నూతన సంవత్సరం అంటే కేవలం ఒక తేదీ మార్పు మాత్రమే కాదు, కొత్త జీవితానికి ఆరంభం, కొత్త మార్పులకు శ్రీకారం. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రజల్లో ఎన్నో ఆశలు, ఆకాంక్షలు కనిపిస్తాయి. సంవత్సరం తొలి రోజున కొన్ని శుభకార్యాలతో ప్రారంభిస్తే, ఏడాది పొడవునా ఆనందం, సుఖసమృద్ధి నిలకడగా ఉంటాయని నమ్మకం.
చూసేలోపే మరో సంవత్సరం ముగిసిపోయింది. కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి ఇప్పుడు కేవలం కొద్ది రోజులే మిగిలాయి. రాబోయే నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శాంతి, సమృద్ధిని తీసుకురావాలని అందరూ మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, కొత్త ఏడాది నిజంగా సుఖసంతోషాలతో సాగాలంటే సంవత్సరపు మొదటి రోజున కొన్ని పనులను తప్పనిసరిగా చేయకూడదని చెబుతారు. కొత్త సంవత్సరపు తొలి రోజున చేసే కొన్ని చిన్న తప్పిదాలే జీవితంలో అనవసరమైన కష్టాలు, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడిని తీసుకురావచ్చని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నూతన సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్‌లో తేదీ మారడమే కాదు. అది కొత్త ఆలోచనలు, కొత్త ఆశలు, కొత్త జీవన ప్రయాణానికి ఆరంభం. అందుకే ప్రతి ఒక్కరూ కొత్త ఏడాదిపై ఎన్నో కలలు, ఆశలు పెట్టుకుంటారు. సంవత్సరం మొదటి రోజు శుభకార్యాలతో ప్రారంభమైతే, ఆ ఏడాది మొత్తం సుఖసమృద్ధులతో గడుస్తుందనే నమ్మకం చాలామందిలో ఉంటుంది. అందుకే చాలా మంది కొత్త సంవత్సరం రోజున పూజలు, జపాలు, దానధర్మాలు చేస్తారు. అయితే శుభకార్యాలే కాకుండా, ఆ రోజున చేయకూడని కొన్ని పనులు ఉన్నాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
ముఖ్యంగా సంవత్సరపు మొదటి రోజున ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వడం కానీ, అప్పు తీసుకోవడం కానీ చేయకూడదు. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు వెంటాడే అవకాశం ఉందని నమ్మకం. కొత్త సంవత్సరం ఆరంభంలోనే అప్పుల మాట వస్తే, ఏడాది మొత్తం డబ్బు సమస్యలతో గడిచే ప్రమాదం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతారు.
ఇక కుటుంబంలో కలహాలు, గొడవలు సంవత్సరపు తొలి రోజున అస్సలు ఉండకూడదు. ఇంట్లో ఐక్యత, ప్రేమ, ఆనందం ఉన్న చోటే లక్ష్మీదేవి నివసిస్తుందనే నమ్మకం ఉంది. అందుకే కొత్త ఏడాది మొదటి రోజున ఎవరివారితోనూ వాగ్వాదాలు చేయకూడదు. జీవితంలో ఏవైనా సమస్యలు ఉన్నా, వాటిని ఆ రోజున పదేపదే ఆలోచించి మనసును కలతకు గురి చేయకూడదు. లేకపోతే మానసిక ఒత్తిడి పెరిగి, ఏడాది పొడవునా నెగటివ్ భావాలు వెంటాడే అవకాశం ఉంటుంది.
వస్త్రధారణ విషయంలో జాగ్రత్త అవసరం. సంవత్సరపు మొదటి రోజున చినిగిన, పాత బట్టలు లేదా నలుపు రంగు దుస్తులు ధరించకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే ఇతరులు వాడిన దుస్తులు వేసుకోవడం మంచిది కాదని భావిస్తారు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అసంతృప్తి చెందుతుందని, దురదృష్టం వెంటాడుతుందని విశ్వాసం.
ఇంట్లో చీకటిని దూరం పెట్టడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈశాన్య దిక్కును చీకటిగా ఉంచితే ఇంట్లోకి దారిద్ర్యం ప్రవేశిస్తుందని వాస్తు నమ్మకం. అందుకే ఇంటి ప్రధాన ద్వారం వద్ద, పూజగదిలో దీపాలు వెలిగించి ఇంటంతా వెలుగుతో నింపాలి. ఇది సానుకూల శక్తిని పెంచుతుందని చెబుతారు.
చాలామంది డిసెంబర్ 31 రాత్రి వేడుకల్లో పాల్గొని, కొత్త సంవత్సరం రోజున ఆలస్యంగా నిద్రలేస్తుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, కొత్త ఏడాది మొదటి రోజున ఉదయాన్నే లేచే అలవాటు ఉండాలి. ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తే అశుభ ప్రభావాలు పడే అవకాశం ఉందని ప్రముఖ వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. కొత్త ఏడాది తొలి రోజును శుభ్రత, సానుకూల ఆలోచనలు, ప్రశాంత మనసుతో ప్రారంభిస్తే, ఆ సంవత్సరం మొత్తం శుభఫలితాలు దక్కుతాయని వాస్తు శాస్త్రం స్పష్టం చేస్తోంది.
#New Year 2026















