ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Dude movie review: ‘డ్యూడ్’ మూవీ రివ్యూ

Dude movie review: ‘డ్యూడ్’ మూవీ రివ్యూ
ADVERTISEMENT

‘డ్యూడ్’ మూవీ రివ్యూ

నటీనటులు: ప్రదీప్ రంగనాథన్- మామిత బైజు- శరత్ కుమార్- రోహిణి- హృదు హరూన్- ఐశ్వర్య శర్మ తదితరులు

సంగీతం: సాయి అభ్యంకర్

ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మి

నిర్మాతలు: యలమంచిలి రవిశంకర్- నవీన్ ఎర్నేని

రచన- దర్శకత్వం: కీర్తీశ్వరన్

లవ్ టుడే.. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ చిత్రాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు తమిళ యువ కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్. అతడితో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమిళ- తెలుగు భాషల్లో నిర్మించిన చిత్రం.. డ్యూడ్. కొత్త దర్శకుడు కీర్తీశ్వరన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ‘ప్రేమలు’ ఫేమ్ మామిత బైజు కథానాయికగా నటించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్లో బాగానే అంచనాలు పెంచింది. మరి ఈ రోజే విడుదలైన ‘డ్యూడ్’ ఆ అంచనాలను ఏమేర అందుకుందో తెలుసుకుందాం పదండి.

కథ:

బావామరదళ్లయిన గగన్ (ప్రదీప్ రంగనాథన్).. కుందన (మామిత బైజు) చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. మంచి స్నేహితులుగా మారతారు. కుందనకు గగన్ మీద ప్రేమ పుడుతుంది. కానీ ఆమె మీద తనకు ఏ ఫీలింగ్స్ లేవని తనకు దూరమవుతాడు గగన్. కానీ తర్వాత కుందనను తాను కూడా ప్రేమిస్తున్నట్లు గుర్తించి.. తనను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ ఆ మధ్యలో కుందన.. మరో వ్యక్తిని ప్రేమిస్తుంది. పెద్దలు తమ పెళ్లి కుదిర్చినప్పటికీ.. కుందనకు తనను ప్రేమించిన వాడితోనే పంపించేయాలని నిర్ణయించుకుంటాడు గగన్. కానీ అనివార్య పరిస్థితుల్లో కుందనతో గగన్ పెళ్లవుతుంది. మరి ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి సాగారా.. కుందన ప్రేమ సంగతి ఏమైంది.. చివరికి వీళ్లిద్దరి జీవితాలు ఏ తీరానికి చేరాయి అన్నది మిగతా కథ.

కథనం- విశ్లేషణ:

క్లోజ్ ఫ్రెండ్స్ అయిన అబ్బాయి-అమ్మాయి మధ్య వాళ్లకు తెలియకుండానే ప్రేమ పుడితే..? అందులో ఒక వ్యక్తి తన ప్రేమను దాచి పెట్టేస్తే..? ఇంకో వ్యక్తి ఆలస్యంగా తానూ ప్రేమించిన విషయాన్ని రియలైజ్ అయితే..? మలయాళం నుంచి అరువు తెచ్చుకున్న ఈ కథతోనే పాతికేళ్ల కిందట ‘నువ్వే కావాలి’ అనే సినిమా ట్రెండ్ సెట్ చేసింది. ఆ తర్వాత ‘ఆర్య’ సినిమాలో వన్ సైడ్ లవ్ స్టోరీతో సుకుమార్ ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఆపై ఈ కథలనే ట్విస్ట్ చేసి బోలెడు ప్రేమకథలు తీశారు. ఐతే ఇప్పుడు అలాంటి కథలు రొటీన్ అయిపోయాయి. ‘నువ్వే కావాలి’.. ‘ఆర్య’.. ‘ఆర్య-2’ లాంటి చిత్రాలను గుర్తుకు తెచ్చే కథనే ఇప్పటి ట్రెండుకు తగ్గట్లుగా అన్వయించి ‘డ్యూడ్’ తీశాడు కొత్త దర్శకుడు కీర్తీశ్వరన్. ఇప్పటి ప్రేక్షకులు బాగా అడ్వాన్స్డ్ కాబట్టి.. ఏం జరిగినా చివరికి హీరో హీరోయిన్లు కలిసిపోయే కన్వెన్షనల్ క్లైమాక్స్ దిశగా అతను అడుగులు వేయలేదు. ఈ తరం ప్రేక్షకులు దేన్నయినా తట్టుకోగలరనే నమ్మకంతో కథను ఊహించని మలుపులు తిప్పాడు. అంత సులువుగా జీర్ణం కాని మలుపులతో ఈ స్టోరీని ముందుకు తీసుకెళ్లాడు. కానీ ఏం చేసినా ఎమోషన్ వర్కవుట్ కావడం మీదే సినిమా రుచిస్తుందా లేదా అన్నది ఆధారపడి ఉంది. ‘డ్యూడ్’కు ఆ విషయంలో మిక్స్డ్ ఫీలింగ్ ఇస్తుంది. కథాకథనాలు కొంచెం ఎగుడు దిగుడుగా సాగినా.. ప్రదీప్ రంగనాథన్ అదిరిపోయే పెర్ఫామెన్స్ వల్ల.. కొత్త సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ మెస్మరైజింగ్ మ్యూజిక్ వల్ల.. అక్కడక్కడా కొన్ని ఎంటర్టైనింగ్ సీన్ల వల్ల ‘డ్యూడ్’ నిలబడింది.

తాను ప్రేమించిన అమ్మాయి.. ఇంకో వ్యక్తిని ప్రేమిస్తే.. తనే దగ్గరుండి వాళ్లిద్దరినీ కలిపే కథలు దశాబ్దాల నుంచి ఉన్నాయి. ఇలాంటి కథల్లో ఏదో ఒకటి జరిగి హీరోయిన్ లవ్ స్టోరీ బ్రేక్ అయిపోవాలని.. తిరిగి హీరోతో హీరోయిన్ కలిసి పోతే బాగుంటుందని ఆశిస్తారు ప్రేక్షకులు. ‘డ్యూడ్’ కథ నడిచే తీరు చూస్తే.. చివరికి అలాగే సుఖాంతం అవుతుందని ఆశిస్తాం. కానీ ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఈ కథను నడిపించే ప్రయత్నం చేశాడు కొత్త దర్శకుడు కీర్తీశ్వరన్. ఐతే ఈ కథకు ప్రేక్షకులు కోరుకునే ముగింపు ఇవ్వకపోయినా ఓకే కానీ.. దాన్ని మించి అసలు జీర్ణించుకోలేని ఒక పాయింట్ ఉంది. తెరపై అది చూసినపుడు మాత్రం అదో రకమైన ఫీలింగ్ కలుగుతుంది. కథలో ఒక మాదిరి ట్విస్ట్ ఇవ్వడం ఓకే కానీ.. మరీ ఇంత మలుపు తిప్పాలా అనిపిస్తుంది అది చూశాక. అక్కడి నుంచి ఈ కథతో ప్రయాణం చేయడం చాలా కష్టమవుతుంది. ఒక్కసారిగా ఎమోషనల్ కనెక్ట్ కట్ అయిపోవడంతో ‘డ్యూడ్’ భారంగా మారి.. ప్రేక్షకులను నిరాశకు గురి చేస్తుంది.

‘డ్యూడ్’ ఆరంభంలో చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తుంది. హీరోయిన్ ప్రపోజ్ చేస్తే హీరో నో చెప్పడం.. తర్వాత అతను రియలైజ్ అయి ఆమెను తిరిగి ప్రేమించడం.. ఇంతలో ఆమె మరో అబ్బాయితో ప్రేమలో పడడం.. ఈ కన్ఫ్యూజన్ మధ్య వీళ్లిద్దరి పెళ్లికి రంగం సిద్ధం కావడం.. ఇలా ఆసక్తికర మలుపులతో ‘డ్యూడ్’ ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేస్తుంది. ఒక దశ వరకు ఎమోషన్ బాగా క్యారీ అయింది. అక్కడక్కడా కథనం కొంచెం పక్కదారి పట్టినా.. సన్నివేశాలు నెమ్మదించినా.. ప్రదీప్ రంగనాథన్ తన పెర్ఫామెన్సుతో కవర్ చేశాడు. ప్రేక్షకులను ఎంగేజ్ చేశాడు. కానీ ఇంటర్వెల్ తర్వాత మాత్రం ‘డ్యూడ్’ పూర్తిగా పక్కదారి పట్టేసింది. నాన్ సీరియస్ గా సాగే సన్నివేశాల మధ్య హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్ వర్కవుట్ చేయడానికి చేసిన ప్రయత్నం సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ చివర్లో దర్శకుడు బాగానే కవర్ చేయగలిగాడు. ముగింపు సన్నివేశాలు భలేగా అనిపిస్తాయి. కథాకథనాల్లో కొన్ని లోపాలున్నా.. ప్రదీప్ రంగనాథన్ పెర్ఫామెన్స్.. కొన్ని మెరుపుల కోసం ‘డ్యూడ్’పై ఒక లుక్కేయొచ్చు.

నటీనటులు:

ప్రదీప్ రంగనాథన్ కాకుండా ఎవ్వరు చేసినా ‘డ్యూడ్’ తేలిపోయేది అంటే అతిశయోక్తి కాదు. స్క్రీన్ మీద తాను కనిపిస్తుండగా.. ప్రేక్షకులు పక్కచూపులు చూడలేని విధంగా తన పెర్ఫామెన్స్ సాగింది. అతడికో సెపరేట్ స్టైల్ ఉంది. తన హావభావాలు.. మేనరిజమ్స్ అంత టిపికల్ గా ఉండి ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీని పెంచుతాయి. కీలక సన్నివేశాల్లో అతను భలేగా పెర్ఫామ్ చేశాడు. హీరోయిన్ మామిత బైజు కూడా ఆకట్టుకుంది. ప్రదీప్ తో తనకు జోడీ బాగా కుదిరింది. ఇద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకుంది. మలయాళ నటుడు హృదు హరూన్ జస్ట్ ఓకే అనిపించాడు. శరత్ కుమార్ క్యారెక్టర్.. ఆయన నటన బాగున్నాయి. రోహిణికి స్కోప్ తక్కువే కానీ.. కనిపించిన తక్కువ సన్నివేశాల్లో ఆకట్టుకుంది. హీరో ఫ్రెండుగా చేసిన నటుడు.. మిగతా ఆర్టిస్టులు మామూలే.

సాంకేతిక వర్గం:

యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ గురించి సోషల్ మీడియాలో హైప్ చూస్తే అతిగా అనిపించింది కానీ.. ‘డ్యూడ్’లో తన మ్యూజిక్ విన్నాక తన టాలెంట్ ఏంటో అర్థమవుతుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ తో సన్నివేశాలను ఎలివేట్ చేయడానికి అతను గట్టి ప్రయత్నమే చేశాడు. మామూలు సీన్లు కూడా కొన్ని చోట్ల తన స్కోర్ వల్ల బెటర్ గా అనిపించాయి. అతను అందించిన బిట్ సాంగ్స్ కూడా ఆకట్టుకుంటాయి. మ్యూజిక్ పరంగా సినిమాలో మంచి ఫ్లో కనిపిస్తుంది. నికేత్ బొమ్మి ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాతలు క్వాలిటీ చూపించారు. రైటర్ కమ్ డైరెక్టర్ కీర్తీశ్వరన్.. యూత్ కు కనెక్ట్ అయ్యే కథనే రాసుకున్నాడు. ప్రదీప్ రూపంలో అతడికి మంచి పెర్ఫామర్ దొరకడంతో బాగా వాడుకున్నాడు. కానీ కీర్తీశ్వరన్ స్క్రీన్ ప్లే మాత్రం ఎగుడుదిగుడుగా సాగుతుంది. కథలోని కొన్ని అంశాలు.. కొన్ని సీన్లు ప్రేక్షకులను ఇరిటేట్ చేస్తాయి. ఓవరాల్ గా దర్శకుడి పనితనం యావరేజ్ అనిపిస్తుంది.

రేటింగ్: 2.75/5

Tags: #AudienceReaction#CineBuzz#Dude#DudeMovie#DudeMovieRating#DudeMovieReview#DudePublicTalk#DudeRating#DudeReview#FilmUpdates#MovieBuzz#PradeepRanganathan#PublicTalk#SouthCinema#telugucinema#tollywood#TollywoodMoviesEntertainmentMoviereviewTelugureview
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

‘Telusu Kada’ movie review: ‘తెలుసు కదా’ మూవీ రివ్యూ

Next Post

Mythri Movie Makers: నలుగురి హీరోలతో వెయ్యి కోట్లు పెట్టుబడి

Related Posts

RitikaNayak
Entertainment

RitikaNayak:హాట్ క్రేజ్ 2026 మిరాయ్ 2, కొరియన్ కనకరాజుతో టాలీవుడ్‌లో టాప్ రేంజ్

VishnuPriya
Entertainment

VishnuPriya:విష్ణుప్రియ వివాదం పూర్తి వివరాలు | సోషల్ మీడియా సబ్‌స్క్రిప్షన్ కల్చర్ పై పెద్ద చర్చ

Samyuktha
Entertainment

Samyuktha:క్లాసీ లుక్‌తో అటిట్యూడ్ టచ్ – @iamsamyuktha_ స్టైల్ సోషల్ మీడియాలో వైరల్

KrithiShetty
Entertainment

KrithiShetty:LIK ప్రమోషన్స్‌లో మెరిసిన కృతి శెట్టి – సింప్లిసిటీతో ఆకట్టుకుంటున్న టాలీవుడ్ బ్యూటీ

ShehnaazGill
Entertainment

ShehnaazGill:షెహనాజ్ గిల్ గ్లామర్ షో | ముంబై ఈవెంట్ నుంచి ఇండియా 2030 కాంక్లేవ్ వరకు ట్రెండ్ సెట్టర్

#EstherAnil
Latest

EstherAnil:నటి ఎస్తేర్ అనిల్ గ్లామర్ ఫోటోషూట్ వైరల్ – స్టన్నింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్

Next Post
Mythri Movie Makers: నలుగురి హీరోలతో వెయ్యి కోట్లు పెట్టుబడి

Mythri Movie Makers: నలుగురి హీరోలతో వెయ్యి కోట్లు పెట్టుబడి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

RitikaNayak

RitikaNayak:హాట్ క్రేజ్ 2026 మిరాయ్ 2, కొరియన్ కనకరాజుతో టాలీవుడ్‌లో టాప్ రేంజ్

IPL2026

IPL2026:RCB ఘన విజయం: కోహ్లీ–పాటీదార్ మెరుపులతో లక్ష్యాన్ని ఛేదించిన బెంగళూరు

tdp

TDP:తెలుగుదేశం పార్టీ కొత్త కమిటీలు 2026: పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర స్థాయిలో భారీ మార్పులు

Delimitation2029

Delimitation2029:తెలంగాణ డీలిమిటేషన్ 2029: కొత్త లోక్‌సభ స్థానాలు, మహిళా రిజర్వేషన్లు – పూర్తి వివరాలు

Recent News

RitikaNayak

RitikaNayak:హాట్ క్రేజ్ 2026 మిరాయ్ 2, కొరియన్ కనకరాజుతో టాలీవుడ్‌లో టాప్ రేంజ్

IPL2026

IPL2026:RCB ఘన విజయం: కోహ్లీ–పాటీదార్ మెరుపులతో లక్ష్యాన్ని ఛేదించిన బెంగళూరు

tdp

TDP:తెలుగుదేశం పార్టీ కొత్త కమిటీలు 2026: పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర స్థాయిలో భారీ మార్పులు

Delimitation2029

Delimitation2029:తెలంగాణ డీలిమిటేషన్ 2029: కొత్త లోక్‌సభ స్థానాలు, మహిళా రిజర్వేషన్లు – పూర్తి వివరాలు

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info