ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

MithraMandali Movie Review: ‘మిత్ర మండలి’ మూవీ రివ్యూ

MithraMandali Movie Review: ‘మిత్ర మండలి’ మూవీ రివ్యూ
ADVERTISEMENT

‘మిత్ర మండలి’ మూవీ రివ్యూ నటీనటులు: ప్రియదర్శి- నిహారిక ఎన్ఎం- రాగ్ మయూర్- విష్ణు ఓయ్- ప్రసాద్ బెహరా- వెన్నెల కిషోర్- సత్య- వీటీవీ గణేష్- సత్య ప్రకాష్- జీవన్ రెడ్డి తదితరులు సంగీతం: ఆర్ఆర్ ధ్రువన్ ఛాయాగ్రహణం: సిద్దార్థ్ ఎస్జే నిర్మాతలు: కళ్యాణ్ మంతెన- భాను ప్రతాప- విజేందర్ రెడ్డి- బన్నీ వాసు కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: విజయేందర్ బన్నీ వాసు వర్క్స్ పేరుతో సొంతంగా బేనర్ పెట్టి తొలి ప్రయత్నంగా ఆ సంస్థ నుంచి అందించిన ‘లిటిల్ హార్ట్స్’తో పెద్ద హిట్టు కొట్టాడు బన్నీ వాసు. దీంతో ఆయన ప్రొడ్యూస్ చేసిన కొత్త చిత్రం ‘మిత్రమండలి’ పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. టీజర్.. ట్రైలర్ ఫన్నీగా సాగడంతో సినిమాకు మంచి బజ్ క్రియేటైంది. ప్రియదర్శి.. నిహారిక ఎన్ఎం ప్రధాన పాత్రల్లో కొత్త దర్శకుడు విజయేందర్ రూపొందించిన ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి. కథ: జంగిలిపట్నం అనే ఊరులో ఎన్నికలు రావడంతో ఎమ్మెల్యే టికెట్ కోసం తుట్టె అనే కులానికి నాయకుడైన నారాయణ (వీటీవీ గణేష్).. ఫ్రీడమ్ రాజు (సత్య ప్రకాష్) మధ్య పోటీ నెలకొంటుంది. అదే ఊరిలో చైతన్య (ప్రియదర్శి).. సాత్విక్ (విష్ణు ఓయ్).. అభి (రాగ్ మయూర్).. రాజీవ్ (ప్రసాద్ బెహరా) అనే నలుగురు స్నేహితులు పనీ పాటా లేకుండా ఖాళీగా తిరుగుతుంటారు. ఓ రోజు సాత్విక్.. అభి.. స్వేచ్ఛ (నిహారిక ఎన్ఎం)ను చూసి ప్రేమలో పడిపోయి.. ఆమె కోసం కొట్టేసుకుంటారు. కొన్ని రోజులు వాళ్లిద్దరూ స్వేచ్ఛ వెనుక తిరిగాక.. ఆమె నారాయణ కూతురు అని తెలిసి భయపడతారు. అదే సమయంలో నారాయణ తన కూతురు లేచిపోయిందంటూ పోలీస్ స్టేషన్లో అనఫీషియల్ కంప్లైంట్ ఇచ్చి తన కోసం వెతకమంటాడు. మరి స్వేచ్ఛ ఎక్కడికి వెళ్లింది.. ఎవరితో ప్రేమలో పడింది.. తన వల్ల ఈ నలుగురు స్నేహితులు పడ్డ ఇబ్బందులేంటి.. ఆమె తిరిగొచ్చిందా లేదా.. ఈ విషయాలన్నీ తెరపై చూడాల్సిందే.. కథనం-విశ్లేషణ: చెప్పుకోవడానికి పెద్దగా కథ ఉండదు. స్క్రీన్ ప్లే ఫార్మాట్ అంటూ కూడా ఏమీ ఫాలో అవ్వరు. పాత్రలన్నీ నాన్ సీరియస్ గా కనిపిస్తాయి. సన్నివేశాల్లోనూ సీరియస్నెస్ ఉండదు. అన్ని పాత్రలూ కలిసి అల్లరల్లరి చేస్తుంటాయి. ఎంత సీరియస్ సిచువేషన్ అయినా.. కామెడీ టర్నే తీసుకుంటుంది. సిల్లీగా అనిపించినా సరే.. ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా సన్నివేశాలు సాలుతాయి. వినోదం పంచడానికి టాలీవుడ్ దర్శకులు ఎంచుకున్న కొత్త రూటిది. జాతి రత్నాలు.. మ్యాడ్.. ఓయ్.. సింగిల్.. లిటిల్ హార్ట్స్.. ఈ కోవలో పలు చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను నవ్వించాయి. ఐతే ఈ ఫార్ములా ప్రతిసారీ వర్కవుట్ అవుతుందనే గ్యారెంటీ లేదు. పంచులు పేలకపోతే.. కామెడీ పండకపోతే ఇలాంటి ప్రయత్నాలు బూమరాంగ్ కూడా అవుతుంటాయి. ‘మిత్రమండలి’లో పై సినిమాల్లో మాదిరి కొంతమేర కామెడీ వర్కవుట్ అయింది. అక్కడక్కడా నవ్వులు పండాయి. కానీ సినిమా అంతా అలాగే నవ్వించి ఉంటే.. ఇది కూడా పై జాబితాలో చేరేది. కానీ కథ మరీ పలుచనైపోవడం.. సరైన కామెడీ సిచువేషన్లు క్రియేట్ చేయకపోవడం.. నవ్వులు అనుకున్నంతగా పండకపోవడంతో ‘మిత్రమండలి’ ప్రేక్షకులకు మిశ్రమానుభూతినే మిగులుస్తుంది.

మిత్రమండలి’ దర్శకుడు.. ‘జాతిరత్నాలు’ డైరెక్టర్ అనుదీప్.. ‘మ్యాడ్’ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ లకు స్నేహితుడు. పైగా రూం మేట్ అట. వాళ్లిద్దరి సహవాసం వల్లో.. లేక ట్రెండును ఫాలో అయిపోదాం అనుకున్నాడో కానీ.. అచ్చంగా అలాంటి కథతో నవ్వులు పంచడానికే ప్రయత్నించాడు. వాటిలో మాదిరే తింగరిగా అనిపించే నలుగురు కుర్రాళ్లు.. వాళ్లు చేసే అల్లరి చుట్టూ తిరిగే కథ ఇది. ఆ క్యారెక్టర్లు మాత్రమే కాక.. సినిమాలో ప్రతి పాత్రా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటుంది. సిల్లీగా మాట్లాడుతుంటుంది. కానీ ఆ క్యారెక్టర్లు ప్రేక్షకులకు క్రేజీగా అనిపిస్తే.. డైలాగుల్లో పంచ్ ఉంటే.. సిచువేషన్ కూడా ఫన్నీగా అనిపిస్తే కామెడీ వర్కవుట్ అవుతుంది. కానీ ‘మిత్రమండలి’లో అది అనుకున్న స్థాయిలో జరగలేదు. ప్రియదర్శి.. విష్ణు ఓయ్.. సత్య.. వెన్నెల కిషోర్.. ప్రసాద్ బెహరా.. రాగ్ మయూర్.. ఇలా ఎవరికి వాళ్లు కామెడీ పండించడంలో కింగులే అయినా.. వారిని సరిగా ఉపయోగించుకోలేదు. వారి ప్రతిభకు తగ్గ పాత్రలను క్రియేట్ చేయలేకపోయారు. ఈ ఆర్టిస్టులందరూ అక్కడక్కడా కొంచెం నవ్వించారు. కానీ డోస్ సరిపోలేదు. మధ్య మధ్యలో ఒక జోక్ పేలడం.. కాస్త హుషారు రావడం.. అంతలోనే తర్వాతి సన్నివేశం డల్లుగా మారడం.. నవ్వు రాకపోవడం.. ఇదీ వరస. కామెడీ పేలిపోతుందని ఆశించే కొన్ని సన్నివేశాలు వీక్ రైటింగ్ వల్ల సాధారణంగా మారిపోయాయి. కథలో చెప్పుకోదగ్గ మలుపులు లేకపోవడం మైనస్. తర్వాత ఏం జరుగుతుందో ఈజీగా ఊహించేయొచ్చు. ‘మిత్రమండలి’ కథలో హీరోయిన్ పాత్ర కీలకం. సోషల్ మీడియాలో మంచి ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్న నిహారిక ఎన్ఎం చేయడంతో ఆ పాత్ర మీద చాలా అంచనాలు పెట్టుకుంటాం కానీ.. ఆమె పాత్ర-పెర్ఫామెన్స్ నిరాశ పరుస్తాయి. తన క్యారెక్టర్ని సరిగా డిజైన్ చేయలేదు. మరీ సిల్లీగా అనిపించే పాత్ర తనది. ప్రియదర్శి సహా నలుగురు మిత్రుల పాత్రలు కూడా ఆశించినంత వినోదాత్మకంగా లేవు. ‘ఇంపార్టెంట్ క్యారెక్టర్’ అంటూ ప్రోమోల్లో క్రేజీగా అనిపించిన సత్య పాత్ర మిక్స్డ్ ఫీలింగ్ ఇస్తుంది. సత్య తన కామెడీ టైమింగ్‌ తో కొంత నవ్వించినా.. ఆ పాత్ర సినిమాలో ఎందుకుందో అర్థం కాదు. చివర్లో ఏదో జస్టిఫికేషన్ ఇచ్చినా కుదరలేదు. సమాజంలో వేళ్లూనుకుపోతున్న ‘కులం’ మీద సినిమాలో చాలా సెటైర్లే వేశారు. అవి బాగానే పేలాయి. కులాంతర వివాహాలు.. కులం చుట్టూ తిరిగే రాజకీయాలు.. లాంటి టాపిక్స్ తీసుకుని వాటి మీద వేసిన పంచులు బాగున్నాయి. ఈ సన్నివేశాలు కొంత ఆలోచన రేకెత్తిస్తాయి కూడా. పాటలన్నీ కూడా చాలా వరకు పేరడీలే. ⁠కత్తందుకో జానకి.. క్లైమాక్స్ లో ఫోక్ సాంగ్ వినడానికి బావున్నాయి. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా ఒక మోస్తరు కామెడీతో సరిపెట్టుకుంటామంటే ‘మిత్రమండలి’పై ఒక లుక్కేయొచ్చు. అంతకుమించి ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు.

నటీనటులు: ఈ మధ్య కొంచెం సీరియస్ పాత్రలు చేసిన ప్రియదర్శి.. మళ్లీ ‘జాతిరత్నాలు’ తరహా కామెడీ రోల్ ట్రై చేశాడు. ఆ పాత్రకు ఫిట్ అనిపించాడు. తన పెర్ఫామెన్స్ ఓకే. కానీ ఇంతకుముందులా మాత్రం నవ్వించలేకపోయాడు. తమిళంలో ‘పెరుసు’తో ఆకట్టుకున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నిహారిక ఎన్ఎం.. తెలుగు డెబ్యూలో అంచనాలను అందుకోలేకపోయింది. తన అప్పీయరెన్స్.. పెర్ఫామెన్స్ జస్ట్ ఓకే అనిపిస్తాయంతే. రాగ్ మయూర్.. విష్ణు ఓయ్.. ప్రసాద్ బెహరా స్నేహితుల పాత్రల్లో బాగానే చేశారు. కొంతమేర నవ్వించారు. కుల నాయకుడి పాత్రలో వీటీవీ గణేష్ కామెడీ పెద్దగా పేలలేదు. వెన్నెల కిషోర్ ఉన్నాడు కదా అని ఎక్కువ ఊహించుకుంటే కష్టం. తన కామెడీ వర్కవుట్ కాలేదు. సత్య ప్రకాష్.. జీవన్ రెడ్డి ఓకే. సత్య బాగా పెర్ఫామ్ చేసినా.. తన పాత్ర అనవసరం అనిపిస్తుంది. బ్రహ్మానందం చిన్న పాత్రలో మెరిసి మాయమయ్యారు. సాంకేతిక వర్గం: సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్.. ఈ కథకు తగ్గట్లుగా ఎక్కువగా రీమిక్స్.. పేరడీ పాటలే అందించాడు. అవి ఎంటర్టైనింగ్ గా అనిపిస్తాయి. ధ్రువన్ నేపథ్య సంగీతం ఓకే. సిద్దార్థ్ ఎస్జే సినిమాటోగ్రఫీ బాగానే సాగింది. విజువల్స్ కలర్ ఫుల్ గా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. ఇలాంటి సినిమాల్లో కథ గురించి ఎవరూ పెద్దగా ఆలోచించరు. ఫన్నీ సిచువేషన్లు క్రియేట్ చేయడం.. డైలాగుల్లో పంచ్ ఉండడం కీలకం. ఆ విషయంలో కొత్త దర్శకుడు విజయేందర్ కొంత ప్రయత్నం చేశాడు. తన సెన్సాఫ్ హ్యూమర్ కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తుంది. కానీ చాలా చోట్ల రైటింగ్ మరీ తేలిగ్గా అనిపిస్తుంది. అందువల్లే సన్నివేశాలు పండలేదు. విజయేందర్ టేకింగ్ ఓకే.

రేటింగ్ : 2.5/5

Tags: #AudienceResponse#BoxOfficeTalk#MithraMandali#MithraMandaliMovieRating#MithraMandaliMovieReview#MithraMandaliMovieTalk#MithraMandaliPublicTalk#MithraMandaliRating#MithraMandaliReview#MovieTalk#PublicTalk#telugucinema#tollywoodEntertainmentTelugureview
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Supreme Court: సేవ్ నిమిషప్రియ

Next Post

Punjab: రూ. 8 లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన డీఐజీ

Related Posts

RitikaNayak
Entertainment

RitikaNayak:హాట్ క్రేజ్ 2026 మిరాయ్ 2, కొరియన్ కనకరాజుతో టాలీవుడ్‌లో టాప్ రేంజ్

VishnuPriya
Entertainment

VishnuPriya:విష్ణుప్రియ వివాదం పూర్తి వివరాలు | సోషల్ మీడియా సబ్‌స్క్రిప్షన్ కల్చర్ పై పెద్ద చర్చ

Samyuktha
Entertainment

Samyuktha:క్లాసీ లుక్‌తో అటిట్యూడ్ టచ్ – @iamsamyuktha_ స్టైల్ సోషల్ మీడియాలో వైరల్

KrithiShetty
Entertainment

KrithiShetty:LIK ప్రమోషన్స్‌లో మెరిసిన కృతి శెట్టి – సింప్లిసిటీతో ఆకట్టుకుంటున్న టాలీవుడ్ బ్యూటీ

ShehnaazGill
Entertainment

ShehnaazGill:షెహనాజ్ గిల్ గ్లామర్ షో | ముంబై ఈవెంట్ నుంచి ఇండియా 2030 కాంక్లేవ్ వరకు ట్రెండ్ సెట్టర్

#EstherAnil
Latest

EstherAnil:నటి ఎస్తేర్ అనిల్ గ్లామర్ ఫోటోషూట్ వైరల్ – స్టన్నింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్

Next Post
Punjab: రూ. 8 లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన డీఐజీ

Punjab: రూ. 8 లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన డీఐజీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

RitikaNayak

RitikaNayak:హాట్ క్రేజ్ 2026 మిరాయ్ 2, కొరియన్ కనకరాజుతో టాలీవుడ్‌లో టాప్ రేంజ్

IPL2026

IPL2026:RCB ఘన విజయం: కోహ్లీ–పాటీదార్ మెరుపులతో లక్ష్యాన్ని ఛేదించిన బెంగళూరు

tdp

TDP:తెలుగుదేశం పార్టీ కొత్త కమిటీలు 2026: పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర స్థాయిలో భారీ మార్పులు

Delimitation2029

Delimitation2029:తెలంగాణ డీలిమిటేషన్ 2029: కొత్త లోక్‌సభ స్థానాలు, మహిళా రిజర్వేషన్లు – పూర్తి వివరాలు

Recent News

RitikaNayak

RitikaNayak:హాట్ క్రేజ్ 2026 మిరాయ్ 2, కొరియన్ కనకరాజుతో టాలీవుడ్‌లో టాప్ రేంజ్

IPL2026

IPL2026:RCB ఘన విజయం: కోహ్లీ–పాటీదార్ మెరుపులతో లక్ష్యాన్ని ఛేదించిన బెంగళూరు

tdp

TDP:తెలుగుదేశం పార్టీ కొత్త కమిటీలు 2026: పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర స్థాయిలో భారీ మార్పులు

Delimitation2029

Delimitation2029:తెలంగాణ డీలిమిటేషన్ 2029: కొత్త లోక్‌సభ స్థానాలు, మహిళా రిజర్వేషన్లు – పూర్తి వివరాలు

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info