ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Indus River Agreement: సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్

Indus River Agreement: సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్
ADVERTISEMENT

సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్ కు భారత్ చాలా సార్లే అవకాశం ఇచ్చింది. అయినప్పటికీ ఆ దేశం మారలేదు. ఇప్పుడు తాజాగా జరిగిన ఉగ్రదాడితో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఇంక ఉపేక్షించేదే లేదంటూ సింధు జాలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. గతంలోనే ప్రధాని మోదీ రక్తం, నీరు కలిపి ఒకచోట ప్రవహించలేదు అని అన్నారు. కానీ ఇప్పటి వరకు పాక్ ను ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనతో సిధుజలాల జోలికి వెళ్ళలేదు. తాజాగా పాక్ తో దౌత్య సంబంధాలతో పాటూ 64 ఏళ్ళ సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది భారత్.

పాకిస్తాన్‌తో 1960లో కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందాన్నితాత్కాలికంగా నిలిపివేయాలని భారత్ నిర్ణయించింది. పహల్గాం దాడి తర్వాత భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం(ఏప్రిల్ 23)జరిగిన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.”1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందం తక్షణమే నిలిపివేస్తున్నాం. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం ఆపే వరకు ఈ తాత్కాలిక నిషేధం అమలులో ఉంటుంది” అని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు.పాకిస్తాన్ విషయంలో భారత్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. కానీ అవన్నీ అంత తీవ్రమైనవేమీ కాదు.

”పాకిస్తాన్ హైకమిషన్‌ సిబ్బందిని తగ్గించింది కానీ మూసివేయలేదు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది కానీ రద్దు చేయలేదు. పాకిస్తాన్ ప్రజలకు ఉన్న సార్క్ (SAARC ) వీసా సౌకర్యాన్ని ఆపివేసింది కానీ అన్ని రకాల వీసాలు కాదు” అని ది హిందూ దినపత్రిక దౌత్య వ్యవహారాల ఎడిటర్ సుహాసిని హైదర్ రాశారు.ఈ నిర్ణయాల తర్వాత భారత్ సైనిక చర్యకు దిగుతుందా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.”పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని భారత్ నిర్ణయించుకుంటే కొన్ని అవకాశాలున్నాయి. భారత్ వైమానిక దాడి చేయగలదు. 2016లో మాదిరి ప్రత్యేక మిలటరీ ఆపరేషన్ చేయగలదు. అయితే క్షిపణులను ప్రయోగించకపోవచ్చు. ఎల్ఓసీలో కాల్పుల విరమణ ముగిసిపోతుంది. కొందరిని లక్ష్యంగా చేసుకుని చంపే అవకాశమూ ఉంది” అని బ్రిటిష్ మ్యాగజైన్ ది ఎకనామిస్ట్ డిఫెన్స్ ఎడిటర్ శశాంక్ జోషి రాశారు.

భారత్ తీసుకున్న నిర్ణయాలన్నింటిలోకి సింధు జలాల ఒప్పందం నిలిపివేతపై పాకిస్తాన్‌లో ఎక్కువ చర్చ జరుగుతోంది.భారత్ ఇలాంటి ఏకపక్ష నిర్ణయం తీసుకోకూడదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని ఇస్‌హాక్ దార్ పాకిస్తాన్ మీడియాతో అన్నారు.”గతంలోని అనుభవం దృష్ట్యా భారత్ ఇలా చేస్తుందనే ఆలోచన మాకుంది. నేను తుర్కియేలో ఉన్నా. పహల్గాం దాడిని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఖండించింది. సింధు జలాల ఒప్పందమే కాకుండా భారత్ తీసుకున్న మిగిలిన నాలుగు నిర్ణయాలకు సమాధానం చాలా తేలిగ్గా కనుగొనచ్చు.’’ అని పాకిస్తాన్ న్యూస్ చానల్ సమ టీవీకి చెప్పారు.

సింధు జలాల ఒప్పందం విషయంలో భారత్ ఇప్పటికే మొండిగా ఉంది. నీటి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు వారు ఇప్పటికే కొన్ని రిజర్వాయర్లు కట్టారు. ఈ ఒప్పందంలో ప్రపంచ బ్యాంకుకు భాగస్వామ్యం ఉంది. ఈ విషయంలో భారత్ ఏకపక్ష నిర్ణయం తీసుకోకూడదు. అలాంటప్పుడు ప్రపంచంలో నిరంకుశత్వం మొదలవుతుంది. ‘బలవంతుడు సరైనవాడు’ అనేది ఉపయోగపడదు. భారత్ దగ్గర న్యాయపరమైన సమాధానం లేదు. పాకిస్తాన్ న్యాయ మంత్రిత్వ శాఖ దీనికి సమాధానమిస్తుంది” అని ఇస్‌హాక్ దార్ చెప్పారు.”ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది, తర్వాత ఏ చర్య తీసుకుంటుంది? ఉదాహరణకు, ఎలాంటి చర్య తీసుకోకపోతే దానికి అర్థం లేదు” అని సమ టీవీలో ప్రసారమైన అదే కార్యక్రమంలో ఒక పాకిస్తానీ నిపుణుడు అభిప్రాయపడ్డారు.

సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. అయితే సింధు, జీలం, చీనాబ్ నీటిని ఆపడానికి భారత్ దగ్గర మౌలిక సదుపాయాలు లేవన్నది నిజం. కానీ పాకిస్తాన్ వెంటనే కొన్ని నిర్దుష్ట నిర్ణయాలు తీసుకోవలసి ఉంది. ప్రపంచ బ్యాంకు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలి. ఎందుకంటే ఈ ఒప్పందానికి హామీ ఉన్నవారిలో ప్రపంచబ్యాంకు ఒకటి. దౌత్య సంబంధాలకు సంబంధించిన నిర్ణయంలో ఎత్తుకు పై ఎత్తు తరహాలో ప్రతిస్పందించవచ్చు” అని భారత్‌లో పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ డాన్ న్యూస్‌తో అన్నారు.

“పఠాన్‌కోట్ దాడి జరిగినప్పుడు నేను భారత హైకమిషనర్‌గా ఉన్నాను. ఆ సమయంలో ఉరీ దాడులు కూడా జరిగాయి. నా అనుభవం ప్రకారం పాకిస్తాన్ భయపడకూడదు. వాఘా సరిహద్దు అప్గనిస్తాన్‌కు తెరిచి ఉంది. భారత్ దీని గుండా వస్తువులు అఫ్గానిస్తాన్‌‌కు ఎగుమతి చేస్తుంది మరి ఇప్పుడు భారత్ అఫ్గానిస్తాన్‌కు కూడా వస్తువుల సరఫరా ఆపివేస్తుందేమో చూడాలి” అని అబ్దుల్ బాసిత్ అన్నారు.”ప్రపంచంలోని ప్రస్తుత వాతావరణంలో నియమాలను ఎవరూ పాటించడం లేదుకదా…. అంతర్జాతీయ సంస్థలన్నీ నిష్క్రియాపరత్వంతో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సింధు జలాల ఒప్పందంపై భారత్ ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే పాకిస్తాన్ ఏం చేయగలదు” అన్న ప్రశ్న అబ్దుల్ బాసిత్‌కు ఎదురయింది.

“ఇది పెద్దగా ప్రభావం చూపుతుందని అనుకోవడం లేదు. పశ్చిమ నదుల నుంచి పాకిస్తాన్‌కు ఏటా దాదాపు 133 మిలియన్ల ఎకరాలకు నీరు అందుతుంది. ప్రస్తుతం భారత్ ఈ నీటిని ఆపగలిగే స్థితిలో ఉందని అనుకోవడం లేదు. పాకిస్తాన్ దౌత్యపరంగా కొంచెం క్రియాశీలకంగా ఉండాలి” అని అబ్దుల్ బాసిత్ బదులిచ్చారు.”నీటిని ఆపడానికి మౌలిక సదుపాయాలను భారత్ నిర్మించలేకపోయింది. కాబట్టి ప్రస్తుతం పెద్ద సమస్యేమీ లేదు, అయితే దీన్ని నివారించడానికి పాకిస్తాన్ క్రియాశీలకంగా ఉండాలి. ఉదాహరణకు, ఈ విషయంలో చైనా కూడా పాకిస్తాన్‌కు సహాయం చేయగలదు. చైనా నుంచి చాలా నదులు భారత్‌కు ప్రవహిస్తాయి. కాబట్టి చైనా కూడా నీటిని ఆపడానికి చర్యలు తీసుకోవచ్చు. ఇందుకు చాలా అవకాశాలున్నాయనుకుంటున్నా. నియమాల ప్రకారం పనిచేసే వ్యవస్థ లేదు గానీ ఇంకా చాలా అవకాశాలున్నాయి. అది మనుగడకు సంబంధించిన విషయంగా మారి, నీటిని విడుదల చేయకపోతే, రక్తం చిందించాల్సి వస్తుంది” అని అబ్దుల్ బాసిత్ చెప్పారు.

“ఇది అసాధారణమైన చర్య. అందరూ కట్టుబడి ఉండాల్సిన ఒప్పందం. ఎవరూ ఏకపక్ష నిర్ణయం తీసుకోలేరు. ఇది ప్రమాదకరమైన నిర్ణయం. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి తీసుకెళ్లవచ్చు. నీటిని మళ్లించడం భారత్‌కు అంత తేలిక కాదు. దీనికి సంవత్సరాలు పట్టవచ్చు” అని పాకిస్తాన్ మాజీ న్యాయ మంత్రి అహ్మర్ బిలాల్ సూఫీ దునియా టీవీతో చెప్పారు.‘పాకిస్తాన్ వ్యవసాయ ఉత్పత్తులలో 90% సింధు ఒప్పందంతో ముడిపడి ఉన్నాయి. ఈ ఒప్పందంపై ఆధారపడి ఉన్న పాకిస్తాన్ భారత్ నిర్ణయాన్ని ఎలా ఎదుర్కొంటుంది’ అని ప్రఖ్యాత విశ్లేషకులు షాజాద్ చౌధరిని ఇదే టీవీ కార్యక్రమంలో ప్రశ్నించారు.

“ఎన్ని యుద్ధాలు జరిగినప్పటికీ ఈ ఒప్పందానికి ఎలాంటి అడ్డంకీ రాలేదు, కానీ ఇప్పుడు జరుగుతున్నది ఊహించనిది. అయితే భారత్ నిర్ణయం వల్ల తక్షణ ప్రభావం ఏమీ ఉండదు” అని షాజాద్ చౌధరి బదులిచ్చారు.”పాకిస్తాన్ నదులలో నీళ్లు లేకపోవడం జరగదు. జీలం, చీనాబ్‌పై ఆనకట్టలు నిర్మించడం ద్వారా ఏమన్నా చేయగలరు గానీ ఇప్పటికే భారత్ ఆ పని చేస్తోంది. దాని వల్ల పాకిస్థాన్‌కు పెద్దగా కలిగే హాని ఏమీ లేదు” అని ఆయన అభిప్రాయపడ్డారు.”మనం కూడా చాలా విషయాలకు సమాధానం చెప్పాల్సి ఉంది. ఉదాహరణకు, సిమ్లా ఒప్పందం ఏమవుతుంది? కరాచీ ఒప్పందం సంగతేంటి? నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఎలా ఉండబోతోంది? అణ్వాయుధాలకు సంబంధించిన సమాచారం ఏమవుతుంది? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు తలెత్తుతాయి” అని షాజాద్ చౌధరి అన్నారు.

“భారత్ రాజకీయ నిర్ణయం తీసుకుంది. దాని ప్రభావం పెద్దగా ఉండబోదు. భారత్ ఇప్పటికే సింధు జల ఒప్పందంపై తీసుకున్న నిర్ణయం అమలుకు సిద్ధమవుతోంది. ల్యాండ్ లాక్‌డ్ దేశాలకు ట్రాన్స్‌షిప్‌మెంట్‌ను రద్దు చేస్తోంది. కానీ భారత్ ఇక్కడితో ఆగదని మనం గుర్తుంచుకోవాలి” అని చౌధరి వ్యాఖ్యానించారు.ఇది పాక్ చాలా పెద్ద షాక్. ఇండస్ రివర్ వాటర్ ఆగిపోతే పాకిస్తాన్ ఎడారిగా మారుతుంది అనడంతో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచంలో అతి తక్కువ నీటి వనరులు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. దీనికి ప్రధాన ఆయువు ఇండస్ రివర్ వాటర్ ఒక్కటే. మొత్తం దేశ వ్యవసాయం సింధూ జలాలపైనే ఆధారపడి ఉంటుంది. అక్కడి పంజాబ్, సింధ్ వంటి రాష్ట్రాలకు ఇదే ప్రధాన వనరు. బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ ప్రాంతాలు అతి తక్కువ నీటి వనరులు కలిగిన ప్రాంతాలుగా ఉన్నాయి. ఇప్పుడు భారత్ ఈ నీటిని ఆపేస్తే ఈ ప్రాంతాలన్నీ ఎడారిగా మారతాయి. ఇప్పటికే విపరీతమైన ద్రవ్యోల్బణం, పేదరికాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఈ దెబ్బకు మలమల మాడిపోవడం ఖాయం. దీంతో అక్కడ తాగు నీటికి కూడా కొరత ఏర్పడుతుంది.

Tags: #IndiaFightsTerror#IndusRiver#IndusWaterTreaty#JammuAndKashmir#KashmirNews#ModiLeadership#ModiOnTerror#NarendraModi#PahalgamTerrorAttack#PahalgamUnderAttack#PMModi#RiverDiplomacy#SindhuRiver#TerrorInKashmir#WaterWars
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Samantha: అత‌నితో ప్ర‌త్యేక బంధం..!

Next Post

Olectra Greentech: మెరుగైన కాంక్రీట్ రీన్‌ఫోర్స్‌మెంట్ కోసం విప్లవాత్మక GFRP రీబార్‌ను ప్రారంభించిన ఒలెక్ట్రా

Related Posts

Nakshatra
Entertainment

Nakshatra : ‘తెల్ల కాగితం’తో హీరోయిన్‌గా నక్షత్ర.. తొలి సినిమాతోనే అదరగొట్టిందిగా!

Rayalaseema Development
Andhra Pradesh

Rayalaseema Development: రెండేళ్లలోనే మారుతున్న రాయలసీమ రాత.. ఇండస్ట్రీ, అగ్రి, ఎనర్జీ హబ్‌గా కొత్త రూపం

Revanth Reddy KCR Family Assets Row
Big Story

Revanth Reddy KCR Family Assets Row: రేవంత్‌-కేసీఆర్‌ కుటుంబాల ఆస్తుల పంచాయితీ.. ఆరోపణలు ఎటు దారి?

Miyapur PG Student Murder
Big Story

Miyapur PG Student Murder: మియాపూర్ హోటల్‌లో పీజీ వైద్య విద్యార్థిని సృజన మృతి.. రవికుమార్ కోసం పోలీసుల గాలింపు

Telangana Cabinet
Big Story

Telangana Cabinet : ఉద్యోగులకు రెండు డీఏలు.. కరువు, విద్యుత్‌పై కీలక నిర్ణయాలు

Captain Smith Macher
Big Story

Captain Smith Macher: కత్తి దాడి జరిగినా విమానాన్ని కాపాడిన భారతీయ పైలట్.. రియల్ హీరోకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు

Next Post
Olectra Greentech: మెరుగైన కాంక్రీట్ రీన్‌ఫోర్స్‌మెంట్ కోసం విప్లవాత్మక GFRP రీబార్‌ను ప్రారంభించిన ఒలెక్ట్రా

Olectra Greentech: మెరుగైన కాంక్రీట్ రీన్‌ఫోర్స్‌మెంట్ కోసం విప్లవాత్మక GFRP రీబార్‌ను ప్రారంభించిన ఒలెక్ట్రా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Nakshatra

Nakshatra : ‘తెల్ల కాగితం’తో హీరోయిన్‌గా నక్షత్ర.. తొలి సినిమాతోనే అదరగొట్టిందిగా!

Rayalaseema Development

Rayalaseema Development: రెండేళ్లలోనే మారుతున్న రాయలసీమ రాత.. ఇండస్ట్రీ, అగ్రి, ఎనర్జీ హబ్‌గా కొత్త రూపం

Revanth Reddy KCR Family Assets Row

Revanth Reddy KCR Family Assets Row: రేవంత్‌-కేసీఆర్‌ కుటుంబాల ఆస్తుల పంచాయితీ.. ఆరోపణలు ఎటు దారి?

Miyapur PG Student Murder

Miyapur PG Student Murder: మియాపూర్ హోటల్‌లో పీజీ వైద్య విద్యార్థిని సృజన మృతి.. రవికుమార్ కోసం పోలీసుల గాలింపు

Recent News

Nakshatra

Nakshatra : ‘తెల్ల కాగితం’తో హీరోయిన్‌గా నక్షత్ర.. తొలి సినిమాతోనే అదరగొట్టిందిగా!

Rayalaseema Development

Rayalaseema Development: రెండేళ్లలోనే మారుతున్న రాయలసీమ రాత.. ఇండస్ట్రీ, అగ్రి, ఎనర్జీ హబ్‌గా కొత్త రూపం

Revanth Reddy KCR Family Assets Row

Revanth Reddy KCR Family Assets Row: రేవంత్‌-కేసీఆర్‌ కుటుంబాల ఆస్తుల పంచాయితీ.. ఆరోపణలు ఎటు దారి?

Miyapur PG Student Murder

Miyapur PG Student Murder: మియాపూర్ హోటల్‌లో పీజీ వైద్య విద్యార్థిని సృజన మృతి.. రవికుమార్ కోసం పోలీసుల గాలింపు

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info