ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు

ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు
ADVERTISEMENT

తెలుగు రాష్ట్రాల్లో ఏడేళ్ల కిందట తీవ్ర సంచలనం రేపింది ప్రణయ్ హత్య కేసు. అప్పటివరకు ఇలాంటి ఉదంతాలు జరిగినట్లు ఎక్కడా వెలుగులోకి రాలేదు. వచ్చినా అవేమంత సంచలనం కాలేదు. తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిని భారీమొత్తంలో సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించిన ఉదంతం పెను దుమారం రేపింది. ప్రణయ్ హత్య కేసులో తాజాగా నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలనం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో రెండో నిందితుడికి ఉరి శిక్ష విధించింది. మొదటి నిందుతుడు చనిపోగా.. మిగిలినవారికి జీవితఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది.

ఉమ్మడి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు పెద్ద వ్యాపారి. సంపన్నుడైన ఆయనకు ఏకైక కుమార్తె అమృత. అగ్ర వర్ణానికి చెందిన ఈ యువతి దళిత యువకుడైన ప్రణయ్ ను ప్రేమించి పెళ్లాడింది. ఈ వివాహం మారుతీరావుకు అసలు ఇష్టం లేదు. దీంతో 2018 సెప్టెంబరు 14న సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ ను హత్య చేయించాడు. భార్య, తల్లితో కలిసి ఆస్పత్రికి వెళ్లివస్తున్న ప్రణయ్ ను సుపారీ గ్యాంగ్ సభ్యుడు సుభాష్ కుమార్ శర్మ కత్తితో దారుణంగా నరికి చంపాడు. అక్కడికక్కడే ప్రణయ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసును అప్పట్లో నల్లగొండ ఎస్పీగా ఉన్న ఏవీ రంగనాథ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొంటూ 2019లో ఛార్జిషీటు దాఖలు చేసింది.

ఐదేళ్లకు పైగా కోర్టులో విచారణ సాగింది. కొన్నాళ్ల కిందట వాదనలు ముగిశాయి. సోమవారం నల్లగొండ కోర్టు తీర్పు ఇస్తూ ప్రణయ్ ను కత్తితో నరికి చంపిన ఏ2 సుభాష్‌కుమార్‌శర్మకు ఉరి శిక్ష విధించింది. ఏ3 అస్గర్‌ అలీ, ఏ4 బారీ, ఏ5 కరీం, ఏ6 శ్రవణ్‌కుమార్, ఏ7 శివ, ఏ8 నిజాం. సుభాష్‌ గతంలో బెయిల్‌ కు ప్రయత్నించినా దొరకలేదు. అలీ వేరే కేసులో జైలులో ఉన్నాడు. మిగిలినవారికి బెయిల్‌ వచ్చింది.శ్రవణ్‌ కుమార్‌ అమృతకు సొంత బాబాయి.

ఇక ఈ కేసులో ఏ1 మారుతీరావు. ఈయన 2020లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెళ్లయిన 9 నెలలకే.. ప్రణయ్‌, అమృత 2018 జనవరిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అదే ఏడాది సెప్టెంబరులో ప్రణయ్ హత్యకు గురయ్యాడు. కాగా, భర్త హత్య సమయానికి కే అమృతకు ఏడు నెలలు. ఆ తర్వాత ఆమెకు కుమారుడు పుట్టాడు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఏ2 సుభాశ్ శర్మకు ఉరిశిక్ష విధించిన కోర్టు.. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది. కాగా ఈ కేసులో ఏ1గా ఉన్న అమృత తండ్రి అమృతరావు గతంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే.

తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు 2018 సెప్టెంబర్ 14న సుఫారీ గ్యాంగ్ తో ప్రణయ్ ను హత్య చేయించాడు. ఈ కేసును పోలీసులు విచారణ పూర్తి చేసి 2019లో ఎనిమిది మందిని నిందితులుగా ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసుపై సుమారు ఐదేళ్లకుపైగా కోర్టులో విచారణ జరిగింది. ఇటీవలే వాదనలు ముగిశాయి. తాజాగా కోర్టు తుదితీర్పు ఇచ్చింది. ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది.

ఈ కేసులో అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకొని చనిపోగా.. ముగ్గురు నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మిగిలిన నలుగురు నిందితులు బెయిల్ మీద బయట ఉన్నారు. తీర్పు నేపథ్యంలో నిందితులందరినీ పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.

ఈ కేసులో అమృత తండ్రి మారుతీ రావు ఏ1గా ఉండగా.. ప్రణయ్ ను కత్తితో నరికి చంపిన సుభాష్ శర్మ ఏ2గా ఉన్నాడు. అయితే, సుభాశ్ శర్మకు కోర్టు ఉరి శిక్ష విధించింది. ఏ3 అజ్గర్ అలీ, ఏ4 అబ్దుల్ భారీ, ఏ5 ఎంఏ కరీం, ఏ6 తిరునగరు శ్రవణ్ కుమార్ (మారుతిరావు సోదరుడు), ఏ7 సముద్రాల శివ (మారుతిరావు డ్రైవర్), ఏ8 నజీమ్ (నిందితులు ప్రయాణించిన ఆటో డ్రైవర్ ఓనర్)కు కోర్టు జీవిత ఖైదు విధించింది.

Tags: #crimenews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

TDP పై జేసీ పవన్ సంచలన కామెంట్స్!

Next Post

Varma : పిఠాపురంలో పొలిటికల్ హీట్

Related Posts

TelanganaBudget
Big Story

TelanganaBudget:తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌తో ముందుకు రాష్ట్రం – 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కీలక ప్రసంగం

Amaravati
Andhra Pradesh

Amaravati:58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరణ – త్యాగానికి ప్రతీకగా “Statue of Sacrifice”ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

Mlc AnanthaBabu
Big Story

Mlc AnanthaBabu: అనంతబాబు కేసులో భార్య ఎంట్రీ.. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి?

OdishaFireAccident
Big Story

OdishaFireAccident:ఎస్సీబీ మెడికల్ కాలేజ్ ఆస్పత్రి ఐసీయూలో భారీ అగ్నిప్రమాదం

TDP
Andhra Pradesh

TDP:టీడీపీ అధిష్టానం సీరియస్‌ ఎంపీ పుట్టా మహేష్‌కు షోకాజ్ నోటీసులు

PoliticalWar
Big Story

PoliticalWar:డ్రగ్స్ కేసులో నా పేరు లాగితే చట్టపరమైన చర్యలు తప్పవు – కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

Next Post
Varma : పిఠాపురంలో పొలిటికల్ హీట్

Varma : పిఠాపురంలో పొలిటికల్ హీట్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

NabhaNatesh

NabhaNatesh:చీరలో నభా నటేష్ మైమరపించే అందం – సాంప్రదాయం, గ్లామర్ కలిసిన ఎలిగెంట్ లుక్ వైరల్

TelanganaBudget

TelanganaBudget:తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌తో ముందుకు రాష్ట్రం – 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కీలక ప్రసంగం

Amaravati

Amaravati:58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరణ – త్యాగానికి ప్రతీకగా “Statue of Sacrifice”ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

Mlc AnanthaBabu

Mlc AnanthaBabu: అనంతబాబు కేసులో భార్య ఎంట్రీ.. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి?

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info