఇదే!

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?
Andhra Pradesh

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?

Chandrababu Welfare Policy
Andhra Pradesh

Chandrababu Welfare Policy: సంక్షేమంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాధికారత

Kadiri Railway Station Mahotsav
Andhra Pradesh

Kadiri Railway Station Mahotsav: 130 ఏళ్ల చరిత్ర ఉన్న కదిరికి స్టేషన్ మహోత్సవ్‌లో చోటెందుకు లేదు?

Revanth Reddy Education Speech
Big Story

Revanth Reddy Education Speech: ప్రైవేటు స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ పాఠశాలల్లో భారీ మార్పులు!

Ayurveda Treatment
Andhra Pradesh

Ayurveda Treatment: విరూపాక్షపురం నుంచి మూడు తరాలుగా సాగుతున్న మోహన్‌రావు కుటుంబం ఆయుర్వేద సేవా ప్రస్థానం

Next Post
Pawankalyan : “రాష్ట్రానికి చంద్రబాబు మరో 15 ఏళ్లు సీఎం కావాలి”

Pawankalyan : "రాష్ట్రానికి చంద్రబాబు మరో 15 ఏళ్లు సీఎం కావాలి"

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో పవర్ గేమ్.. అధిష్ఠానం కొత్త వ్యూహం వెనుక అసలు కథ ఇదే!

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?

Chandrababu Welfare Policy

Chandrababu Welfare Policy: సంక్షేమంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాధికారత

Kadiri Railway Station Mahotsav

Kadiri Railway Station Mahotsav: 130 ఏళ్ల చరిత్ర ఉన్న కదిరికి స్టేషన్ మహోత్సవ్‌లో చోటెందుకు లేదు?

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info