ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Miss World : తెలంగాణలో ప్రపంచ సుందరి పోటీలు

Miss World : తెలంగాణలో ప్రపంచ సుందరి పోటీలు
ADVERTISEMENT

ప్రపంచంలో(World)నే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచ సుందరి పోటీ ‘మిస్ వరల్డ్’ 72వ ఎడిషన్‌కు తెలంగాణ వేదిక కాబోతుంది. 2025లో ఈ వేడుకను తెలంగాణలో నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.

ఈసారి మిస్ వరల్డ్ పోటీలను (Telangana) తెలంగాణలో నిర్వహించనున్నట్లు మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో, చైర్మన్ జూలియా మోర్లీ, తెలంగాణ ప్రభుత్వ పర్యటక, సాంస్కృతిక, వారసత్వ, యువ వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్‌తో కలిసి ప్రకటించారు.

మే 4 నుంచి మే 31 వరకు 28 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమం.. తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించనున్నారు.

తెలంగాణ సాంస్కృతిక వారసత్వం, ఆధునికత ఉట్టిపడేలా ఈ కార్యక్రమం జరపనున్నట్లు ప్రభుత్వం, నిర్వాహకులు చెబుతున్నారు. మిస్ వరల్డ్‌కు చెందిన గ్రాండ్ ఫైనల్‌తో పాటు ప్రారంభ, ముగింపు వేడుకలకు హైదరాబాద్ (Hyderabad)వేదిక కానుంది.

” 72వ ప్రపంచ సుందరి వేడుకను గొప్ప సంస్కృతి, వినూత్నత, ఆతిథ్యానికి నెలవైన తెలంగాణలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం ద్వారా ఈ ప్రాంత అద్భుతమైన వారసత్వాన్ని, గతిశీల వృద్ధిని ప్రపంచ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు మాకు అవకాశం కల్పిస్తుంది.

ఇది కేవలం ప్రపంచ సుందరి వేడుకను నిర్వహించడమే కాదు..కమ్యూనిటీల్లో సాధికారత తీసుకురావడం, వైవిధ్యాన్ని వేడుకగా చేయడం, ‘బ్యూటీ విత్ పర్పస్’ అనే ప్రామిస్ ద్వారా దీర్ఘకాలిక ప్రభావం చూపించే ప్రయత్నం కూడా.” అని జూలియా మోర్లీ అన్నారు.

రాజధాని న్యూదిల్లీలో, ముంబయిలో 71వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. 72వ ఎడిషన్ పోటీలను కూడా భారత్‌లోనే నిర్వహిస్తున్నారు.

ముంబయిలో జరిగిన 71వ ఎడిషన్ ‘మిస్ వరల్డ్’ ఫైనల్ పోటీల్లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచారు.

ఆ ఎడిషన్‌లో భారత్ నుంచి పోటీల్లో పాల్గొన్న కన్నడ అమ్మాయి సిని శెట్టి టాప్-8లో నిలిచారు. అంతకుముందు 1996లో భారత్‌లో ఈ పోటీలు జరిగాయి.

ఈసారి తెలంగాణలో జరగబోయే మిస్ వరల్డ్ పోటీల్లో ప్రధాన ఆకర్షణ చేనేత దుస్తులు. దేశ విదేశాల నుంచి అందాల పోటీలకు వచ్చే అమ్మాయిలంతా తెలంగాణ చేనేత వస్త్రాలు ధరించేలా ప్రణాళిక చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

మిస్ వరల్డ్ పోటీల్లో అనేక థీ‌మ్‌లు ఉంటాయి. అందులో భాగంగా ఒక థీమ్ తెలంగాణ చేనేత వస్త్రాలు ఉండేలా చూస్తామంటున్నారు అధికారులు.

”ఈ మిస్ వరల్డ్ పోటీలను ఉపయోగించుకుని చేనేత పరిశ్రమకు మేలు చేసేలా ఒక ప్రణాళిక వేస్తున్నాం. ఆ పోటీల్లో తెలంగాణ హ్యాండ్లూమ్ అనే థీమ్ కూడా పెడుతున్నాం. పోటీలో పాల్గొనే అమ్మాయిలంతా తెలంగాణ చేనేత వస్త్రాలు వేసుకుంటారు. ఇందుకోసం మేం స్థానిక, అంతర్జాతీయ డిజైనర్లను కూడా ఆహ్వానిస్తున్నాం. మోడ్రన్, ట్రెడిషనల్ కలిపి మిక్స్ అండ్ మ్యాచ్‌గా చేయబోతున్నాం.” అని బీబీసీతో చెప్పారు తెలంగాణ టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్.

మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే విదేశీ యువతులంతా ఇలా చేనేత దుస్తులు వేసుకుంటే అది భారతీయ చేనేత రంగానికి ప్రోత్సాహాన్నిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

పోచంపల్లి, గద్వాల, నారాయణపేట వంటి వస్త్రాలతో పోటీదార్లకు సరికొత్త డిజైన్ల దుస్తులను రూపొందించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ఈ పోటీలను తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి ఒక మంచి అవకాశంగా భావిస్తున్నారు అధికారులు.

మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాల ప్రతినిధులూ పాల్గొనే పోటీ కాబట్టి, తెలంగాణ టూరిజం, ఉత్పత్తులు, పెట్టుబడి అవకాశాలు వీటన్నింటినీ అతిథులు ముందు ఉంచేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

”ఇది తెలంగాణ పర్యటక రంగానికి చాలా గొప్ప అవకాశం. చాలా పొటెన్షియల్ ఉన్న సందర్భం ఇది. అందుకే దీన్ని అన్ని రకాలుగా ఉపయోగించుకుంటూ భాగస్వాములం అవుతున్నాం.

ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) అనేది నేడు అత్యంత గుర్తింపు పొందిన హోదాగా నిలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్న వేడుకలు ఇవి.

120 దేశాలు, భూభాగాలకు చెందిన పోటీదార్లను ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి వేడుక ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. కేవలం గౌరవప్రదమైన టైటిల్, కిరీటం కోసమే కాకుండా.. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్‌కు చెందిన ‘బ్యూటీ విత్ పర్పస్’ అనే లక్ష్యం కోసం ఈ వేడుకలో పోటీ పడాలి.

వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహించే వారు, మే 4న తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్‌లో మే 31న జరిగే ఫైనల్ వేడుకలో, అంతకుముందు మిస్‌ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా తన కిరీటాన్ని ప్రపంచ సుందరిగా గెలిచే వారికి అలంకరించనున్నారు.

ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు సిద్ధమవుతున్న రాష్ట్రం.. ‘తెలంగాణ, జరూర్ ఆనా : అందం తన నిజమైన అర్థాన్ని కనుగొనే చోటు’ అనే పిలుపుతో ప్రపంచానికి ఆహ్వానం పంపుతోంది.

Tags: #Hyderabad#TelanganaMiss World 2025 pageant Telangana Grand Finale Hyderabad Miss World Entertainment
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

AP:పూర్తికాని ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన ఘనుడు జగన్: నిమ్మల 

Next Post

Modi | Pawan Kalyan | పవన్‌తో మోదీ ఏం మాట్లాడారంటే..?

Related Posts

Chandrababu Welfare Policy
Andhra Pradesh

Chandrababu Welfare Policy: సంక్షేమంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాధికారత

Kadiri Railway Station Mahotsav
Andhra Pradesh

Kadiri Railway Station Mahotsav: 130 ఏళ్ల చరిత్ర ఉన్న కదిరికి స్టేషన్ మహోత్సవ్‌లో చోటెందుకు లేదు?

Revanth Reddy Education Speech
Big Story

Revanth Reddy Education Speech: ప్రైవేటు స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ పాఠశాలల్లో భారీ మార్పులు!

Ayurveda Treatment
Andhra Pradesh

Ayurveda Treatment: విరూపాక్షపురం నుంచి మూడు తరాలుగా సాగుతున్న మోహన్‌రావు కుటుంబం ఆయుర్వేద సేవా ప్రస్థానం

Kadiri History
Andhra Pradesh

Kadiri History : కదిరి అంటే ఒక పేరు కాదు.. ఒక చరిత్ర! శతాబ్దాల వైభవం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు పూర్తి కథనం

Telangana Assembly
Big Story

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం.. స్పీకర్ అవమానంపై తీవ్ర ఆగ్రహం!

Next Post
Modi | Pawan Kalyan | పవన్‌తో మోదీ ఏం మాట్లాడారంటే..?

Modi | Pawan Kalyan | పవన్‌తో మోదీ ఏం మాట్లాడారంటే..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Chandrababu Welfare Policy

Chandrababu Welfare Policy: సంక్షేమంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాధికారత

Kadiri Railway Station Mahotsav

Kadiri Railway Station Mahotsav: 130 ఏళ్ల చరిత్ర ఉన్న కదిరికి స్టేషన్ మహోత్సవ్‌లో చోటెందుకు లేదు?

EPIC Movie Review

EPIC Movie Review: కథే లేదు.. కొన్ని మూమెంట్స్ మాత్రమే! ‘ఎపిక్’ సినిమా ఎలా ఉంది?

Revanth Reddy Education Speech

Revanth Reddy Education Speech: ప్రైవేటు స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ పాఠశాలల్లో భారీ మార్పులు!

Recent News

Chandrababu Welfare Policy

Chandrababu Welfare Policy: సంక్షేమంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాధికారత

Kadiri Railway Station Mahotsav

Kadiri Railway Station Mahotsav: 130 ఏళ్ల చరిత్ర ఉన్న కదిరికి స్టేషన్ మహోత్సవ్‌లో చోటెందుకు లేదు?

EPIC Movie Review

EPIC Movie Review: కథే లేదు.. కొన్ని మూమెంట్స్ మాత్రమే! ‘ఎపిక్’ సినిమా ఎలా ఉంది?

Revanth Reddy Education Speech

Revanth Reddy Education Speech: ప్రైవేటు స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ పాఠశాలల్లో భారీ మార్పులు!

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info