తెలుగుదేశం పార్టీలో క్రమ శిక్షణ కట్టు తప్పుతోందని టీడీపీ అధినాయకత్వం మధన పడుతోంది పార్టీలో కీలక నేతలు పదవులల్లో ఉన్న వారు ఒకరి మీద మరొకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం మీద సీరియస్ గా ఉంది. పార్టీ ఆఫీసులో చంద్రబాబు టీడీపీలో తాజా పరిస్థితుల మీద సమీక్ష నిర్వహించారు. ఇటీవల కాలంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిల మధ్య వివాదం నేపథ్యంలో బాబు పార్టీలో జరుగుతున్న తీరు తెన్నుల మీద పార్టీ నాయకులతో చర్చించారు.
పార్టీలో ఇక మీదట ఎవరైనా కట్టు తప్పితే అసలు సహించేది లేదని చంద్రబాబు సీరియస్ గానే హెచ్చరించారు అని అంటున్నారు. ఎవరైనా పార్టీ లైన్ దాటితే అసలు సహించమని ఆయన గట్టి సందేశం పంపించారు కిలికపూడి చిన్నిలతో తాను కూడా మాట్లాడుతాను అని బాబు చెప్పుకొచ్చారు. పార్టీయే సుప్రీం అని ఆయన అన్నారు. ఎవరూ దాని కంటే అతీతులు కారని ఆయన స్పష్టం చేశారు. తాను చేయాల్సిన ప్రయత్నం చేస్తాను అని అప్పటికి కూడా పరిస్థితులు అలాగే ఉంటే కనుక గట్టి చర్యలకు సిద్ధమని బాబు సీరియస్ వార్నింగ్ నే ఇచ్చేశారు.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి విజయవాడ ఎంపీ వివాదాన్ని పార్టీ క్రమశిక్షణా కమిటీకి బాబు అప్పగించారు. వారిద్దరితో కమిటీ మాట్లాడాలని అధినాయకత్వం మనసులో ఆలోచనలు వారికి చెప్పాలని సూచించారు. ఇక ఇరువురి అభిప్రాయలను తనకు ఒక లేఖ రూపంలో ఇవాలని బాబు ఆదేశించారు. తాను లండన్ టూర్ నుంచి వచ్చిన తరువాత ఇరువురిని పిలిపించి మాట్లాడుతాను అని ఆయన చెప్పారు.
ఇదిలా ఉంటే తాను పార్టీకి వారంలో ఒక రోజు కేటాయిస్తాను అని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పినట్లుగా తెలిసింది. ఆ రోజున పార్టీ కోసమే సమయం ఇస్తామని పార్టీని మరింత పటిష్టం చేయడం కో ఆర్డినేషన్ అంతా కలసి జనంతో మమేకం అయ్యే విషయాలు అన్నీ దిశా నిర్దేశం చేస్తామని బాబు చెప్పారు అందుకే తాను ప్రతీ వారంలో ఒకరోజు మొత్తం టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే ఉండాలని బాబు నిర్ణయించుకున్నారు. పార్టీని పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేయడం కోసమే బాబు ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. అంతే కాదు పార్టీ ఎమ్మెల్యేల మీద వస్తున్న విమర్శలు వారి పనితీరు వారు నియోజకవర్గాలలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా బాబు చర్చించి సమీక్షిస్తారు అని అంటున్నారు.


















