ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Polavaram :పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి లక్ష్యం 💧

Polavaram:పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి లక్ష్యం 💧

Polavaram :పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి లక్ష్యం 💧
ADVERTISEMENT

*పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేయాలనేది లక్ష్యం*

*2027లో గౌరవ ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం*

*పోలవరం పనుల ప్రగతిపై కేంద్రం సంతృప్తి*

*ఢిల్లీలో సమీక్ష సమావేశం అనంతరం మంత్రి రామానాయుడు వివరాలు వెల్లడి*

పడకేసిన ‘పోలవరం’ పనుల ను పట్టాలెక్కించి, పరుగులు తీయిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలోని కూటమి ప్రభుత్వ పనితీరు పట్ల కేంద్రం పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసినట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.
ఢిల్లీలో సోమవారం కేంద్ర జల శక్తి మంత్రి పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన పోలవరం పనుల సమీక్షా సమావేశం వివరాలను మంత్రి మీడియాకు వివరించారు. 2019-24 మధ్య జగన్ ఐదేళ్ల పాలనలో పోలవరానికి జరిగిన నష్టాన్ని, విధ్వంసాన్ని, 2024 లో కూటమి ప్రభుత్వ అధికారం లోకి వచ్చిన తర్వాత పరిస్థితులను చక్కదిద్ది.. పనులను పరుగులు పెట్టిస్తున్న నేటి స్థితి వరకు సమీక్షలో చర్చించామన్నారు. కాలావధి లక్ష్యాన్ని నిర్ణయించుకుని 2027 డిసెంబర్ కల్లా.. వీలైతే పుష్కరాలకు ముందు అంటే అదే ఏడాది జూన్ లోనే పోలవరం పూర్తి చేసి ప్రధాని మోడీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పాటిల్ స్వాగతించారు. సంతృప్తిని వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి, జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్దేశిత గడువులో పూర్తి చేయడానికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర జల శక్తి మంత్రి పాటిల్ హామీ ఇచ్చినట్లు రామానాయుడు స్పష్టం చేశారు. ఇందుకు ఆయనకు, గౌరవ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ ఉండటం వల్ల పోలవరం పూర్తి కావడం, పోలవరం నీటితో రాష్ట్రం సస్యశ్యామలం కావడం ఖాయమన్నారు.

2019లో తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే 2021 లోనే పోలవరం పూర్తయ్యేదని మంత్రి రామానాయుడు చెప్పారు. 72% పూర్తయిన పోలవరం ప్రాజెక్టు ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల, రివర్స్ పాలన తో నీరుగార్చడం వల్ల ప్రాజెక్టుకు అపార నష్టం జరిగిందని మంత్రి ఆవేదన చెందారు. ప్రాజెక్ట్ కు జరిగిన నష్టం తో పాటు ఐదేళ్లలో రాష్ట్రంలోని అన్నదాతలకు రావలసిన 50 వేల కోట్ల ఆదాయం నష్టపోయినట్లు మంత్రి అంచనా వేశారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 23.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ జరుగుతుందన్నారు. 28.5 లక్షలు మందికి తాగునీరు అందుతుందన్నారు. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. పోలవరంతో రాష్ట్రం దశ దిశ మారిపోవడం ఖాయమన్నారు. ఈ ఆశయంతోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయం పర్యవేక్షణలో ప్రతి 15 రోజులకు సమీక్ష చేస్తూ పనులను పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. అందులో భాగంగా అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ 1398 మీటర్లకు గాను ఇప్పటికి 686 మీటర్లు అంటే 56% పూర్తయినట్లు చెప్పారు. ప్రస్తుత వర్షాకాలంలో రోజుకి 5 లక్షలు పైగా క్యూసెక్కులు వరద నీరు ప్రవహిస్తున్నా పనులు ఆపలేదన్నారు. అదే జగన్ ఐదేళ్ల హయాంలో ఎగువ, దిగువ కాపర్ డ్యాముల మధ్య వరద నీరు రిజర్వాయర్ ను తలపించే దన్నారు. ఇలా జరగకుండా బట్రస్ డ్యామ్ నిర్మించి సిపేజీని అరికట్టామన్నారు. పోలవరం ప్రాజెక్టుకి నాటి జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని, దశల వారి జరిగిన విధ్వంసాన్ని మంత్రి కళ్ళకు కట్టినట్లు వివరించారు. వారి బాధ్యతా రాహిత్యాన్ని ఎండగట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 2014-19 మధ్యకాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టిన 3750 కోట్లు, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియంబర్స్మెంట్ గా వస్తే ఆ నిధులను దారి మళ్లించేసినట్లు రామానాయుడు వివరించారు.

*ప్రాజెక్టుకి నిధుల సమస్య లేదు*

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టుకి రూ.12157 కోట్లు కేంద్రం మంజూరు చేయగా ఇప్పటికే 5052 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. చేసిన పనులు తాలూకు వివరాలు ఎప్పటికప్పుడు కేంద్రానికి సమర్పిస్తే, దశల వారీగా నిధులు కేంద్రం మంజూరు చేస్తుందని.. అందువల్ల నిధుల సమస్య లేనే లేదని మంత్రి స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్ట్ ఫేజ్ -1కి సంబంధించి (అంటే 41.15 మీటర్ల ఎత్తుకు నీటిని నిలబెట్టే వరకు ) నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ నష్టపరిహారం, కాలనీల నిర్మాణం, వసతులు సమకూర్చడం వంటి అన్ని పనులు 2026 మే నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి చెప్పారు. మొదటి ఫేజ్ లో 20946 మంది నిర్వాసితులు ఉన్నట్లు చెప్పారు. వీరందరికీ 75 కాలనీలు నిర్మించాల్సి ఉండగా ఇప్పటికి 26 పూర్తయినట్లు చెప్పారు. మిగిలిన 49 ప్రోగ్రెస్ లో ఉన్నాయన్నారు. బ్యాలెన్స్ పనులకు, ఇతర సదుపాయాలు సమకూర్చడానికి రూ. 900 కోట్లు కేటాయించి టెండర్లు పిలిచామన్నారు. ఫేజ్- 2 కి సంబంధించి నిర్వాసితులకు 2027 మార్చి కల్లా కాలనీలు నిర్మించి, సదుపాయాలు సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రామానాయుడు చెప్పారు.

పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని చేతులెత్తేసిన నాటి ముఖ్యమంత్రి జగన్ కి, గడువు చెప్పి.. ప్రారంభానికి పనులు పరుగులు పెట్టిస్తున్న నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దక్షతకు తేడా గమనించాలని రామానాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మొదటి ఫేజ్ లో 41.15 మీటర్లు కాంటూరు కి సంబంధించి 38వేల 060 కుటుంబాలను గుర్తించామన్నారు. ఇందులో మొదటి విడతలో 20,946, తరువాత రాడార్ సర్వే ద్వారా మరో 17,174 కుటుంబాలకు 75 కాలనీలు అవసరమైతే, నాడు చంద్రబాబు గారి హయాంలోనే 26 కాలనీలు పూర్తి చేశాం.49 కాలనీలో పురోగతిలో ఉన్నాయని వివరించారు

2019-24 జగన్ పరిపాలనా కాలంలో ఒక్కకాలనీలో ఒక్క నిర్వాసితుడి ఇంటికి, అరబస్తా సిమెంట్ గానీ, మౌళిక వసతుల కోసం ఒక్క రూపాయి గానీ ఖర్చు పెట్టలేదని విమర్శించారు.
నాడు చంద్రబాబు ప్రభుత్వంలో నిర్మించిన కాలనీలు తప్ప, ఒక్క నిర్వాసితుడి ఇంటిని కూడా పూర్తి చేయలేదని అన్నారు.

Tags: #AndhraPradesh#CentralGovernment#ChandrababuNaidu#DamConstruction#Development#DoubleEngineGovernment#ElectricityGeneration#GodavariPushkarams#GovernmentInitiative#InfrastructureDevelopment#Irrigation#IrrigationProject#MahaPushkarats#NarendraModi#NimmalaRamaNaidu#Polavaram#ProjectProgress#Pushkaralu2027#Rehabilitation#Reservoir#waterresources#WaterSupply
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Bjp Mp khagen Murmu: వరద బాధితులకు సాయం చేస్తుండగా ఎంపీపై రాళ్ల దాడి.. తలకు తీవ్ర గాయాలు..అసలేమైందంటే?

Next Post

Mega157: మీసాల పిల్ల సాంగ్.. బ్లాక్ బస్టర్ వైబ్..!

Related Posts

RaashiKhanna
Entertainment

RaashiKhanna:“పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడమే నా డ్రీమ్… ఈ సినిమాలో వింటేజ్ పవన్ కనిపిస్తారు” – రాశీ ఖన్నా వ్యాఖ్యలు వైరల్

EyelineStudios
Big Story

EyelineStudios:హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభం – భారత్ ఫ్యూచర్ సిటీలో విస్తరణకు స్థలం కేటాయిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

NaraLokesh
Andhra Pradesh

NaraLokesh:సాగర్ డిఫెన్స్‌తో వేల ఉద్యోగాల అవకాశాలు.మంత్రి నారా లోకేష్

PMKisan
Big Story

PMKisan:9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18,640 కోట్లు జమ చేయనున్న ప్రధాని మోదీ

MalaikaArora
Entertainment

MalaikaArora:వివాహ వేడుకలో మెరిసిన మలైకా అరోరా.. కృతికా కమ్రా–గౌరవ్ కపూర్ పెళ్లిలో గ్లామర్ హైలైట్

RechargeScam
Big Story

RechargeScam:28 రోజుల “నెలవారీ” రీఛార్జ్ స్కామ్.. పార్లమెంటులో లేవనెత్తిన అంశం, వినియోగదారులకు అదనపు భారమా?

Next Post
Mega157: మీసాల పిల్ల సాంగ్.. బ్లాక్ బస్టర్ వైబ్..!

Mega157: మీసాల పిల్ల సాంగ్.. బ్లాక్ బస్టర్ వైబ్..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

RaashiKhanna

RaashiKhanna:“పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడమే నా డ్రీమ్… ఈ సినిమాలో వింటేజ్ పవన్ కనిపిస్తారు” – రాశీ ఖన్నా వ్యాఖ్యలు వైరల్

EyelineStudios

EyelineStudios:హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభం – భారత్ ఫ్యూచర్ సిటీలో విస్తరణకు స్థలం కేటాయిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

NaraLokesh

NaraLokesh:సాగర్ డిఫెన్స్‌తో వేల ఉద్యోగాల అవకాశాలు.మంత్రి నారా లోకేష్

PMKisan

PMKisan:9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18,640 కోట్లు జమ చేయనున్న ప్రధాని మోదీ

Recent News

RaashiKhanna

RaashiKhanna:“పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడమే నా డ్రీమ్… ఈ సినిమాలో వింటేజ్ పవన్ కనిపిస్తారు” – రాశీ ఖన్నా వ్యాఖ్యలు వైరల్

EyelineStudios

EyelineStudios:హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభం – భారత్ ఫ్యూచర్ సిటీలో విస్తరణకు స్థలం కేటాయిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

NaraLokesh

NaraLokesh:సాగర్ డిఫెన్స్‌తో వేల ఉద్యోగాల అవకాశాలు.మంత్రి నారా లోకేష్

PMKisan

PMKisan:9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18,640 కోట్లు జమ చేయనున్న ప్రధాని మోదీ

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info