ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇలా ఈయనకు 11 స్థానాలు రావడానికి గల కారణం ఆయన పట్ల వ్యతిరేకత ఏర్పడటమే అని తెలుస్తుంది ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందినవారు వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత కనబరిచారు. ఆంధ్రప్రదేశ్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు అత్యధికంగా ఉన్నారు. ఈ బీసీ సామాజిక వర్గం తర్వాత ఎక్కువగా ఉన్నవారు కాపు సామాజిక వర్గాలే.
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించారు. అయితే ఈయన ఎన్నికలలో పోటీ చేయకపోయినా తన మద్దతు తెలుగుదేశం పార్టీకి తెలియజేశారు దీంతో 2014 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన మెజారిటీని అందుకుంది అయితే 2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ టిడిపికి దూరంగా ఉంటూ ఒంటరిగా పోటీ చేశారు ఇలా ఈయన గాజువాక, భీమవరంలో పోటీ చేసినప్పటికీ ఓటమిపాలు అవ్వక తప్పలేదు.
ఇక 2019 ఎన్నికల అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరచూ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం ఆయన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం ముఖ్యంగా తన మూడు పెళ్లిళ్ల గురించి తరచూ ప్రస్తావిస్తున్న నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వారి నుంచి ఎంతో వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఈ వ్యతిరేకత కారణంగానే 2024 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు రావడానికి కారణమైంది. ఇక 2024 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ తిరిగి బిజెపి తెలుగుదేశం పార్టీతో కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించారు. ఇలా పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినందుకు ఈ పరిస్థితి వచ్చిందని తెలుసుకున్న జగన్ ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గురించి ఎక్కడ పెద్దగా ప్రస్తావించలేదు. పవన్ విషయంలో మరోసారి అలాంటి తప్పు జరగకుండా జగన్ జాగ్రత్త పడుతున్నారని తెలుస్తుంది.