పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఈ నెల 1వ తేదీ నుంచి 19(శుక్రవారం) వరకు మొత్తం నాలుగు రోజులు సెలవులు పోగా.. 15 రోజుల పాటు ఉభయ సభలు జరిగాయి. అయితే.. ఏం సాధించారు? అనేది కీలక ప్రశ్న. ఒక రోజు రోజంతా.. వందేమాతరం గేయంపై చర్చ చేపట్టారు. తర్వాత.. రెండు రోజులు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియపై అధికార, ప్రతిపక్షాలు వాదులాడుకున్నాయి. నువ్వెంత అంటే.. నువ్వెంత అన్నట్టుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీలు విమర్శించుకున్నారు.
వందేమాతరంపై చర్చ సందర్భంగా తొలి భారత ప్రధాని నెహ్రూపై ప్రధాని మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వందేమాతరాన్ని ఒక మతానికి అంటగట్టి.. ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. ఆయన వల్లే.. దేశ విభజన(పాకిస్థాన్) జరిగిందన్నారు. పవిత్రమైన గేయాన్ని రెండు చరణాలకే పరిమితం చేసి.. రాజకీయ క్రీడకు తెరదీశారని ఆరోపించారు. వందేమాతరం.. కేవలం గేయం కాదని.. అదొక శక్తి అని చాటారు. మొత్తంగా 11 గంటల 43 నిమిషాల పాటు.. (ఉదయం 12 నుంచి రాత్రి దాదాపు 12 వరకు) జరిగిన చర్చలో ప్రధాని 1.40 గంటల పాటు ప్రసంగించారు. దీనికి ఏకంగా 22 కోట్ల రూపాయలు ఖర్చయినట్టు సచివాలయం వెల్లడించింది. ఏం సాధించారంటే.. ప్రశ్న తప్ప ఆన్సర్ లేదు.
ఇక, తదుపరి రెండు రోజులు చేపట్టి `సర్`పై చర్చ హద్దులు మీరింది. ఓట్ చోరీ అంశాన్ని కాంగ్రెస్ లేవనెత్తగా.. బీజేపీ నాయకు లు, మంత్రులు.. ఎదురు దాడి చేశారు. ఓట్ చోరీ చేసింది నెహ్రూ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీనేనని బీజేపీ నాయకులు ఆరోపిం చారు. ఆ నాడు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను ఓట్ చోరీ చేసి ఓడించారంటూ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. నిప్పులు చెరిగారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత రాహుల్‌పై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయి.. ఒక దశలో `సాలే` అంటూ వ్యాఖ్యానించారని కాంగ్రెస్ ఎంపీలు తప్పుబట్టారు. మొత్తంగా ఉభయ సభల్లోనూ.. ఉదయం అంతా నిరవధిక వాయిదాలు కొనసాగాయి. సర్ ప్రక్రియను ఎవరూ ఆపలేరని.. ఆగబోదని కేంద్రం స్పష్టం చేసింది.
ఇక, మరో కీలక అంశం.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు. దీనిని అనూహ్యంగా తెరమీదికి తెచ్చారు. వాస్తవానికి పేరు మార్పు అంటూ.. తొలుత.. `పూజ్య బాపూజీ`పేరు జోడించారు. దీనిపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు వ్యక్తం చేయడంతో పూర్తిగా అసలు గాంధీ పేరునే తీసేస్తూ.. తదుపరి రోజు రాత్రికి రాత్రి బిల్లును తీసుకువచ్చారని పలువురు ఎంపీలు ఆక్షేపించారు. ఈ చట్టాన్ని.. `వికసిత్ భారత్ గ్యారెంటీ(వీబీజీ)-ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్(రామ్‌జీ)-(వీబీ జీ-రామ్‌జీ)` పేరుతో బిల్లును తీసుకువచ్చారు. దీనిపై కూడా బీజేపీ-కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్యుద్ధం నడిచింది. అయినా.. కేంద్రం వెనక్కి తగ్గలేదు. అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత.. బిల్లును ఆమోదించారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాల చివరి రోజు.. ఢిల్లీలో వాయుకాలుష్యంపై చర్చకు కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉభయ సభల్లోనూ పట్టుబట్టారు. అయితే.. సర్‌పై చర్చ కొనసాగడంతోపాటు.. ఇతర రాష్ట్రాల ఎంపీలు సర్‌కు వ్యతిరేకంగా.. నినాదాలు.. చేయడంతో సభలలో గందరగోళంనెలకొంది. దీంతో ఢిల్లీ పొల్యూషన్‌పై ఎలాంటి చర్చ లేకుండానే సభలు ముగిశాయి. ఈసందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి(బీజేపీ) కిరెణ్ రిజుజు మాట్లాడుతూ.. “ఢిల్లీ పొల్యూషన్‌పై చర్చ చేపట్టాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. కానీ, కాంగ్రెస్ సభ్యులే దీనిని ముందుకు సాగకుండా అడ్డుకున్నారు. ఈ తప్పువారిదే“ అని వ్యాఖ్యానించారు. మొత్తంగా.. శీతాకాల సమావేశాలు ముగిశాయి.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కూడా ఆందోళనలు, నిరసనలతోనే సమాప్తమయ్యాయి. గత వర్షాకాల సమావేశాల మాదిరిగా ‘సర్’పైనే రాద్ధాంతం నడిచింది. ఈ సమావేశాల్లో మాత్రం ‘SIR’పై చర్చ చేపట్టారు. అయితే ఈ సెషన్స్‌లో కాలుష్యంపై చర్చకు కాంగ్రెస్ పట్టుబట్టింది. కానీ ఎలాంటి చర్చ లేకుండా ముగిశాయి.
తాజా సమావేశాలు దాదాపు 19 రోజులు నడిచాయి. డిసెంబర్ 1న ప్రారంభమైన శీతాకాల సమావేశాలు.. శుక్రవారం (డిసెంబర్ 19)తో ముగిశాయి. కానీ దేశ రాజధానిని పట్టిపీడిస్తు్న్న కాలుష్యంపై మాత్రం చర్చ జరగకుండానే సమావేశాలు ముగియడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఢిల్లీ వాసులు ఎంత విజ్ఞప్తి చేసినా సభ్యులు పట్టించుకోలేదు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1న ప్రారంభమయ్యాయి. అయితే ఈ సమావేశాల్లోనే ‘ఢిల్లీ కాలుష్యం’పై చర్చకు డిమాండ్ చేస్తామని విపక్ష పార్టీలు అన్నాయి. తీరా చూస్తే.. అలాంటి ఊసే లేకుండా సమావేశాలు ముగిసిపోవడం చర్చనీయాంశం అవుతోంది. శుక్రవరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధిక వాయిదా వేశారు. పలు బిల్లులు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ముఖ్యంగా ‘జీ-రామ్-జీ’ బిల్లు ఆమోదం పొందింది. విపక్షాల ఆందోళనలు మధ్యే బిల్లు ఆమోదం పొందింది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ ఈ బిల్లు తీసుకొచ్చారు.
వీబీ జీ రామ్ జీ బిల్లుకు వ్యతిరేకంగా లోక్‌సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. అయితే ప్రశ్నోత్తరాల సమయానికి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. చివరి రోజు సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. మన్రేగా స్థానంలో కేంద్ర ప్రభుత్వం జీ రామ్ జీ బిల్లును తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఆ బిల్లును వ్యతిరేకిస్తూ గురువారం విపక్షాలు ఆందోళన చేపట్టాయి. బిల్లు ప్రతులను చింపి, నినాదాలు చేశాయి. మూజువాణి ఓటు ద్వారా రాజ్యసభలోనూ ఆ బిల్లు పాసైంది.
మరో వైపు జీరామ్‌జీ బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఆవరణలో రాత్రంతా టీఎంసీ ఎంపీలు ధర్నా చేపట్టారు. ఆ బిల్లుపై రెండు సభల్లోనూ ఎటువంటి చర్చ చేపట్టలేదని, బుల్డోజ్ చేశారని టీఎంసీ ఎంపీలు ఆరోపించారు. సంవిదాన్ సదన్ గేటు వద్ద తృణమూల్ ఎంపీలు ధర్నా చేపట్టారు. గాంధీ,ఠాగూర్ ఫోటోలు ఉన్న బ్యానర్లను ప్రదర్శించారు. తృణమూల్ ఎంపీలు 12 గంటల ధర్నా చేపట్టారని, అర్థరాత్రి ధర్నా స్టార్ట్ చేశామని, ఇవాళ మధ్యాహ్నం వరకు తాము ధర్నా చేయనున్నట్లు టీఎంసీ నేత సాగరికా ఘోష్ తెలిపారు. మోదీ సర్కారు బుల్డోజ్ చర్యలకు పాల్పడుతున్నట్లు ఎంపీ సాగరిక ఆరోపించారు.
రాజ్యసభను కూడా ఇవాళ నిరవధికంగా వాయిదా వేశారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మాట్లాడుతూ 269వ రాజ్యసభ సమావేశాలు ముగిసినట్లు వెల్లడించారు. తనను రాజ్యసభ చైర్మెన్‌గా ఎంపిక చేసినందుకు సభ్యులకు ఆయన థ్యాంక్స్ తెలిపారు. సభా కార్యక్రమాలు జరిగిన తీరు పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మునుముందు కూడా ఇలాగే సభ కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. జీరో అవర్, క్వశ్చన్ అవర్ చాలా ప్రయోజనకరంగా జరిగినట్లు సీపీ రాధాకృష్ణన్ తెలిపారు.


















