ఢిల్లీలో జరిగిన పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) 12వ వార్షిక సదస్సులో సీఎం రేవంత్ కీలక ప్రసంగం చేశారు. దేశంలోనే కొత్త రాష్ట్రమైనప్పటికీ.. తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్‌కు ఘనమైన చరిత్ర ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ విజన్ డాక్యుమెంట్ ద్వారా కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విభజించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు.
తెలంగాణలో సమగ్ర అభివృద్ధి సాధించే లక్ష్యంతో ‘తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047’ రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పాలనలో రాజకీయ సంకల్పం ఎంతో అవసరమని, భవిష్యత్ తరాలకు అవకాశాలను కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) 12వ వార్షిక సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేశారు. దేశంలోనే కొత్త రాష్ట్రమైనప్పటికీ.. తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్‌కు ఘనమైన చరిత్ర ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ విజన్ డాక్యుమెంట్ ద్వారా కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విభజించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. ఈ ప్రణాళికలు తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలుపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
విజన్ డాక్యుమెంట్ విడుదల:
– డిసెంబర్ 9, 2025న తెలంగాణ విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
అభివృద్ధి ప్రణాళికలు:
– పారిశ్రామిక అభివృద్ధి: కోర్ అర్బన్ ఏరియాలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను నగరానికి వెలుపలికి తరలిస్తున్నామని తెలిపారు. సెమీ అర్బన్ ఏరియాను తయారీ రంగం (మ్యానుఫ్యాక్చరింగ్) జోన్‌గా నిర్ణయించామని, ఇక్కడ భారీ పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చెప్పారు.
– పట్టణాభివృద్ధి: ప్రస్తుతం 70 కిలోమీటర్లు ఉన్న మెట్రో రైలు మార్గాన్ని 150 కిలోమీటర్లకు పొడిగించాలని నిర్ణయించామన్నారు. రోజుకు 5 లక్షల మంది ప్రయాణికులను 15 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సబర్మతి తీరం మాదిరిగా మూసీ నదిని పునరుద్ధరిస్తామని, ఇందుకోసం ‘మూసీ పునరుజ్జీవం’పై దృష్టి పెట్టామని చెప్పారు. హైదరాబాద్‌లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.
– హైటెక్ సిటీని నిర్మిస్తున్న సమయంలో చాలామంది అవహేళన చేశారని, కానీ ప్రస్తుతం హైదరాబాద్ నగరం సింగపూర్, టోక్యో నగరాలతో పోటీ పడుతోందని తెలిపారు. మన వద్ద అన్ని ఉన్నప్పుడు చిత్తశుద్ధితో పనిచేయడం చాలా అవసరమని అన్నారు. గూగుల్ వంటి దిగ్గజ సంస్థల్లో తెలుగువారు ఉన్నారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ చొరవతోనే ఐటీ రంగంలో చాలామంది రాణిస్తున్నారని వ్యాఖ్యానించారు. అమెరికాలో మన ఐటీ నిపుణులు పనిచేయడం ఆపేస్తే ఆ దేశం స్తంభించిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మన ప్రాంతం విద్యార్థులు ఇక్కడే చదువుకోవాలని నాటి ముఖ్యమంత్రులు పలు విద్యాసంస్థలను నిర్మించారని, ఇప్పుడు మనం హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడుతుంటే కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, వారిని ప్రజలే అడ్డుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. మూసీ నది ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణం కొంతమందికి ఇష్టం లేదని ఆయన అన్నారు.
తెలంగాణ సమగ్ర అభివృద్ధికి 2047 ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మూసీ నది ప్రక్షాళనతో పాత నగరానికి పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. మూసీ ప్రక్షాళనను ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. అన్ని సౌకర్యాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తామని అన్నారు. నగర అభివృద్ధికి అడ్డుపడేవారు ఎవరైనా మనకు శత్రువులేనని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలతో కూడిన ఉద్యోగ భద్రతను ఇచ్చామని తెలిపారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన జరగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.