బంగారం రల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. ఎక్కువ సార్లు పెరుగుతూనే ఉంటాయి. చాలా తక్కువ సార్లు మాత్రమే తగ్గుతుంటాయి. తగ్గినా అతి తక్కువగా, పెరిగితే భారీగా ధరలు పెరగడం బంగారానికి అలవాటు. అందుకే తగ్గిందని సంతోషించేలోగా, బంగారం ధరలు పెరిగినప్పుడు బాధపడటం కూడా అంతే స్థాయిలో జరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న వివిధ పరిణామాలతో పాటు డాలర్ తో రూపాయి విలువ తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత బంగారం ధరల పెరుగుదలకు ఇక ఫుల్ స్టాప్ పడలేదు. గత కొన్ని రోజుల నుంచి వేల రూపాయల బంగారం ధరలు పెరిగిపోయాయి.
2025 ఏడాది జనవరి ఒకటోతేదీ నుంచే బంగారం ధరలు పెరుగుదలను మొదలు పెట్టాయి. రెండు నెలలవుతున్నా ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర 88 వేల కు చేరువలో ఉంది. కిలో వెండి ధర లక్షా ఎనిమిది వేల రూపాయలు పలుకుతుంది. ఇంకా ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పాటు డిమాండ్ ఎక్కువగా ఉండటం, బంగారం నిల్వలు తక్కువగా ఉండటం, విదేశాల నుంచి బంగారం దిగుమతులు లేకపోవడం వంటి కారణాలతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు. ధరల పెరుగుదలతో కొనుగోళ్లు మందగించాయని వ్యాపారులు చెబుతున్నారు.
పెరిగిన ధరలను చూసి బంగారాన్ని, వెండిని కొనుగోలు చేయాలంటే ఎవరూ ముందుకు రాకపోవడంతో జ్యుయలరీ దుకాణాలు కూడా కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. అదే సమయంలో ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో అంతే పెరుగుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80,560 రూపాయలుకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,880 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,08,100 రూపాయలుగా కొనసాగుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు కనిపించే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు.
అంతర్జాతీయంగానూ పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పసిడిలో పెట్టుబడులకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పసిడి ధరలు తులానికి 80 వేల రూపాయలకు మించి ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 7 గంటల సమయానికి 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.80,560గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,880గా ఉంది.ఢిల్లీలో బంగారం ధర రూ.10 పెరిగి, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.80,700గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.88,030గా ఉంది
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.80,560గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,880గా ఉంది
ఢిల్లీలో బంగారం ధర రూ.10 పెరిగి, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.80,700గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.88,030గా ఉంది
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.80,560గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,880గా ఉంది.