భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో దిద్దుబాటు కనిపిస్తోంది. భారత్‌లో నాలుగు రోజులుగా 24 క్యారెట్ గోల్డ్ (10 గ్రాములు) ధర సుమారు. 1.22 – 1.23 లక్షల రేంజ్‌లో కదలాడుతోంది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం, ఫెడ్ రేట్స్‌లో కోత లేకపోవడంతో బంగారానికి డిమాండ్ తగ్గుతోంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, దేశంలో బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే నేడు మళ్లీ స్వల్పంగా తగ్గాయి. శనివారం ఉదయం 6:30 గంటలకు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,010గా ఉంది. 22 క్యారెట్ బంగారం ధర రూ.1,11,840కు దిగింది.
కిలో వెండి ధర కూడా నిన్నటితో పోలిస్తే రూ.100 మేర తగ్గి రూ.1,52,400 వద్ద తచ్చాడుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ 24 క్యారెట్ బంగారం ధర సుమారు 4 వేల డాలర్ల వద్ద కొనసాగుతోంది. నేడు కూడా ధరలు దాదాపు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు (24కే, 22కే, 18కే)
చెన్నై: ₹1,22,940; ₹1,12,690; ₹93,990
ముంబై: ₹1,22,010; ₹1,11,840; ₹91,510
ఢిల్లీ: ₹1,22,160; ₹1,11,990; ₹91,660
కోల్‌కతా: ₹1,22,010; ₹1,11,840; ₹91,510
బెంగళూరు: ₹1,22,010; ₹1,11,840; ₹91,510
హైదరాబాద్: ₹1,22,010; ₹1,11,840; ₹91,510
విజయవాడ: ₹1,22,010; ₹1,11,840; ₹91,510
కేరళ: ₹1,22,010; ₹1,11,840; ₹91,510
పూణె: ₹1,22,010; ₹1,11,840; ₹91,510
వడోదరా: ₹1,22,060; ₹1,11,890; ₹91,560
అహ్మదాబాద్: ₹1,22,060; ₹1,11,890; ₹91,560
వెండి ధరలు ఇవీ
చెన్నై: ₹1,64,900
ముంబై: ₹1,52,400
ఢిల్లీ: ₹1,52,400
కోల్‌కతా: ₹1,52,400
బెంగళూరు: ₹1,52,400
హైదరాబాద్: ₹1,64,900
విజయవాడ: ₹1,64,900
కేరళ: ₹1,64,900
పూణె: ₹1,52,400
వడోదరా: ₹1,52,400
అహ్మదాబాద్: ₹1,52,400
















