పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి డీసీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరింత బిజీగా మారిపోయారు. కానీ అభిమానులను అలరించడానికి ముందే ఒప్పుకున్న మూడు సినిమాలను వేగంగా పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమాను జూలై 24న విడుదల చేశారు. కానీ ఇప్పటివరకు ఈ సినిమా ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది అనే విషయంపై అధికారిక పోస్టర్ మాత్రం మేకర్స్ రివీల్ చేయలేదు. శ్రీ మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా సత్యరాజ్ , బాబి డియోల్ తో పాటు మరికొంతమంది కీలక పాత్రలు పోషించారు.
సాధారణంగా థియేటర్లలోకి వచ్చిన ప్రతి సినిమా.. విడుదల తర్వాత ఫలితాన్ని బట్టి.. థియేటర్లలో విడుదలైన 6 వారాలు లేదా 8 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు కూడా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా థియేటర్లలో విడుదలైన 4 వారాలకే ఓటీటీలోకి రావడంతో ఓటీటీ ప్రియులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది ఏ ఓటీటీ ప్లాట్ఫారం వేదికగా అందుబాటులోకి వచ్చింది అనే విషయం ఇప్పుడు చూద్దాం..
ఆగస్టు 20వ తేదీ నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘హరిహర వీరమల్లు: పార్ట్1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్’ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది..ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సినిమా దాదాపు 15 నిమిషాల తక్కువ నిడివితో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 2గంటల 33నిమిషాల నిడివితో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి రోజు థియేటర్లలో సినిమా చూసిన వారు ఇప్పుడు ఓటీటీలో సినిమా చూస్తే మాత్రం తేడాలను ఈజీగా కనిపెట్టవచ్చు అని సమాచారం. ముఖ్యంగా ఈ సినిమా ఓటీటీ వెర్షన్లో చాలా మార్పులు జరిగాయని, హార్స్ రైడింగ్ సీన్స్, పవన్ కళ్యాణ్ విల్లు పట్టిన సన్నివేశాలతో పాటు ఇంటర్వెల్ తర్వాత వచ్చే వీఎఫ్ఎక్స్ పై కూడా విమర్శలు రావడంతో వాటిని ఇంకాస్త మెరుగుపరచినట్లు సమాచారం. మరి ఓటీటీలో ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే.. నిధి అగర్వాల్ తో పాటు వెన్నెల కిషోర్, రఘుబాబు, కబీర్ దుహాన్ సింగ్, సచిన్ ఖేడ్ ఖర్, కోటా శ్రీనివాసరావు, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఏ.ఎం.రత్నం సమర్పించగా.. ఏ. దయాకర్ రావు నిర్మించారు. ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుందని.. 30% షూటింగ్ కూడా పూర్తయిందని ఈ చిత్ర హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చింది. మరొకవైపు పవన్ కళ్యాణ్ సుజీత్ దర్శకత్వంలో ఓజీ , హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ఈ సినిమా పూర్తి చేస్తారేమో చూడాలి.
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన హరిహర వీరమల్లు రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఆ సినిమా.. ఐదేళ్లపాటు సెట్స్ పై ఉండి.. ఎట్టకేలకు రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అని, ఆయన యాక్షన్ ను అంతా కొనియాడారు.
పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, బాబీ డియోల్ కీలక పాత్ర పోషించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మించారు. అయితే మొదటి షో నుంచి సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. రిలీజ్ కు ముందు ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ అయినా.. అనుకున్నట్లు మాత్రం రిజల్ట్ రాలేదు.
దీంతో బయ్యర్స్ కు భారీ నష్టాలు వచ్చాయని తెలుస్తోంది. అదే సమయంలో ఏపీ, సీడెడ్ ఏరియాలకు సినిమాను కొన్న బయ్యర్లు ఇటీవల హైదరాబాద్ విచ్చేశారు. వైజాగ్, వెస్ట్, గుంటూరు, నెల్లూరు, సీడెడ్ నుంచి వచ్చిన బయ్యర్లు.. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ ను కలిశారు. తమ సమస్యలు, బాధలు చెప్పుకొన్నారు. వీరమల్లు మూవీతో తమకెంత నష్టాలు వచ్చాయో భరత్ భూషణ్ కు చెప్పినట్లు సమాచారం. ఉత్తరాంధ్రకు రూ.7 కోట్లు, వెస్ట్ గోదావరికి రూ.కోటి, గుంటూరు ఏరియాకు రూ.4 కోట్లు, నెల్లూరుకు రూ.2 కోట్లు, సీడెడ్ ఏరియాకు రూ.9 కోట్లు నష్టం వచ్చిందని వివరించారట. కనీసం జీఎస్టీ ఇన్వాయిస్ లు ఇప్పించాలని కోరారని వినికిడి.
అయితే ఆ తర్వాత భరత్ భూషణ్.. వీరమల్లు నిర్మాత ఏ ఎం రత్నానికి కాల్ చేశారని తెలుస్తోంది. తానేం డబ్బులు ఇవ్వలేనని చెప్పారట. అప్పుడు బయర్లంతా పవన్ కళ్యామ్ తో మాట్లాడి తమను మీట్ అయ్యేలా ప్లాన్ చేయాలని కోరారని సమాచారం. దీంతో బయర్స్ అంతా తాను ప్రయత్నిస్తానని భరత్ భూషణ్ హామీ ఇచ్చారని ఇండస్ట్రీలో టాక్. అయితే బయ్యర్స్ ఓ సూచన చేశారని వినికిడి. పవన్ కళ్యాణ్ మరో సినిమాలో నటించి.. తక్కువ రేట్స్ కు వీరమల్లు బయర్స్ కు ఇస్తే బాగుంటుందని.. అప్పుడు ఆదుకున్నట్లు కూడా అవుతుందని చెప్పారని సమాచారం. దీంతో తన వంతు ప్రయత్నం తాను చేస్తానని భరత్ భూషణ్ బయ్యర్లకు చెప్పగా, వారంతా వెనుతిరిగి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.