టాలీవుడ్ లో కృతిశెట్టి కెరీర్ ఎలా సాగిందన్నది చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు అందం, అభినయంతో తిరుగులేని నాయికగా ఎదుగుతుందని భావించారు. కానీ సొగసరి కెరీర్ అందుకు భిన్నంగా సాగింది. తెలుగు అవకాశాలు తగ్గడంతో? తమిళ, మలయాళ చిత్రాలపై దృష్టి పెట్టింది. మాలీవుడ్ లో మాత్రం అమ్మడికి గ్రాండ్ లాంచింగ్ దక్కింది. గతేడాది రిలీజ్ అయిన `ఏఆర్ ఎమ్` తో మంచి విజయం అందుకుంది. ఆ సినిమా ఏకంగా అమ్మడిని 100 కోట్ల క్లబ్లో కూర్చోబెట్టింది. కానీ ఆ తర్వాత అక్కడే కొత్త అవకాశాలు అందుకోవడంలో మాత్రం వెనుకబడే ఉంది.
`ఏ ఆర్ ఎమ్` తర్వాత ఇంత వరకూ మళ్లీ మరో సినిమాకు సైన్ చేయలేదు. కోలీవుడ్ లో మాత్రం రెండు సినిమాలు చేస్తోంది. `కస్టడీ` తో తమిళ్ లో లాంచ్ అయినా? ఆశించిన ఫలితావ్వలేదు. దీంతో ఇదే ఏడాది `లవ్ ఇన్సురెన్స్` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. ఇందులో ప్రదీప్ రంగనాద్ కు జోడీగా నటిస్తోంది. నయనతార గెస్ట్ అప్పిరియన్స్ ఇస్తుండగా విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. ప్రస్తుతం ప్రదీప్ రంగనాధ్ పుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికే విజయాలతో హ్యాట్రిక్ నమోదు చేసాడు.
తమిళ నటుడైనా తెలుగులోనే యువ హీరోకి మంచి ఫాలోయింగ్ ఉంది. యూత్ పుల్ కాన్సెప్ట్ లతో యువతకు బాగా రీచ్ అయ్యాడు. దీంతో ఈ సినిమాపై బేబమ్మ కూడా చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా అమ్మడికి రెండు భాషల్లోనూ కలిసొచ్చే చిత్రం. తెలుగులో హిట్ అందుకుని చాలా కాలమవుతుంది. ఇక్కడ మళ్లీ నటిగా బిజీ అవ్వాలని ఆశపడుతుంది. గత సినిమా ఫలితాలు ఎలా ఉన్నా? ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకుని బిజీ నాయికగా మారాలని చూస్తోంది. సక్సెస్ అయితే కోలీవుడ్ లోనూ అమ్మడికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది.
ఈ సినిమాతో పాటు కార్తీ సరసన `వా వాత్తయార్` లోనటిస్తోంది. ఈసినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. అమ్మడి కిట్టీలో ఇదో బిగ్ ప్రాజెక్ట్ గా చెప్పొచ్చు. ఈ సినిమా విజయం సాధిస్తే అక్కడ స్టార్ హీరోలకు జోడీగా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా ఈ చిత్రం కూడా అమ్మడికి అక్కడ కీలకమనే చెప్పాలి. `లవ్ ఇన్సురెన్స్` కంపెనీ `వా వాత్తయార్` వచ్చే నెలలోనే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఏడాది ముగింపు వేళ అమ్మడికి ఈ రెండు సిని మాలు ఏ మేర కలిసొస్తాయి? అన్నది చూడాలి. అలాగే `జెన్నీ` అనే మరో తమిళ చిత్రంలోనూ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
















