కూటమి ప్రభుత్వం ప్రారంభించిన సుపరిపాలనలో తొలి అడుగు అంటూ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలను ప్రారంభించారు కూటమి నేతలు. దీంతో కూటమి ఎమ్మెల్యేలు గ్రామాలలో తిరిగి ప్రభుత్వం గురించి పాజిటివ్గా ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. కానీ ఈ కార్యక్రమంలో వారు వ్యవహరిస్తున్న తీరు చెబుతున్న మాటలను సైతం గమనిస్తే గతంలో జగన్ గడపగడపకు వైసిపి కార్యక్రమం నిర్వహించినటువంటి తంతే ఇప్పుడు గుర్తుకు వస్తున్నట్లు కనిపిస్తోందట ప్రజలకు. అప్పట్లో తమ పార్టీ నాయకులు అందరినీ కూడా ఇంటింటికి తిప్పి వైసిపి ప్రభుత్వం గురించి జగన్ గురించి ఎక్కువగా చెప్పించారు.ఇప్పుడు కూడా అటు కూటమి ప్రభుత్వం గురించి సీఎం చంద్రబాబు గురించి భజన చేస్తున్నారట. అప్పట్లో వైసీపీ పార్టీని ముంచింది ఇది అని.. ఈ వాస్తవాన్ని ఇప్పటి కూటమి ప్రభుత్వం గుర్తించకపోతే చాలా కష్టం అంటూ పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి సుపరిపాలనలో తొలి అడుగు అనే అంశం సీఎం చంద్రబాబుకి తాకిన ఒక అద్భుతమైన కాపీ పేస్ట్ కార్యక్రమం. గతంలో జగన్ చేపట్టిన గడపగడపకు వైసిపి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని అమలు చేశారు. అప్పట్లో ఆ కార్యక్రమం వారికి బాధ్యతతో కూడిన కార్యక్రమంగా భావించారు.
ఎన్నికలలో కనిపించిన నాయకులు గెలిచిన తర్వాత మళ్ళీ ఐదేళ్లపాటు ప్రజల వద్దకు ఎందుకు రావడం లేదు అనే వాటికి రీసన్ గానే ఇలా జగన్ ప్రతి ఇంటికి ప్రతి ఎమ్మెల్యేలు వెళ్లి తీరాలి అంటూ కార్యక్రమాలను చేపట్టారు. ఎలా ఎన్నోసార్లు సమీక్షలు కూడా నిర్వహించారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు సైతం తిరుగుతున్నారో లేదో అని ఎప్పటికప్పుడు నివేదికలను కూడా తెచ్చుకునే వారట జగన్ వ్యక్తిగతంగా కూడా కొన్ని సందర్భాలలో వారిని హెచ్చరించారట.ఇప్పుడు మళ్లీ ఇదే కార్యక్రమాన్ని కాఫీ చేసి ఒకటో ఏడాది పూర్తికాగానే సుపరిపాలనలో మొదటి అడుగు అనే పేరుతో చంద్రబాబు అమలు చేశారు. అయితే ఇది చంద్రబాబును మాత్రమే పొగిడించుకోవాలని చేసినట్లుగా ఉందంట పలువురు నేతలు కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో జగన్ గడపగడపకు వైసీపీ కార్యక్రమాల గురించి జగన్మోహన్ రెడ్డి గురించి ఎక్కువ భజన చేశారు. ఇప్పుడు కూటమి నేతలు కూడా అలాంటి పని చంద్రబాబు గురించి చేస్తున్నట్లు కనిపిస్తోందట. మరి ఇకనైనా ఇలాంటి విషయాలను జాగ్రత్తగా తీసుకుంటారేమో చూడాలి.