పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుండి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు నా దృష్టికి తీసుకొచ్చారు. వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించాం.
స్కూళ్లకు దసరా సెలవుల తేదీల్లో మార్పు చోటు చేసుకుంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22వ తేదీ నుంచి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని తన దృష్టికి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి సెలవులపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీని ప్రకారం.. దసరా పండుగకు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో దసరా పండుగకు 12 రోజులు రానున్నాయి.
కాగా, అంతకు ముందు స్కూళ్లకు దసరా పండుగ సెలవులను సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు మొత్తం 9 రోజులు ప్రకటించారు. అయితే, దీనిపై పునరాలోచించాలని ఉపాధ్యాయులు ప్రభుత్వా్నికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి.. మరో 3 రోజులు పెంచుతూ 9 రోజుల సెలవులను కాస్తా 12 రోజులుగా ప్రకటించింది.