“నవ తెలంగాణ” దినపత్రిక 10 వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినిరంతరం ప్రజల పక్షాన నిలబడి పనిచేసే పత్రికా సంస్థలు కొన్ని మాత్రమే ఉంటాయి అందులో నవ తెలంగాణ పత్రిక ఒకటి
ప్రస్తుతం పత్రికా సంస్థలు తమ విశ్వసనీయతని కోల్పోయే పరిస్థితి తలెత్తుతోంది స్వాతంత్ర్య పోరాటంలో దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు పత్రికలు ఉపయోగపడ్డాయి నాటి సాయుధ రైతాంగ పోరాటంలో, సామాజిక రుగ్మతలపై ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేందుకు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికలు ఉపయోగపడ్డాయి ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ.. పాలకులు ఎవరైనా ప్రజల పక్షం నిలుస్తున్న పత్రిక నవ తెలంగాణ. గతంలో తమ భావజాలాన్ని ప్రజలకు వివరించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు పత్రికలను నడిపేవి కానీ ఈ రోజుల్లో రాజకీయ పార్టీల పత్రికలు వింత పోకడతో వ్యవహరిస్తున్నాయి
తమ సంపాదనను కాపాడుకోవడానికి, తప్పులను కప్పి పుచ్చుకునేందుకు కొన్ని రాజకీయ పత్రికలు పనిచేస్తున్నాయి దీంతో జర్నలిస్టు అనే పదానికి అర్థం లేకుండా పోతోంది జర్నలిజం ముసుగులో ఉన్న కొన్ని రాజకీయ పార్టీల పత్రికల తీరును ప్రజలు నిశితంగా గమనించాలి జర్నలిజంలో ఓనమాలు తెలియనివారు కొంతమంది జర్నలిస్టు ముసుగు వేసుకుని సోషల్ మీడియా పేరుతో తిరుగుతున్నారు.నిజమైన జర్నలిస్టులు సెమినార్లు నిర్వహించి జర్నలిస్ట్ పదానికి డెఫినేషన్ నిర్వచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో మేం ప్రెస్ మీట్ లు నిర్వహించినప్పుడు సబ్జెక్టుపై జర్నలిస్టులతో వివరాలు తీసుకునే వాళ్లం
కానీ ఇవాళ వింత పోకడలు వచ్చాయి.. ఈ వింత పోకడలకు రాజకీయ పార్టీలు తోడయ్యాయి ఈ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయి రాజకీయ నాయకుల విశ్వసనీయతలాగే జర్నలిస్టుల విశ్వసనీయత కూడా వేగంగా సన్నగిల్లుతోంది అందుకే నిజమైన జర్నలిస్టులు దీనికి ఒక లక్ష్మణ రేఖ గీయాల్సిన పరిస్థితి ఏర్పడింది
నిజమైన జర్నలిస్టులు, జర్నలిస్టుల ముసుగు తొడుక్కున్న వారిని మీరే వేరు చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే దేశ భద్రతకే ప్రమాదకరంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది కమ్యూనిస్టులు ఉప్పు లాంటి వారు.. ఉప్పు లేని వంట రుచి ఉండదు…అలాగే ప్రజా సమస్యలపై పోరాటంలో ఎర్రజెండా కనిపించిన్నప్పుడే ఆ సమస్యల పరిష్కారం జరుగుతుంది ప్రభుత్వ ప్రకటనల్లో నవ తెలంగాణకు సమాన ప్రాధాన్యతనిస్తాం ఆనాడైనా.. ఈ నాడైనా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టుల సహకారం ఎంతో ఉంది. భవిష్యత్ లో కాంగ్రెస్- కమ్యూనిస్టుల మధ్య సహకారం ఇలాగే కొనసాగాలి కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పని చేస్తే ప్రజలకు మరింత ప్రయోజనం ఉంటుంది.