ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Political Revenge: పగకు సెలవు.. ప్రేమకు స్వాగతం! గ్రామీణ ఐక్యతపై నరసింహారెడ్డి చందమూరి ప్రత్యేక కథనం

Political Revenge
ADVERTISEMENT

“అధికారం శాశ్వతం కాదు.. అనుబంధాలు అమూల్యం!”
“పగకు సెలవు.. ప్రేమకు స్వాగతం!”

కక్షలు కార్పణ్యాలు, పగలకు కుటుంబాలు బలి కాకూడదు.. పల్లె సీమల్లో ప్రేమానుబంధాలే మనకు నిజమైన సంపద.

“కీడే చెయ్యని వాడే మనిషి.. మేలునే కోరు వాడే మహర్షి”
మరు ప్రాణి ప్రాణం తీసి బ్రతికేది మృగమేరా
మరు ప్రాణి ప్రాణం తీసి నవ్వేది అసురుడురా నిన్నటి వరకు మనిషివయ్యా
నేటి మొదలు నీవు ఋషివయ్యా
అంటూ నరసింహ సినిమా పాట మనిషిలోని మానవత్వాన్ని మేల్కొలుపుతుంది.

సల్లగాలి మోసుకొచ్చెరా సేను సెలకల ముచ్చట్లు దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గడ్డి మోపులు కాల్వ గట్టులు సెమట సుక్కల్లొ తడిసిన.. ఈ మట్టి గంధాలు ఊరూ పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులోనా దాసిపెట్టి కొడుకు కిచ్చే ప్రేమ వేరు ఊరూ పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కండ్ల ముందే యెదుగుతున్నా సంబరాల పంట పైరు

మరోవైపు బలగం సినిమాలోని పాట పల్లె జీవనంలోని మట్టి పరిమళాలను, కుటుంబ బంధాల్లోని ఆప్యాయతలను మన కళ్లముందు నిలుపుతుంది. ఒకటి మనిషి ఎలా బతకాలో చెబితే, మరొకటి మనుషుల మధ్య బంధాలు ఎంత విలువైనవో గుర్తుచేస్తుంది.ఈ రెండు పాటల సందేశాలను నేటి సమాజం ఒక్కసారి మననం చేసుకోవాలి. ముఖ్యంగా రాజకీయ ఆధిపత్యం కోసం, అధికారం కోసం, పంతాలు పట్టింపుల కోసం మనుషుల మధ్య బంధాలు సన్నగిల్లుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పాటలు మనకు కనువిప్పు కలిగించాలి.

నాయకులు మారుతారు.. ప్రభుత్వాలు మారుతాయి.. ఎన్నికలు వస్తాయి, పోతాయి, మళ్ళీ వస్తూనే ఉంటాయి కానీ రాజకీయాల పేరుతో తెగిపోయిన బంధాలు తిరిగి కలుస్తాయా? కక్షలతో కార్చిన రక్తం మళ్లీ ప్రాణం పోస్తుందా? తండ్రిని కోల్పోయిన బిడ్డకు, బిడ్డను కోల్పోయిన తల్లికి ఏ అధికారం ఓదార్పునిస్తుంది? ఒక్క క్షణం ఆలోచిస్తే చాలు.. రాజకీయాల కోసం మనుషుల మధ్య మనసులు చంపుకోవడం ఎంతటి అవివేకమో అర్థమవుతుంది.

ప్రజల సంక్షేమం, సమాజ అభివృద్ధి కోసం ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. ఎన్నికలు ప్రజాస్వామ్యంలో కీలకమైనవే. కానీ ఎన్నికలే జీవితమని, తమ పార్టీ గెలుపే పరమావధి అని భావించడం ఎంత వరకు సబబో ఆలోచించుకోవాలి. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఈరోజు గెలిచినవారు రేపు ఓడిపోవచ్చు. ఈరోజు అధికారంలో ఉన్నవారు రేపు ప్రతిపక్షంలో కూర్చోవచ్చు. ఈ ఫలితాలకు మనము మాత్రమే కాదు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ ఎన్నికల ఫలితాలతో కుటుంబ బంధాలు, స్నేహాలు, గ్రామస్థుల మధ్య అనుబంధాలు మారిపోకూడదు.

అధికారం శాశ్వతం కాదు.. అనుబంధాలే అసలైన సంపద!

ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసినా, గ్రామంలో అందరూ కలిసిమెలిసి జీవించగలగాలి. ఓటరుగా వారి వారి అభిప్రాయాలను గౌరవిద్దాం. రాజకీయ అభిప్రాయాలు వేరైనా మనుషుల మధ్య గౌరవం మాత్రం చెక్కుచెదరకూడదు.రాజకీయ నాయకుల మధ్య ఉన్న విభేదాలు సామాన్య ప్రజల జీవితాల్లోకి చొరబడినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది.అది కేవలం రాజకీయ సిద్ధాంత పరమైన వైరం మాత్రమే.. ఎవరి కోసమో ఆవేశపడుతూ ఘర్షణలకు దిగడం, అక్కరకు రాని కేసుల్లో చిక్కుకోవడం, కుటుంబ సభ్యులకు మనశ్శాంతి లేకుండా చేసుకోవడం వల్ల ఎవరికి ప్రయోజనం? నాయకుల రాజకీయ భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పెట్టడం అవసరమా?

రాజకీయ పగకు ఎవ్వరూ బలి కాకూడదు!

రాజకీయ, వర్గ కక్షలతో గతంలో నాశనమైన కుటుంబాలను, అభివృద్ధికి దూరమైన గ్రామాలను పరిశీలిస్తే ఎన్నో చేదు నిజాలు కనిపిస్తాయి. ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయేవారు, గాయపడేవారు, కేసులతో ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగేవారు ఎక్కువగా సామాన్య కుటుంబాల వారే. నాయకుల మధ్య విభేదాలు ఉన్నా, వాటి ప్రభావం కిందిస్థాయి కార్యకర్తల జీవితాలపై పడినప్పుడు నష్టం మాత్రం వారి కుటుంబాలకే.నేటి స్థితిలో మార్పును చైతన్యాన్ని చూస్తున్నాం..ఇంకా మార్పు రావాలి.

ఒకరు ప్రాణాలు కోల్పోతే రెండు కుటుంబాలు విషాదంలో మునిగిపోతాయి. ఒక ఇంట్లో తండ్రి లేకపోతే పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. మరో ఇంట్లో తల్లి తన బిడ్డ కోసం జీవితాంతం కన్నీరు పెట్టుకోవాల్సి వస్తుంది. భార్యాభర్తలు, అన్నదమ్ములు, పిల్లలు అనుభవించే వేదనను ఏ రాజకీయ విజయమూ భర్తీ చేయలేదు. కక్ష సాధింపుతో సాధించేది క్షణిక సంతృప్తి మాత్రమే; కోల్పోయేది జీవితాంతం వెంటాడే ప్రశాంతత.అందుకే రాజకీయ నాయకులైనా, కార్యకర్తలైనా, సాధారణ ప్రజలైనా హింసకు దూరంగా ఉండాలి. విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. తప్పులను ప్రశ్నించాలి, ప్రజా సమస్యలపై పోరాడాలి. వ్యక్తిగత విమర్శలు మాని సిద్ధాంత పరమైన విమర్శలు చేస్తూ ప్రజల మన్ననల్ని పొందాలి.కానీ ఆ పోరాటం వ్యక్తిగత శత్రుత్వంగా మారకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థి ఉండవచ్చు.. శత్రుత్వం అవసరం లేదు.

పల్లె సీమల్లో మళ్లీ ఆప్యాయతలు వెల్లివిరియాలి!

బలగం సినిమాలోని పాట పల్లెటూరి జీవనంలోని సహజత్వాన్ని, మట్టి పరిమళాలను, కుటుంబ బంధాల మాధుర్యాన్ని గుర్తుచేస్తుంది. ఒకప్పుడు పల్లెల్లో ఒకరి ఇంట్లో శుభకార్యం జరిగినా, విషాదం సంభవించినా ఊరంతా ఒక కుటుంబంలా స్పందించేది. పొలం పనుల్లో ఒకరికొకరు సహకరించుకునేవారు. కష్టసుఖాల్లో తోడుగా నిలిచేవారు. రాజకీయ అభిప్రాయాలు వేరైనా పండుగలు, పెళ్లిళ్లు, కుటుంబ వేడుకల్లో కలిసిమెలిసి ఉండేవారు.నేడు ఆ ఆప్యాయతలను తిరిగి నిలబెట్టుకోవాలి. కులం పేరుతో విడిపోకూడదు. వర్గం పేరుతో కొట్టుకోకూడదు. పార్టీ జెండాల కోసం పక్కింటి వారిని శత్రువులుగా చూడకూడదు. ఓటు వేసే సమయంలో మన అభిప్రాయాలు వేరుగా ఉండవచ్చు. కానీ మన పిల్లలు ఒకే బడిలో చదువుతారు. మన పొలాలకు నీరు అవసరం. మన వీధులకు రహదారులు కావాలి. మన గ్రామాలకు అభివృద్ధి కావాలి. ఈ అవసరాలు పార్టీ విభేదాల కంటే ఎంతో ముఖ్యమైనవి.

పల్లెల్లో ప్రశాంత వాతావరణం నెలకొన్నప్పుడే రైతులు వ్యవసాయంపై దృష్టి పెట్టగలరు. యువత ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోగలరు. వ్యాపారాలు అభివృద్ధి చెందగలవు. పిల్లలు భయం లేకుండా పెరగ గలరు. కక్షలు, ఘర్షణలు, దాడులు గ్రామాన్ని వెనక్కి నెట్టేస్తాయి. ప్రేమ, సహకారం, ఐక్యత గ్రామాన్ని ముందుకు నడిపిస్తాయి.

కక్షలకు,ద్వేషాలకు కాదు.. చదువు, సాగు, ఉపాధికి ప్రాధాన్యం!

ఒంటరిగా ఉన్న అక్షరానికి పరిమితమైన అర్థమే ఉంటుంది. అక్షరాలు కలిసినప్పుడే అర్థవంతమైన పదాలు, వాక్యాలు ఏర్పడతాయి. మనుషులు కూడా అంతే. ఒక్కొక్కరిగా విడిపోయి ఉంటే సాధించలేనివి, అందరూ కలిసికట్టుగా పనిచేస్తే సాధించగలరు. వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది. వ్యవస్థ బలంగా ఉండాలంటే సంఘజీవనం బలంగా ఉండాలి. సమాజం అభివృద్ధి చెందాలంటే పరస్పర సహకారం అవసరంమన గ్రామానికి ఏం కావాలి? రైతులకు సాగునీరు కావాలి. పిల్లలకు నాణ్యమైన విద్య కావాలి. యువతకు ఉపాధి కావాలి. మహిళలకు భద్రత కావాలి. గ్రామానికి మెరుగైన రహదారులు, పారిశుధ్యం, ఆరోగ్య సదుపాయాలు కావాలి. వీటిని సాధించడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలి.కలసికట్టుగా గ్రామస్థులు అధిక సంఖ్యలో వెళ్లి ప్రజాప్రతినిధిని కలిస్తే తప్పకుండా స్పందిస్తాడు.కత్తి, కక్షలకు ఖర్చు చేసే సమయాన్ని, శక్తిని అభివృద్ధికి వినియోగించాలి.

ఎన్నికల్లో గెలిచినవారు ఓడిపోయినవారిని శత్రువులుగా చూడకూడదు. ఓడిపోయినవారు ప్రజల తీర్పును గౌరవిస్తూ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలి. గెలిచినవారు అందరినీ కలుపుకొని ముందుకు సాగాలి. ప్రజలకు సేవ చేయడమే రాజకీయాల అసలు లక్ష్యమని గుర్తించాలి. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం ప్రజలకు నిజమైన మేలు చేస్తుంది.

పగకు సెలవు.. ప్రేమకు స్వాగతం!

ఎవరి ఇంట దీపం ఆరినా.. ఏ తల్లి గుండె రోదించినా.. ఎవరి బిడ్డ అనాథ అయినా అది ఒక్క కుటుంబం కన్నీరు మాత్రమే కాదు; మన సమాజ మానవత్వానికి ఎదురైన పరీక్ష. రాజకీయ పగకు బలైపోయే ప్రతి కుటుంబం మనకు ఒక హెచ్చరిక. మరో కుటుంబం కన్నీరు పెట్టుకోకుండా చూడటం మనందరి బాధ్యత.భగవంతుడు, రాక్షసుడు మనలోనే ఉంటారంటారు. మన ఆలోచనలు, మన చర్యలే మనలోని మంచితనాన్ని లేదా క్రూరత్వాన్ని బయటపెడతాయి. మన పిలుపు కక్షల వైపు కాకుండా కరుణ వైపు ఉండాలి. మన అడుగులు విధ్వంసం వైపు కాకుండా అభివృద్ధి వైపు సాగాలి. ఇతరులకు కీడు చేయకుండా, అందరి మేలు కోరుతూ జీవించడమే నిజమైన మానవత్వం.

మన దేశం బాగుండాలంటే గ్రామాలు బాగుండాలి. గ్రామాలు బాగుండాలంటే కుటుంబాలు ప్రశాంతంగా ఉండాలి. కుటుంబాలు ప్రశాంతంగా ఉండాలంటే మనుషుల మధ్య బంధాలు చెక్కుచెదరకుండా ఉండాలి.ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసినా మన ఊరి అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం. గెలిచినవారిని అభినందిద్దాం. ఓడినవారిని గౌరవిద్దాం. విభేదాలను వైషమ్యాలుగా మార్చకుండా, భిన్నాభిప్రాయాలను ప్రజాస్వామ్య సౌందర్యంగా స్వీకరిద్దాం.పగలు మాని ప్రేమగా కలిసుందాం.. పల్లె సీమలో శాంతి దీపం వెలిగిద్దాం! కత్తి, కక్షలకు స్వస్తి చెప్పి చదువు, సాగు, ఉపాధి, అభివృద్ధికి బాటలు వేద్దాం. మన పిల్లల రేపటి కోసం మనమే మారుదాం.. మన ఊరినే మార్చుదాం.ఓటు వేరు.. బంధం ఒక్కటే! రాజకీయాలు వేరు.. మన ఊరు ఒక్కటే! మనుషుల మధ్య ప్రేమానుబంధాలే మన నిజమైన సంపద. వాటిని కాపాడుకోవడమే మన భవిష్యత్తుకు భరోసా.

వేటూరి సుందర రామమూర్తి ముత్యాల ముగ్గు సినిమా లో పాట మనకాదర్శం కావాలి.
మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ
పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ.

“కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు
తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు”
……
…. Political Revenge
బోయవాడైన వాల్మీకిని రామాయణ మహాకావ్య కర్తగా మార్చింది ఆ కృషే!
సద్భావనతో ఆలోచింతురుగాక…

సర్వేజనా సుఖినోభవంతు!

నరసింహారెడ్డి చందమూరి
ఫ్రీలాన్స్ జర్నలిస్టు
కదిరి.

Tags: # TeluguJournalism#Democracy#FamilyValues#Humanity#Kadiri#LoveAndUnity#NarasimhaReddyChandamuri#PeaceAndHarmony#PoliticalRevenge#RuralLife#StopPoliticalViolence#VillageDevelopment
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

ElectionReforms:ఈవీఎంల నుంచి బ్యాలెట్ పేపర్లకు.. ఎన్నికల వ్యవస్థ వెనక్కా? ముందుకా?

Next Post

Telangana: ఉమ్మడి వరంగల్ బీఆర్ఎస్‌లో గ్రూప్ వార్.. కేటీఆర్ ఫుల్‌స్టాప్ పెడతారా?

Related Posts

Telangana
Big Story

Telangana: ఉమ్మడి వరంగల్ బీఆర్ఎస్‌లో గ్రూప్ వార్.. కేటీఆర్ ఫుల్‌స్టాప్ పెడతారా?

#EVM, #BallotPaper, #VVPAT, #ElectionReforms, #IndianDemocracy, #AndhraPradeshPolitics, #MunicipalElections, #OnlineVoting, #ElectionCommission, #NarasingaReddyChandamuri
Andhra Pradesh

ElectionReforms:ఈవీఎంల నుంచి బ్యాలెట్ పేపర్లకు.. ఎన్నికల వ్యవస్థ వెనక్కా? ముందుకా?

AP Politics, YS Jagan, Chandrababu Naidu, Narendra Modi, Sajjala Ramakrishna Reddy, YSRCP, TDP, BJP, Congress, NDA Alliance, Andhra Pradesh Politics
Andhra Pradesh

YSRCP:మోదీని వదిలితే జగన్‌కు రాజకీయంగా లాభమా? వైసీపీ భవిష్యత్తుపై చర్చ

#KadiriMunicipality, #KadiriPolitics, #ArpiaBhanu, #AttarParveen, #TDP, #YSRCP
Andhra Pradesh

KadiriMunicipality:కదిరి మున్సిపల్ చైర్మన్ పోరు ఆసక్తికరం.. టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ

#YadadriPowerPlant, #TelanganaPolitics, #BRS, #Congress, #KCR, #KTR, #KrishnaRiverWater, #GodavariRiver, #TelanganaWaterRights, #PalamuruRangareddy, #IrrigationProjects, #ThermalPowerPlant, #CoalImport, #Singareni, #PowerGeneration, #TelanganaGovernment, #PoliticalNews, #TelanganaAssembly, #PublicFunds, #TelanganaNews
Big Story

Telangana:కృష్ణా జలాల నుంచి యాదాద్రి పవర్ ప్లాంట్ వరకు.. బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ప్రభుత్వ ఘాటు విమర్శలు

#SriSathyaSaiDistrict, #ZPChairman, #ZillaParishad, #ParitalaSriram, #KethireddyVenkataKrishnaReddy, #VajraBhaskarReddy, #Mudigubba, #Kadiri, #Dharmavaram, #AndhraPradeshPolitics, #TDP, #YSRCP, #LocalBodyElections, #ZPTCElections, #PoliticalAnalysis, #AndhraPolitics, #DistrictPolitics, #ZPChairmanRace, #ElectionUpdates, #PoliticalNews
Big Story

ZPChairman:జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎవరికి? ముదిగుబ్బ నుంచే పరిటాల శ్రీరామ్, కేతిరెడ్డి పోటీనా?

Next Post
Telangana

Telangana: ఉమ్మడి వరంగల్ బీఆర్ఎస్‌లో గ్రూప్ వార్.. కేటీఆర్ ఫుల్‌స్టాప్ పెడతారా?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Telangana

Telangana: ఉమ్మడి వరంగల్ బీఆర్ఎస్‌లో గ్రూప్ వార్.. కేటీఆర్ ఫుల్‌స్టాప్ పెడతారా?

Political Revenge

Political Revenge: పగకు సెలవు.. ప్రేమకు స్వాగతం! గ్రామీణ ఐక్యతపై నరసింహారెడ్డి చందమూరి ప్రత్యేక కథనం

#EVM, #BallotPaper, #VVPAT, #ElectionReforms, #IndianDemocracy, #AndhraPradeshPolitics, #MunicipalElections, #OnlineVoting, #ElectionCommission, #NarasingaReddyChandamuri

ElectionReforms:ఈవీఎంల నుంచి బ్యాలెట్ పేపర్లకు.. ఎన్నికల వ్యవస్థ వెనక్కా? ముందుకా?

AP Politics, YS Jagan, Chandrababu Naidu, Narendra Modi, Sajjala Ramakrishna Reddy, YSRCP, TDP, BJP, Congress, NDA Alliance, Andhra Pradesh Politics

YSRCP:మోదీని వదిలితే జగన్‌కు రాజకీయంగా లాభమా? వైసీపీ భవిష్యత్తుపై చర్చ

Recent News

Telangana

Telangana: ఉమ్మడి వరంగల్ బీఆర్ఎస్‌లో గ్రూప్ వార్.. కేటీఆర్ ఫుల్‌స్టాప్ పెడతారా?

Political Revenge

Political Revenge: పగకు సెలవు.. ప్రేమకు స్వాగతం! గ్రామీణ ఐక్యతపై నరసింహారెడ్డి చందమూరి ప్రత్యేక కథనం

#EVM, #BallotPaper, #VVPAT, #ElectionReforms, #IndianDemocracy, #AndhraPradeshPolitics, #MunicipalElections, #OnlineVoting, #ElectionCommission, #NarasingaReddyChandamuri

ElectionReforms:ఈవీఎంల నుంచి బ్యాలెట్ పేపర్లకు.. ఎన్నికల వ్యవస్థ వెనక్కా? ముందుకా?

AP Politics, YS Jagan, Chandrababu Naidu, Narendra Modi, Sajjala Ramakrishna Reddy, YSRCP, TDP, BJP, Congress, NDA Alliance, Andhra Pradesh Politics

YSRCP:మోదీని వదిలితే జగన్‌కు రాజకీయంగా లాభమా? వైసీపీ భవిష్యత్తుపై చర్చ

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info