ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

CP RadhaKrishnan: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహరాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్

CP RadhaKrishnan: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహరాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్
ADVERTISEMENT

రానున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఎన్‌డీఏ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పేరు ప్రకటించారు. ప్రస్తుతం రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు.ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా ఆదివారం దిల్లీలో జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ప్రకటించారు.ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశంలో రాధాకృష్ణన్ పేరును ఏకగ్రీవంగా ఆమోదించారని చెప్పారు.చంద్రాపురం పోన్నుస్వామి రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుప్పూర్‌లో 1957 అక్టోబర్ 20న జన్మించారు. ఆయన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఆరెస్సెస్ స్వయంసేవకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. 1974లో భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడయ్యారు.

భారతీయ జనతా పార్టీ తమిళనాడు శాఖ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.దక్షిణ భారతదేశంలో బీజేపీ ఎదుగుదలలో రాధాకృష్ణన్ కీలక పాత్ర పోషించారు.ఆయన తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి రెండుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 1998, 1999లో ఇక్కడ విజయం సాధించారు.ఆ తర్వాత 2004, 2014, 2019లో వరుసగా మూడుసార్లు ఓడిపోయారు.2023 ఫిబ్రవరిలో ఝార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత 2024 జూలైలో మహారాష్ట్ర గవర్నర్‌గానూ బాధ్యతలు చేపట్టారు.రాధాకృష్ణన్ తన రాజకీయ జీవితాన్ని విద్యార్థి ఉద్యమంతో ప్రారంభించారు. 2007లో తమిళనాడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 93 రోజుల్లో రాష్ట్రంలో 19 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.

ఈ ప్రయాణంలో ప్రధానంగా నదుల అనుసంధానం, ఉగ్రవాదం, ఉమ్మడి పౌరస్మృతి, అంటరానితనం, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు వంటి అంశాలపై దృష్టి సారించారు.ఆ తర్వాత కూడా ఆనకట్టలు, నదుల సమస్యపై 280 కిలోమీటర్లు, 230 కిలోమీటర్ల చొప్పున రెండుసార్లు పాదయాత్రలు చేశారు.జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాతో చేయడంతో.. దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక తప్పనిసరి అయ్యింది. వచ్చే నెల అనగా సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. ఆగస్టు 21తో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈక్రమంలో ఎన్‌డీఏ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం బీజేపీ పార్లమెంటరీ కమిటీ ఆదివారం నాడు ఢిల్లీలో సమావేశం అయ్యింది. అయితే అనూహ్యంగా.. ఎవరూ ఊహించని రీతిలో ఆ రాష్ట్ర గవర్నర్‌ని ఉపరాష్ట్రపతి క్యాండెట్‌గా ఎంపిక చేసింది.

ఎన్డీఏ తరఫున వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ఎంపియ్యారు. బీజేపీ పార్లమెంటరీ కమిటీ ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకుంది. ఆదివారం నాడు ఈ ఎంపిక ప్రక్రియ జరిగింది. సీపీ రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా పని చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు సంబంధించి గతంలో ఆయన పేరు ఎక్కడా వినిపించలేదు. అలాంటిది ఎన్‌డీఏ అనూహ్యంగా ఆయనకు అవకాశ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలో కూడ ఎన్డీఏ కూటమికి సరిపడా బలం ఉండటంతో ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఎన్నిక లాంఛనం కానుంది. వచ్చేనెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనున్నారు.

2024 ఆగస్టు 1న సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు ఆయన ఏడాదిన్నరపాటు జార్ఖండ్ గవర్నర్‌గా వ్యవహరించారు. కొద్ది కాలంపాటు తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌గానూ ఆయన అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 1957 మే 4న తమిళనాడులో జన్మించిన రాధాకృష్ణన్ బీఏ చదివారు. ఆరెస్సెస్ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. 1974లో భారతీయ జనసంఘ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు అయ్యారు. 1996లో బీజేపీ తమిళనాడు విభాగం కార్యదర్శిగా నియమితులయ్యారు. 1998లో కోయంబత్తూరు నుంచి లోక్ సభకు ఎన్నికైన ఆయన.. 1999లో మరోసారి ఎన్నికయ్యారు.

2004లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో రాధాకృష్ణన్ ప్రసంగించారు. తైవాన్‌కు వెళ్లిన తొలి పార్లమెంటరీ బృందంలో ఆయన ఒకరు. 2004 నుంచి 2007 వరకు రాధాకృష్ణన్ తమిళనాడు బీజేపీ చీఫ్‌గా వ్యవహరించారు. ఆ సమయంలోనే ఆయన 19 వేల కి.మీ. రథ యాత్ర చేపట్టి.. దేశంలోని నదుల అనుసంధానం, ఉగ్రవాద నిర్మూలన, యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయడం, అంటరానితనాన్ని అరికట్టడం, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాటంలాంటి డిమాండ్లను ఆయన హైలెట్ చేశారు.

వచ్చే ఏడాది ఆరంభంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో.. బీజేపీ ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకుడిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం గమనార్హం. తమిళనాడులో ఎలాగైనా బలమైన శక్తిగా ఎదగాలని బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే.

Tags: #bjp#BreakingNews#CPRadhakrishnan#IndianDemocracy#IndiaPolitics#JPNadda#MaharashtraGovernor#NationalNews#NDA#NDAAnnouncesCandidate#ParliamentNews#PMModi#PoliticalUpdates#VicePresidentElection#VicePresidentPolls
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Ketika Sharma: క్లీ వేజ్‌ షో

Next Post

Puri Jagannadh: అసలేం జరుగుతోంది?

Related Posts

BRS
Big Story

BRS:తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు 2026 – 17 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్

GiftOfLife
Big Story

GiftOfLife:అవయవదానం చేసి పలువురు చిన్నారులకు పునర్జన్మ ఇచ్చిన 10 నెలల షెరిన్ అబ్రహం

BillGates
Andhra Pradesh

BillGates:ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ అభివృద్ధి – సీఎం చంద్రబాబు నాయకత్వంపై బిల్ గేట్స్ ప్రశంసలు

BillGates
Andhra Pradesh

BillGates:ఆంధ్రప్రదేశ్ పర్యటనకు బిల్ గేట్స్ – సంజీవని ప్రాజెక్టు సందర్శన, రైతులతో సమావేశం

JDLakshminarayana
Big Story

JDLakshminarayana:సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణకు కొత్త బాధ్యతలు – మేఘా గ్రూపులో వైస్ ప్రెసిడెంట్‌గా చేరిక

T20WorldCup
Big Story

T20WorldCup:పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం – 61 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు

Next Post
Puri Jagannadh: అసలేం జరుగుతోంది?

Puri Jagannadh: అసలేం జరుగుతోంది?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

BRS

BRS:తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు 2026 – 17 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్

GiftOfLife

GiftOfLife:అవయవదానం చేసి పలువురు చిన్నారులకు పునర్జన్మ ఇచ్చిన 10 నెలల షెరిన్ అబ్రహం

BillGates

BillGates:ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ అభివృద్ధి – సీఎం చంద్రబాబు నాయకత్వంపై బిల్ గేట్స్ ప్రశంసలు

BillGates

BillGates:ఆంధ్రప్రదేశ్ పర్యటనకు బిల్ గేట్స్ – సంజీవని ప్రాజెక్టు సందర్శన, రైతులతో సమావేశం

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info