• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

HCU Lands: రాజకీయ రంగు పులుముకున్న HCU భూముల వివాదం!!

HCU Lands: రాజకీయ రంగు పులుముకున్న HCU భూముల వివాదం!!

భూముల వేలాన్ని వెంట‌నే ఆపండి

– హెచ్‌సీయూ భూముల వేలం వివాదంపై ఎంపీ డీకే. అరుణ‌- హెచ్‌సీయూ భూముల వేలాన్ని వెంటనే ఆపాల‌ని డిమాండ్‌- మిస్ట‌ర్ రేవంత్ రెడ్డి ఎవ‌రికోసం ఈ భూముల‌ను వేలం వేస్తున్నావ్..?
– నీ మొండి వైఖ‌రి వీడిచిపెట్టు, హెచ్‌సీయూ భూముల వేలాన్ని వెంట‌నే ఆపేయ్అప్పుడెమో ఆలా.. ఇప్పుడిలా..!?- గ‌తంలో భూముల అమ్మ‌కాన్ని వ్య‌తిరేకించిన భూముల అమ్మ‌కాన్ని వ్య‌తిరేకించిన రేవంత్.. ఇవాళ ఆయ‌నే స్వ‌యంగా HCU భూముల‌ను ఎందుకు అమ్ముకునాల‌నుకుంటున్నారో స‌మాధానం చెప్పాలి?- ఓ విద్యాసంస్థ‌కు చెందిన భూముల‌ను మీ స్వార్థం కోసం అమ్ముకుంటారా..?- విద్యార్థులు వ్య‌తిరేకిస్తున్నా ఎందుకీ మొండి వైఖ‌రి ఎవ‌రి కోసం ఈ వేలంపాటు..?- ఈ భూముల వేలం వద్దంటూ హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళ‌న‌ల చేస్తున్నా.. పోలీసు నీడలో ఎందుకు వేలం వేయాల‌నుకుంటున్నారు? – అస‌లు మీ పంతం ఏంటి..?- ప్ర‌జ‌ల కోసం కాదు మీ సొంత లాభం కోసం భూములను వేలం వేస్తున్నారు..
– రేవంత్ స‌ర్కార్ కు ఎంపీ డీకే అరుణ సూటి ప్రశ్నలుఅమ‌లు చేత‌గాక అమ్మ‌కాలా..? ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమ‌లు చేసే ద‌మ్ము లేకే భూముల అమ్మ‌కాలు- ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్ని మోసం చేసి గ‌ద్దెనెక్కారు.. – అధికారంలో ఉన్నాం క‌దా అని అహంకారంతో ఏదిప‌డితే అదిచేస్తే ఊరుకోము- ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నారుస్వ‌లాభం కోసమే…- ఏ ర‌హ‌స్య ఒప్పంధంతో హెచ్‌సీయూ భూముల‌ను వేలం వేస్తున్నావ్‌- ఈ భూముల వేలం తెలంగాణ ప్ర‌జ‌ల కోసం కాదు, దీనివల్ల‌ ప్ర‌జ‌ల‌కు ఒరిగేది ఏమీ లేదు..- రేవంత్ రెడ్డి స్వలాభం కోస‌మే ఈ భూముల‌ను వేస్తున్నారు- విద్యార్థులంతా ఈ భూముల వేలాన్ని వ‌ద్ద‌ని అడ్డుకుంటుంటే.. రేవంత్ రెడ్డి ప‌ట్టుబ‌ట్ట‌డం వెనుక మ‌త‌ల‌బు ఏంటి..? – ఇప్ప‌టికే ప‌థ‌కాల అమ‌లు పేరుతో రాష్ట్ర భ‌విష్య‌త్తును అంథ‌కారంలోకి నెట్టారు- అదే అన్నావాయితిని కొనసాగిస్తామంటే ఊరుకోము- ఈ భూముల వేలాన్ని వ‌ద్దంటున్న ప్ర‌జ‌ల‌, విద్యార్థుల అభిష్టాన్ని ప్ర‌భుత్వం గౌర‌వించాలి

– వెంట‌నే హెచ్‌సీయూ భూముల వేలాన్ని ఆపేయాలి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రైవేటు వ్యక్తి చేతుల్లో ఉన్న భూమిని కాపాడి ప్రజలకు ఆస్తిగా సమకూర్చాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి చెందిన ఇంచు భూమిని కూడా ప్రభుత్వం గుంజుకోలేదు కంచ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించింది కాదు.పది సంవత్సరాలు అధికారంలో ఉన్న గత పాలకులు ఈ భూమిని కాపాడే విషయాన్ని గాలికొదిలేశారు ప్రజలకు సంపద సృష్టించడానికి ఈ భూమిని టీజీఐఐసీకి అప్పగించాంమీడియా సమావేశంలో వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఇంచు భూమిని కూడా ప్రజా ప్రభుత్వం గుంజు కోలేదు. కంచ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించింది కాదు. ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో అన్యాక్రాంతమైన రాష్ట్ర సంపదను న్యాయస్థానంలో పోరాడి విజయం సాధించి తిరిగి ప్రజలకు ఆస్తిగా ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రులు దుదిల్ల శ్రీధర్ బాబు, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించిన 534.28 ఎకరాల భూమిని 2024 ఫిబ్రవరి 03న రెవిన్యూ అధికారులకు అప్పగించగా, వారు గోపన్ పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 36 లో 191.36 ఎకరాలు సర్వేనెంబర్ 37 లో 205.20 ఎకరాలను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి అప్పగించి భూ బదలాయింపు చేసుకున్నారని భూ బదలాయింపు జరిగిన తర్వాత అప్పటి ప్రభుత్వం కంచ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమిని బిల్లీ రావు ప్రాతినిథ్యం వహించిన ఐఎం జి ఫ్లోరిడాకు చెందిన ఐఎంజి భారత్ అనే క్రీడా నిర్వహణ సంస్థకు కేటాయించారని, ప్రభుత్వం ఒప్పందం మేరకు ఆ భూమిలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకపోవడంతో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా శ్రేయస్సుకు వ్యతిరేకంగా కోట్లాది విలువైన 400 ఎకరాల భూమిని ఐఎంజి భారత్ కు కేటాయించడాన్ని రద్దు చేశారని తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఐఎంజి భారత్ సవాల్ చేస్తూ హైకోర్టులో WP NO 24781 ద్వారా రిట్ పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు.‌ ఐఎంజి భారత్ వేసిన రిట్ పిటిషన్ పై అప్పటి ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు న్యాయస్థానంలో మంచి అడ్వకేట్లు నియామకం చేసి ప్రభుత్వపరంగా వాదనలు వినిపించారని వివరించారు. మన వనరులు మనకే కావాలని, ఆస్తిత్వం, ఆత్మగౌరవం కోసం దశాబ్దాలుగా పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన గత పాలకులు ప్రైవేటు వ్యక్తి చేతుల్లో ఉన్న ఈ భూమిని ప్రభుత్వానికి తీసుకువచ్చే విషయాన్ని పట్టించుకోకపోగా గాలికి వదిలేశారని విమర్శించారు. కోట్లాది విలువైన ఈ భూమి ప్రైవేటు వ్యక్తి చేతుల్లోనే ఉంటే మరో రకంగా గత పాలకులు వారి చేతుల్లోకి తెచ్చుకోవాలనే కుట్రతోనే న్యాయస్థానంలో గట్టిగా కొట్లాడ లేదన్నారు. ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో ఉన్న 400 ఎకరాల భూమి రాష్ట్ర సంపద, ప్రజల ఆస్తిగా భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సహా యావత్తు మంత్రి మండలి కూర్చొని ఆలోచన చేసి ఎట్టి పరిస్థితిలో ఈ భూమి ప్రైవేటు వ్యక్తి చేతుల్లోకి పోనివ్వకుండా ప్రజలకు సంపద సృష్టించే ఆస్తిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకొని మంచి న్యాయవాదులను నియామకం చేసి న్యాయస్థానంలో కొట్లాడి వేల కోట్ల విలువైన భూమిని రాష్ట్రానికి తీసుకొచ్చామని ఇది ప్రజల విజయమని అన్నారు.

ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో అన్యాక్రాంతమైన వేల కోట్ల విలువైన భూమిని కాపాడి ప్రజలకు ఆస్తిగా ఇచ్చిన ప్రజా ప్రభుత్వాన్ని శభాష్ అని ప్రశంసించాల్సిన ప్రతిపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు. గత పాలకుల మాదిరిగా ప్రజా ప్రభుత్వం స్పందించకుంటే వేలాది కోట్ల విలువైన 400 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో అన్యాక్రాంతం అయ్యి ఉండేది కాదా అని వారిని ప్రశ్నించారు. ప్రైవేటు వ్యక్తి నుంచి తీసుకువచ్చిన భూమిని రాష్ట్ర ప్రజలకు ఆస్తిగా సృష్టించాలని, లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న తాపత్రయంతో రెవెన్యూ శాఖ నుంచి టీజీఐఐసీ కి అప్పగించామే తప్ప ఇందులో ఎవరికీ ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదన్నారు. ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీ లో ఫేస్ 1, ఫేస్ 2కి పునాదులు వేయడం వల్లనే హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారడం వల్ల అనేక ఐటీ సంస్థలు నగరానికి వచ్చి కంపనీలు పెట్టడం వల్ల లక్షల మంది యువతకు ఉద్యోగాలు దొరికాయని తద్వారా హైదరాబాద్ మహానగరం అభివృద్ధి చెందిందన్నారు. అదే తరహాలో కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో సంపద సృష్టించడం యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచనతో దాని అభివృద్ధి చేస్తున్నామే తప్ప ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి స్వార్థం లేదని వివరించారు. టీజీఐఒసీ తయారు చేసిన డ్రాఫ్ట్ లేఔట్ లో ఈ భూముల్లో ఉన్న న్యాచురల్ రాక్ ఫార్మేషన్స్, దాని లో భాగంగా మష్రూమ్ రాక్ ను కాపాడడానికి ప్రత్యేక చర్యలు గైకొనడంలో భాగంగా ఈ ప్రాంతాలను లే అవుట్ నుండి మినహాయించామని చెప్పారు. పొల్యూషన్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ ఉండాలని పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ప్రైవేటు వ్యక్తి చేతుల్లో అన్యాక్రాంతం కాకుండా పోరాటం చేసి కాపాడిన ఈ భూమిని ప్రజలకు ఆస్తిగా ఇవ్వడానికి ప్రజా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని కొన్ని రాజకీయ పార్టీలు వారి మీడియా సంస్థల ద్వారా సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు అర్థం చేసుకొని తిప్పి కొట్టాలని విజ్ఞప్తి చేశారు. కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం రాష్ట్ర సంపదను తాకట్టు పెట్టమని ప్రజల ఆస్తిని వారి చేతుల్లోకి పోనివ్వమన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో నాకు వ్యక్తిగతంగా బాండింగ్ ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.‌ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరింత అభివృద్ధి చెందాలని అందుకు కావలసిన సహకారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, అక్కడ చదివిన ప్రతి విద్యార్థికి బయటకు రాగానే ఉద్యోగాలు రావాలని, మంచి భవిష్యత్తు ఉండాలని మా ప్రభుత్వం కోరుకుంటుందని చెప్పారు.

ANI తో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా 400 ఎకరాల భూమిని కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వంఆ భూముల పరిరక్షణ కోసం కేసీఆర్ నిర్దేశం మేరకు న్యాయవాదులు కోర్టులో గట్టిగా వాదనలు వినిపించారుఇది యూనివర్సిటీ భూమి అని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళవద్దన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయ పోరాటం చేసిందిసీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారుసీఎం రేవంత్ రెడ్డి దుశ్చర్య వల్ల హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయింది కాబట్టి 400 ఎకరాల భూమిని విక్రయించాలని నిర్ణయించారు యూనివర్సిటీ నుంచి తీసుకున్న భూమిని యూనివర్సిటీకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం397 ఎకరాలను ఇతర చోట యూనివర్సిటీకి ఇచ్చామని ప్రభుత్వం వితండవాదం చేస్తుందిపరిశ్రమల ఏర్పాటు, భూముల విక్రయం ఆ 397 ఎకరాల్లో చేసుకోవచ్చు కదాప్రభుత్వం పర్యావరణం, ప్రకృతి కోణంలో కూడా ఆలోచించాలిఇప్పటికే కాంక్రీట్ జంగిల్ లాగా మారిన గచ్చిబౌలి ప్రాంతంలో ఈ 400 ఎకరాల్లో కూడా పెద్ద ఎత్తున కంపెనీలు ఏర్పాటు అయితే వాతావరణం పై ఎంత ఒత్తిడి పెరుగుతుందొ ఆలోచించాలిబీఆర్ఎస్ హయాంలో మై హోమ్ విహంగ నిర్మాణానికి భూములు కేటాయించామనడంలో వాస్తవం లేదుమై హోమ్ విహంగా ప్రభుత్వ భూముల్లో నిర్మించినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్లను పంపించాలి కానీ మై హోమ్ రామేశ్వరరావు బిజెపి మనిషి కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఆ ధైర్యం చేయలేరు పేదలు, మూగజీవు లు ఉంటేనేమో బుల్డోజర్లను ప్రయోగిస్తారు… పెద్దవాళ్లనేమో ముట్టుకోరు

Tags: #BreakingNews#CampusUpdates#HCU#HCUControversy#HyderabadCentralUniversity#HyderabadNews#LandDispute#PoliticalNews#StudentNews #TelanganaNews#TelanganaPolitics#TeluguNews#UniversityNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Yogi Adityanath: రాజకీయ జీవితంపై షాకింగ్ కామెంట్లు చేసిన యోగి ఆదిత్య నాథ్‌!

Next Post

 Mukesh Ambani House: నెలవారీ విద్యుత్ బిల్లు ఎంతో తెలుసా?

Related Posts

Helicopter crash: చార్​ధామ్ యాత్ర‌లో హెలికాప్టర్ ప్ర‌మాదం.. ఐదుగురు మృతి..!
Big Story

Helicopter crash: చార్​ధామ్ యాత్ర‌లో హెలికాప్టర్ ప్ర‌మాదం.. ఐదుగురు మృతి..!

Basara: గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురి మృతి
Crime

Basara: గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురి మృతి

Money: హవాలా డబ్బుతో పరారైన డ్రైవర్​.. గుమస్తా..!
Big Story

Money: హవాలా డబ్బుతో పరారైన డ్రైవర్​.. గుమస్తా..!

TDP: కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయం
Andhra Pradesh

TDP: కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయం

Nusarat Jahan: ఎందులోను త‌గ్గేదేలే!
Entertainment

Nusarat Jahan: ఎందులోను త‌గ్గేదేలే!

Air India: కీలక సవాళ్లు..!
Big Story

Air India: కీలక సవాళ్లు..!

Next Post
 Mukesh Ambani House: నెలవారీ విద్యుత్ బిల్లు ఎంతో తెలుసా?

 Mukesh Ambani House: నెలవారీ విద్యుత్ బిల్లు ఎంతో తెలుసా?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Helicopter crash: చార్​ధామ్ యాత్ర‌లో హెలికాప్టర్ ప్ర‌మాదం.. ఐదుగురు మృతి..!

Helicopter crash: చార్​ధామ్ యాత్ర‌లో హెలికాప్టర్ ప్ర‌మాదం.. ఐదుగురు మృతి..!

Basara: గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురి మృతి

Basara: గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురి మృతి

Money: హవాలా డబ్బుతో పరారైన డ్రైవర్​.. గుమస్తా..!

Money: హవాలా డబ్బుతో పరారైన డ్రైవర్​.. గుమస్తా..!

TDP: కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయం

TDP: కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయం

Recent News

Helicopter crash: చార్​ధామ్ యాత్ర‌లో హెలికాప్టర్ ప్ర‌మాదం.. ఐదుగురు మృతి..!

Helicopter crash: చార్​ధామ్ యాత్ర‌లో హెలికాప్టర్ ప్ర‌మాదం.. ఐదుగురు మృతి..!

Basara: గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురి మృతి

Basara: గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురి మృతి

Money: హవాలా డబ్బుతో పరారైన డ్రైవర్​.. గుమస్తా..!

Money: హవాలా డబ్బుతో పరారైన డ్రైవర్​.. గుమస్తా..!

TDP: కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయం

TDP: కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయం

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info