హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్లు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సందర్భం ఏదైనా సరే తమ అందాలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా సందర్భాలకు సంబంధించి గెటప్ లు మారుస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. ఇకపోతే అక్టోబర్ లో దీపావళి వేడుకలను చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకొని.. ఆ ఫోటోలను షేర్ చేసిన సెలబ్రిటీలు.. ఆ తర్వాత కార్తీకమాసం సందర్భంగా కార్తీక దీపోత్సవం కోసం సిద్ధమవుతూ.. ఇప్పుడు ఈ ఫోటోలను షేర్ చేయడానికి సిద్ధమవుతున్నారు. మరొకవైపు అక్టోబర్ 31 హాలోవీన్ వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.
అందుకు సంబంధించి హారర్ గెటప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.. అయితే ఇలాంటి సమయంలో హాలోవీన్ సెలబ్రేషన్స్ లో భాగంగా తన గెటప్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది.. ఒకవైపు షార్ట్ డెనిమ్ డ్రెస్ ధరించిన ఈమె అందులో క్యూట్ డెవిల్ లా కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంది. డెవిల్ అంటేనే హారర్ గెటప్.. కానీ తన అందంతో అభిమానులను మెస్మరైజ్ చేసింది డింపుల్ హయతి. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. క్యూట్గా కనిపిస్తూనే భయపెట్టేసింది ఈ ముద్దుగుమ్మ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
డింపుల్ హాయతి విషయానికి వస్తే.. 2017లో గల్ఫ్ అనే సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టింది. 1988 ఆగస్టు 21న తెలంగాణ రాజధాని హైదరాబాదులో జన్మించిన ఈమె.. సినీరంగంలోకి అడుగుపెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక 2019లో వచ్చిన యురేకా అనే సినిమాలో నటించిన ఈమె.. అలాగే మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో జర్రా జర్రా పాటలో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో మెప్పించింది. 2022లో ఫిబ్రవరి 11న విడుదలైన ఖిలాడీ సినిమాలో కూడా నటించి తన స్పెషల్ పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
ఇప్పటివరకు ఈమె నటించిన సినిమాల విషయానికొస్తే.. గల్ఫ్ ,యురేకా వంటి తెలుగు చిత్రాలతో కెరియర్ ఆరంభించిన ఈమె.. దేవి 2 అనే తమిళ్ చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఆ తర్వాత అభినేత్రి 2, గద్దలకొండ గణేష్ చిత్రాలలో స్పెషల్ సాంగ్ లతో కూడా ఆకట్టుకున్న ఈమె 2021 లో ఆత్రంగీ రే అనే హిందీ సినిమాలో కూడా నటించింది.. సామాన్యుడు చిత్రంలో కూడా నటించిన ఈమె 2023లో వచ్చిన రామబాణం అనే సినిమాలో భైరవి పాత్ర పోషించి మెప్పించింది. ఇకపోతే అప్పటినుంచి మరో సినిమాలో నటించలేదు డింపుల్ హయతి. కానీ ఇప్పుడు భోగి అనే తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే 2025 అక్టోబర్ 24న దిల్మార్ అనే కన్నడ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది. శర్వానంద్ 38వ సినిమాలో కూడా డింపుల్ హయతి భాగమైన విషయం తెలిసిందే.


















