టాలీవుడ్ బ్యూటీ నభా నటేశ్ ఫ్యాషన్ గేమ్ రోజురోజుకీ మరింత ఎలివేట్ అవుతోంది. తాజాగా ఆమె బ్లూ గౌన్‌లో ఓ డ్రీమీలుక్‌కి ప్రాణం పోస్తూ చేసిన ఫొటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. తేలికపాటి మెరుపులు, మెల్లని కాటన్ మేఘాలా లాంటి గౌన్‌లో ఆమె వేసిన ఆ స్టెప్పులు అన్నీ ఓ కవితలా కనిపిస్తున్నాయి. ఒక డాన్స్ మూవ్‌లో ఆమె గౌన్ అలజడితో, చుట్టూ రొమాన్స్ మాయను అల్లేస్తోంది.
ఈ ఫొటోషూట్‌కు నేపథ్యంగా ఎలాంటి హెవీ బ్యాక్‌డ్రాప్ లేకుండానే, కేవలం నభా తన గ్లామర్ తో హైలెట్ చేసింది. ఆమె వేషధారణలో సింప్లిసిటీ కనిపించినా, హావభావాల్లో క్లాస్ ఓవర్‌ఫ్లో అయ్యింది. బ్లూ కలర్ ఆమెకు ఎంతో బాగా మ్యాచ్ అయి నేచురల్‌గా వెలిగిపోనిచ్చింది. అందులోనూ లైట్ మేకప్, కర్లీ హెయిర్, మెల్లగా చిరునవ్వుతో ఆమె దర్శనం చూసి ఫ్యాన్స్ “ఏంజెల్” అనే ట్యాగ్‌లు పెడుతున్నారు.
కెరీర్ పరంగా చూసుకుంటే, నభా నటేశ్ ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి, ‘ఇస్మార్ట్ శంకర్’తో ఓవర్నైట్ స్టార్ అయింది. ఆ తరవాత ఆమె చేసిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టకపోయినా, ఆమెపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. మళ్లీ ‘స్వయంభు’ అనే పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌లో నిఖిల్ సరసన నటిస్తూ కెరీర్‌ను తిరిగి పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతోంది.
ఇదిలా ఉంటే నభా నటేశ్ ఇప్పుడు ఫ్యాషన్ లెవెల్‌ను మరో మెట్టుకు తీసుకెళ్తోంది. ప్రతి ఫొటోషూట్ ద్వారా కొత్త ఎటిట్యూడ్‌ను, కొత్త మూడ్‌ను చూపించే ప్రయత్నం చేస్తోంది. ఈ గౌన్ ఫొటోలు చూసిన వారంతా “ఇది సినిమాటిక్ లెవెల్” అని కామెంట్లు చేస్తున్నారు. ఆమె స్టైల్, గౌన్ మూమెంట్స్, ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ కలిసొచ్చి ఒక కళాత్మక ప్రదర్శనలా నిలిచాయి. మొత్తానికి నభా ఈ కొత్త లుక్‌తో మరోసారి తన అందం, స్టైల్, ల్ ఎలా ఉంటాయో చూపించింది.