ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

NaraLokesh:మెగా డీఎస్సీపై జగన్‌కు లోకేష్ ఓపెన్ ఛాలెంజ్.. అమరావతిపై కక్షతోనే జగన్ నిర్ణయాలు: మంత్రి నారా లోకేష్

NaraLokesh
ADVERTISEMENT

మెగా డీఎస్సీ 2025 నియామకాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. మెగా డీఎస్సీపై పేపర్ లీకైందన్న ప్రచారం నుంచి కమ్మ కులానికే ఉద్యోగాలు కట్టబెట్టారనే ఆరోపణల వరకు రోజుకో ఫేక్ ప్రచారాన్ని జగన్ చేస్తున్నారని విమర్శించారు. మెగా డీఎస్సీ నియామకాలపై ఎలాంటి అనుమానాలు ఉన్నా ప్రజల ముందు చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ధైర్యం ఉంటే జగన్ బహిరంగ చర్చకు రావాలని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.

మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడిన మంత్రి లోకేష్, ఎన్నికల్లో విజయం సాధించిన మొదటి రోజు నుంచే సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను రూపొందించామని తెలిపారు. మంగళగిరి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకు తాగునీటి సరఫరా, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, అండర్‌గ్రౌండ్ విద్యుత్ లైన్ల ఏర్పాటుతో పాటు ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

మంగళగిరి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ నిధులు తీసుకురావడంలో ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించారని లోకేష్ తెలిపారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద మంగళగిరికి నిధులు మంజూరు కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గ వాసిగా ఈ ప్రాజెక్టులన్నింటినీ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు.

పాత మంగళగిరిలోని బిట్రావారి వీధి, దింపుడు కళ్లం ప్రాంతంలో ఆధునిక సదుపాయాలతో నిర్మించిన మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి మంత్రి నారా లోకేష్ సందర్శించారు. దాదాపు 2.90 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ మహాప్రస్థానం ప్రజలకు గౌరవప్రదమైన అంత్యక్రియల సదుపాయాలను అందించేందుకు రూపొందించబడింది. ఆధునిక సౌకర్యాలు, పరిశుభ్రమైన వాతావరణంతో ఈ ప్రాజెక్టు ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడనుంది.

అలాగే మంగళగిరి మండలం కాజ గ్రామంలోని ఉప్పలపాడు-నంబూరు-కాజ రోడ్డు మార్గంలో అభివృద్ధి చేసిన కాజ ఈస్ట్ లేక్ పార్క్‌ను మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కలిసి ప్రారంభించారు. సెల్‌కాన్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల కింద రూ.3.3 కోట్ల వ్యయంతో ఈ పార్క్‌ను అభివృద్ధి చేసింది. సుమారు 17.18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు చుట్టూ నడక మార్గాలు, విశ్రాంతి ప్రాంతాలు, హరిత వాతావరణం, ఆధునిక సదుపాయాలతో పార్క్‌ను తీర్చిదిద్దారు.

ఈ సందర్భంగా అమరావతి రాజధాని అభివృద్ధి అంశంపై కూడా మంత్రి లోకేష్ స్పందించారు. అమరావతిపై జగన్‌కు ఉన్న కక్షకు వెస్ట్ బైపాస్ ప్రాజెక్టే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. రాజధానికి సరైన రహదారి అనుసంధానం లేకుండా, ఒక్క ఎగ్జిట్ కూడా ఉండకూడదనే ఉద్దేశంతో గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. ప్రస్తుతం ప్రజల అవసరాలు, భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వెస్ట్ బైపాస్‌కు తగిన ఎగ్జిట్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల కల్పన దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.

NaraLokesh

Tags: #Amaravati#AmaravatiCapital#AndhraDevelopment#AndhraNews#AndhraPradesh#APGovernment#APpolitics#APUpdates#DevelopmentPolitics#DSCRecruitment#EducationJobs#InfrastructureDevelopment#KaajaEastLakePark#LokeshChallenge#Mangalagiri#MangalagiriDevelopment#MangalagiriNews#megadsc#MegaDSC2025#naralokesh#NaraLokeshNews#news7telugu#PemmmasaniChandrasekhar#PoliticalNews#Tdp#TeacherRecruitment#TeluguNews#UrbanChallengeFund#VaikunthaMahaprasthanam#ysjagan
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

TelanganaPublicSchool:తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి పబ్లిక్ స్కూల్ ఏర్పాటు: సీఎం రేవంత్

Next Post

PoojaHegde:సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పూజా హెగ్డే తాజా ఫోటోలు

Related Posts

PoojaHegde
Entertainment

PoojaHegde:సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పూజా హెగ్డే తాజా ఫోటోలు

TelanganaPublicSchool
Big Story

TelanganaPublicSchool:తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి పబ్లిక్ స్కూల్ ఏర్పాటు: సీఎం రేవంత్

KariaMunda
Big Story

KariaMunda:అధికారం కాదు… ఆదర్శం కావాలి! ఇందుకు కరియా ముందా దిక్సూచి.

Telangana
Big Story

Telangana:ఉద్యోగులు–పెన్షనర్ల ఆరోగ్య సేవల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

DeepaThomas
Entertainment

DeepaThomas:టాలీవుడ్‌లో మెరిసే కొత్త తార.. దీపా థామస్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్

#ChandrababuNaidu, #Amaravati, #AmaravatiCapital, #SingaporePlus, #APDevelopment, #AndhraPradesh, #CII2026, #BusinessRoadShow, #Singapore, #InvestInAP, #GlobalInvestments, #PeopleFirst, #FutureCity, #SmartCity, #KrishnaRiver, #Infrastructure, #IconicBridges, #IndustrialGrowth, #ArcelorMittal,
Andhra Pradesh

Amaravati:సింగపూర్ కాదు.. సింగపూర్ ప్లస్‌గా అమరావతి నిర్మాణం: సీఎం చంద్రబాబు నాయుడు

Next Post
PoojaHegde

PoojaHegde:సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పూజా హెగ్డే తాజా ఫోటోలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

PoojaHegde

PoojaHegde:సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పూజా హెగ్డే తాజా ఫోటోలు

NaraLokesh

NaraLokesh:మెగా డీఎస్సీపై జగన్‌కు లోకేష్ ఓపెన్ ఛాలెంజ్.. అమరావతిపై కక్షతోనే జగన్ నిర్ణయాలు: మంత్రి నారా లోకేష్

TelanganaPublicSchool

TelanganaPublicSchool:తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి పబ్లిక్ స్కూల్ ఏర్పాటు: సీఎం రేవంత్

KariaMunda

KariaMunda:అధికారం కాదు… ఆదర్శం కావాలి! ఇందుకు కరియా ముందా దిక్సూచి.

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info