మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయిలాండ్‌కు చెందిన ఒపల్ సుచాత చౌసీ నిలిచారు.ఈ పోటీల గ్రాండ్ ఫినాలే హైదరాబాద్ వేదికగా శనివారం రాత్రి జరిగింది.మే 7వ తేదీన ప్రారంభమైన ఈ సందడి మే 31న తుది పోటీలతో ముగిసింది.’బ్యూటీ విత్ ఏ పర్పజ్’ నినాదంతో ‘మిస్ వరల్డ్’ పోటీలను 1951లో ‘ది మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్’ మొదలుపెట్టింది.హైదరాబాద్‌లోని హైటెక్స్ ఈ గ్రాండ్ ఫినాలేకు వేదికైంది.ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుతున్న ఒపల్ సుచాత, ఏదో ఒకరోజు రాయబారి (అంబాసిడర్) కావాలని అనుకుంటున్నారని మిస్ వరల్డ్ వెబ్‌సైట్‌లోని ఆమె ప్రొఫైల్‌లో పేర్కొన్నారు. అలాగే, సైకాలజీ, ఆంత్రోపాలజీపై ఆమెకు మక్కువ.
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్న సంస్థలతో ఆమె కలిసి పనిచేశారు.ఒపల్ 16 పిల్లులు, 5 కుక్కలను పెంచుకుంటున్నారు.ఫైనల్ రౌండ్‌కు చేరిన నలుగురు కంటెస్టెంట్లలో మిస్ థాయిలాండ్, మిస్ ఇథియోపియా, మిస్ మార్టినిక్, మిస్ పోలెండ్ నిలిచారు.మిస్ థాయ్‌లాండ్ ఒపల్ సుచాత ‘మిస్ వరల్డ్ 2025’ కిరీటాన్ని దక్కించుకున్నారు.మిస్ వరల్డ్ 2025 మొదటి రన్నరప్‌గా మిస్ ఇథియోపియా హస్సెట్ డెరిజీ నిలిచారు.రెండో రన్నరప్‌గా మిస్ పోలెండ్ మాజా క్లాజా, మూడో రన్నరప్‌గా మిస్ మార్టినిక్ ఓరీలియా జోచెమ్ నిలిచారు.భారత్‌కు చెందిన నందిని గుప్తా సహా 108 దేశాల నుంచి యువతులు ఈ ‘మిస్ వరల్డ్’ పోటీలకు హాజరయ్యారు.ప్రాథమిక పోటీల తర్వాత మూడు దశల్లో జరిగే క్వార్టర్ ఫైనల్స్‌కు ఒక్కో ఖండం నుంచి పదేసి మంది (అమెరికా, కరీబియన్స్ నుంచి 10, ఆఫ్రికా నుంచి 10, ఐరోపా నుంచి 10, ఏషియా, ఓషీనియా నుంచి 10 మంది)ని ఎంపిక చేశారు..
గత ఆదివారం మొదటి దశ క్వార్టర్స్ పోటీలు ముగిశాయి. ప్రతి ఖండం నుంచి 10 మంది చొప్పున 40 మందిని ఎంపిక చేశారు. ప్రతి ఖండం నుంచి ఎంపికైన 10 మంది నుంచి రెండో దశలో 5 గురిని (టాప్ 5) ఎంపిక చేశారు.ఇలా ప్రతి ఖండం నుంచి ఎంపికైన 5 గురిలో మూడో దశలో ఇద్దరిని (టాప్ 2) ఎంపిక చేశారు. అంటే, అప్పుడు పోటీలో 8 మంది నిలిచారు. ఈ 8 మందిలో సెమీ ఫైనల్లో భాగంగా ప్రతి ఖండం నుంచి ఎంపికైన ఇద్దరిలో ఒకరిని టాపర్‌గా ఎంపిక చేశారు.శనివారం రాత్రి జరిగిన పోటీలలో చివరికి థాయిలాండ్ సుందరి ఒపల్ సుచాత చౌసీ విజేతగా నిలిచారు.పోటీలలో చివరి దశకు చెందిన నలుగురు కంటెస్టెంట్లను జ్యూరీ సభ్యులు నిర్దేశిత ప్రశ్నలు అడిగారు.
పోలాండ్‌కు చెందిన మాజా క్లాజాను నమ్రత శిరోద్కర్.. ఇథియోపియా కంటెస్టెంట్‌ను దగ్గుబాటి రాణా, మార్టినిక్ కంటెస్టెంట్‌ను మాజీ మిస్ వరల్డ్ మానుషి ఛిల్లర్.. థాయిలాండ్ కంటెస్టెంట్‌ను సోనూ సూద్ ప్రశ్నలడిగారు.ఆ ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాల ఆధారంగా విజేతను నిర్ణయించారు.మిస్ వరల్డ్ కార్యక్రమం మే 31 శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో కళ్లు మిరిమిట్లు గొలిపేలా జరిగింది.థాయిలాండ్‌కు చెందిన ఒపల్ సుచాత చౌసీ మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు.ముందుగా మిస్ వరల్డ్ కార్యక్రమాన్ని వినాయకుడి పూజతో ప్రారంభించారు.తరువాత 108 మంది పోటీదారులు ఒకేసారి వేదికపై కనిపించారు.నాలుగు ఖండాల కేటగిరీల వారీగా ర్యాంప్ వాక్ చేశారు.
మొత్తం 9 మంది ఈ కార్యక్రమానికి జడ్జీలుగా వ్యవహరించారు.
వారిలో మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లీ, నటుడు సోనూ సూద్, మేఘా ఇంజినీరింగ్ డైరెక్టర్ సుధా రెడ్డి, నటుడు రానా దగ్గుబాటి, తెలంగాణ ప్రభుత్వ అధికారి జయేష్ రంజన్, 2017 మిస్ వరల్డ్ మానుషి ఛిల్లర్, మహేశ్‌బాబు భార్య, మాజీ మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్, 2014 మిస్ ఇంగ్లండ్ కరినా టర్రెల్, 72వ మిస్ వరల్డ్ అఫీషియల్ స్టేజ్ డైరెక్టర్ డోనా వాల్ష్ జడ్జీలుగా వ్యహరించారు.భారత్‌కు చెందిన నందిని గుప్తా సహా 108 దేశాల నుంచి యువతులు ఈ ‘మిస్ వరల్డ్’ పోటీలకు హాజరయ్యారు.ప్రాథమిక పోటీల తర్వాత మూడు దశల్లో జరిగే క్వార్టర్ ఫైనల్స్‌కు ఒక్కో ఖండం నుంచి పదేసి మంది (అమెరికా, కరీబియన్స్ నుంచి 10, ఆఫ్రికా నుంచి 10, ఐరోపా నుంచి 10, ఏషియా, ఓషీనియా నుంచి 10 మంది) చొప్పున మొత్తం 40మందిని ఎంపిక చేశారు. తరువాత ఒక్కో ఖండం నుంచి ఎంపికైన 10 మంది నుంచి రెండో దశకు ఐదుగురిని (టాప్ 5) ఎంపిక చేశారు.
అనంతరం ప్రతి ఖండం నుంచి ఎంపికైన ఐదు గురిలో మూడో దశలో ఇద్దరిని (టాప్ 2) ఎంపిక చేశారు. అంటే, ఖండానికి ఇద్దిరి చొప్పున పోటీలో మొత్తం 8 మంది నిలిచారు.వీరిలో ముందుగా నిర్వహించిన రకరకాల పోటీల నుంచి ఎంపికైన వారితో పాటు, జడ్జీలు అప్పటికప్పుడు ఎంపిక చేసిన వారూ ఉన్నారు.మిస్ వరల్డ్ ఇండియా నందినీ గుప్తా టాప్ 20లో, అంటే ఏషియా, ఓషీనియా కేటగిరీలో టాప్ 5లో నిలిచారు.కానీ, తరువాత కాంటినెంట్ టాప్ 2లో ఎంపిక కాలేదు.
చివరగా టాప్ 8లో నిలిచిన వారు ఎవరంటే…
బ్రెజిల్
మార్టినిక్
ఇథియోపియా
నమీబియా
పోలాండ్
యుక్రెయిన్
ఫిలిప్పీన్స్
థాయిలాండ్
వీరందరినీ మీరే మిస్ వరల్డ్ కావాలని ఎందుకు అనుకుంటున్నారు? అని జడ్జీలు ఒకే ప్రశ్న అడిగారు.ఆ ప్రశ్నకు 45 సెకన్లలో సమాధానం చెప్పాలని కోరారు.మార్టినిక్, ఇథియోపియా, పోలాండ్, థాయిలాండ్ దేశాల అమ్మాయిలు చివరి రౌండ్ వరకూ వచ్చారు.వారిలో థాయిలాండ్ అమ్మాయి విజేత కాగా, నాలుగవ స్థానంలో మార్టినిక్ నుంచి ఆరెలీ జోయాచిమ్ (Aurelie Joachim), 3వ స్థానంలో పోలాండ్ మాజా క్లాజా (Maja Klajda), 2వ స్థానంలో ఇథియోపియా అమ్మాయి హసెట్ దెరెజీ అద్మాసు (Hasset Dereje Admassu) నిలిచారు.
పోలాండ్‌కు చెందిన మాజా క్లాజాను నమ్రత శిరోద్కర్.. ఇథియోపియా కంటెస్టెంట్‌ను దగ్గుబాటి రానా, మార్టినిక్ కంటెస్టెంట్‌ను మాజీ మిస్ వరల్డ్ మానుషి.. థాయిలాండ్ కంటెస్టెంట్‌ను సోనూ సూద్ ప్రశ్నలడిగారు.” సత్యం, వ్యక్తిగత బాధ్యతల గురించి ఈ ప్రయాణం మీకేం నేర్పింది? అని మిస్ థాయిలాండ్‌ను సోనూ సూద్ ప్రశ్నించారు.”ఇది నా జీవితంలోనే గొప్ప అవకాశం. మిస్ వరల్డ్‌లో ఉండటం ద్వారా నేను నేర్చుకున్న ముఖ్యమైన విషయం సత్యాన్ని ఎలా స్వీకరించాలనే బాధ్యత. నేను, మిగిలిన అమ్మాయిలు, ఈ హాలులో ఉన్న ప్రతి ఒక్కరం మన జీవితాల్లోని ఇతరులకు ఆదర్శంగా ఉండటమే మనం చేయగలిగిన గొప్ప పని. ఎందుకంటే, నువ్వు ఎవరైనా కావొచ్చు, ఎంత వయస్సు ఉన్నా, జీవితంలో ఏ పదవిలో ఉన్నా, మీ పక్కనే ఒక వ్యక్తి ఉంటారు. అది పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు. లేదా వాళ్ళు మీ కన్న తల్లిదండ్రులే కావచ్చు, వారు మిమ్మల్ని ఎంతో ఆదర్శంగా చూస్తారు. తోటి వారికి నాయకత్వం వహించడం, నడిపించడంలో ఉత్తమమైన మార్గం ఏంటంటే, కరుణాపూరిత చర్యలతో వారిని నడిపించడం. అదే మన చుట్టూ ఉన్న వారికీ, ప్రపంచంలో ఉన్న వారికీ మనం చేయగలిగే మంచి.” అని బదులు ఇచ్చారు మిస్ వరల్డ్ గెలిచిన ఒపలా.
ఆ తరువాత జడ్జీలు న్యాయ నిర్ణేతను ఎంచుకునే సమయంలో, 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా వేదికపై మాట్లాడారు.విజేతను మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లే, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రకటించారు.మొదటి రన్నరప్‌కి ఒక చిన్న కిరీటం ధరింపచేశారుప్రధాన విజేతను సింహాసనంపై కూర్చోబెట్టి, కిరీటం పెట్టారు క్రిస్టినా.తరువాత పోటీదారులంతా వేదికపై నృత్యం చేస్తూ అలరించారు. అటు ప్రేక్షకులు కూడా వేదికవైపు వెళ్లడానికి, ఫోటోలు తీసుకోవడానికి ఉత్సాహపడ్డారు.సీఎం రేవంత్ రెడ్డి, నటులు చిరంజీవి, విజయ్ దేవరకొండతో పాటు ఇతర ప్రముఖులు మిస్ వరల్డ్ కార్యక్రమం చూడటానికి వచ్చారు.
ఈ కార్యక్రమానికి మిస్ వరల్డ్ 2016 స్టెఫానీ డెల్ వాలె, భారతీయ ప్రెజెంటర్ సచిన్ కుంభర్ హోస్ట్‌లుగా వ్యవహరించారు.బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ స్టేజ్ పైన ప్రదర్శన ఇచ్చారు.నటుడు, దాత సోనూ సూద్‌కు మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డు ప్రదానం చేశారు నటుడు రానా.మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్‌గా సుధారెడ్డిని ప్రకటించారు.”తన కెరీర్‌కు కీలకమైన తెలుగు సినిమా పరిశ్రమకు ధన్యవాదాలు” అంటూ చెప్పిన సోను సూద్, బొమ్మాళీ అంటూ డైలాగ్ చెప్పారు.”సొంత నగరం, సొంత రాష్ట్రం హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ బ్రాండ్ అంబాసిడర్ నియమితులవ్వడం సంతోషంగా ఉంది” అన్నారు మేఘా డైరెక్టర్ సుధా రెడ్డి.పోటీలు జరుగుతున్నంత సేపూ ఆయా దేశాల అభిమానులు తమ వారిని ప్రోత్సహిస్తూ నినాదాలు చేశారు.ప్రేక్షకులు, పోటీదార్ల బంధువులు, ఇతర సిబ్బందితో కలిసి అనేక దేశాల వారు హైటెక్స్‌లో సందడి చేశారు.