మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీ రోడ్డున పడింది. నామినేషన్ రోజు వరకూ మాగంటి గోపీనాథ్ కు రెండు పెళ్లిళ్లు అయ్యాయని..ఇద్దరు భార్యలు, పిల్లలు ఉన్నారని ఎవరికీ తెలియదు. నామినేషన్ పరిశీలన రోజు మొదటి భార్య కుమారుడు.. మాగంటి సునీత.. లీగల్ గా మాగంటి గోపీనాథ్‌ను పెళ్లి చేసుకోలేదని.. భార్య కాదని ఫిర్యాదు చేశారు. అలా అఫిడవిట్ దాఖలయినందున తిరస్కరించాలని అన్నారు. అయితే అప్పటికి నామినేషన్ ఆమోదించారు.
అయితే మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వడంపై .. మొదటి భార్య ఫిర్యాదు చేశారు. ఆ అంశంపై తహశీల్దార్ ఎదుట విచారణ జరిగింది. రెండు వర్గాలు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాగంటి గోపీనాథ్ తల్లి..మొదటి భార్య వైపు ఉన్నారు. మొదటి భార్య కుమారుడే తమ వారసుడు అని స్పష్టం చేశారు. సునీతను అధికారికంగా పెళ్లి చేసుకోలేదని స్పష్టం చేశారు. తన కుమారుడు చనిపోయినప్పుడు చూసేందుకు కూడా తనకు అవకాశం ఇవ్వలేదని సునీతపై ఆరోపించారు.
అయితే మాగంటి సునీత కుమార్తె విచారణకు హాజరయ్యారు. సునీత తరపు లాయర్.. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత కూడా భార్యగా పరిగణించకపోవడం, లీగల్ గా పెళ్లి కాలేదనడం సరి కాదని అంటున్నారు. తదుపరి విచారణ ఇరవై ఐదో తేదీన నిర్వహిస్తారు. మొదటి భార్య కుమారుడు ప్రద్యుమ్న తారక్ తానే వారసుడ్నని క్లెయిమ్ చేయడం సంచలనంగా మారింది. మాగంటి గోపీనాథ్ తల్లి కూడా మద్దతు ఇవ్వడంతో ఈ వ్యవహారం ఇప్పుడల్లా తేలే అవకాశం లేదు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక మరో ఐదు రోజుల్లో జరగనుంది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తల్లి మహానందకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. “KTR వల్లే నా కొడుకు గోపీనాథ్ చనిపోయాడు.. సునీత పోటీపై నాకు సమాచారం లేదు. మనవడికి అన్యాయం చేయొద్దు..!” అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మాగంటి కుటుంబ వివాదం బీఆర్‌ఎస్ ప్రచారానికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కారు పార్టీకి ఇది పెద్ద దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఎలక్షన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతకు బిగ్ షాక్ తగిలింది. సునీతకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడంపై మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీ దేవి అభ్యంతరం తెలిపారు. ఇదే విషయంపై శేరిలింగంపల్లి తహసిల్దార్ చేపట్టిన విచారణలో ఆమె పాల్గొన్నారు. మరోవైపు సునీతపై మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కొడుకు ప్రద్యుమ్న ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాగంటి కుటుంబంలో కలహాల నేపథ్యంలో ఆ ప్రభావం ఎన్నికల్లో పడనుందని బీఆర్ఎస్ వర్గాలు ఆందోళనలో ఉన్నాయి.
ఇక మాగంటి గోపినాథ్ తల్లి మహానందకుమారి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కనీసం సునీత పోటీ చేస్తున్న విషయం కూడా తనకు తెలియదని వెల్లడించారు. సునీతకు తనతో కూడా మాటలు లేవన్నారు. అంతేకాక కేటీఆర్ వల్లే తన కుమారుడు చనిపోయాడని మాగంటి గోపినాథ్ తల్లి మహానందకుమారి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన మనవడికి అన్యాయం చేయొద్దని అన్నారు. తన మనవడు ప్రద్యుమ్న తారక్ కు తన తండ్రి వారసుడిగా అన్ని హక్కులకు అర్హుడని పేర్కొన్నారు. తాజాగా మాగంటి కుటుంబ వివాదం బీఆర్‌ఎస్ ప్రచారానికి ప్రతికూలంగా మారే అవకాశం ఉండటంతో, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పార్టీకి పెద్ద దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న జరగనుంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి.


















