గాలి జనార్దన్‌రెడ్డిపై కాల్పుల కలకలం
బళ్లారి జిల్లాలో చోటుచేసుకున్న కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రముఖ గనుల వ్యాపారి, రాజకీయ నేత గాలి జనార్దన్‌రెడ్డి లక్ష్యంగా ఈ ఘటన జరిగినట్టు సమాచారం. అయితే ఆయన ఈ కాల్పుల నుంచి స్వల్ప తేడాతో తప్పించుకున్నారు.బళ్లారిలో ఎమ్మెల్యే భరత్‌రెడ్డి సన్నిహితుడిపై కాల్పులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో గన్‌మన్ తుపాకీని లాక్కుని సతీష్‌రెడ్డి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. మొత్తం 8 రౌండ్లు కాల్పులు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది.
ఇరువర్గాల మధ్య పరస్పర కాల్పులు చోటుచేసుకోగా, ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్టు అధికారులు ధృవీకరించారు. కాల్పులు జరిపిన సతీష్‌రెడ్డికి కూడా గాయాలు కావడంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
ఈ కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేశారు.
శ్రీరాములు, సోమశేఖర్‌రెడ్డి సహా మొత్తం 11 మందిపై కేసులు నమోదు చేశారు. కేసులు నమోదైన వారిలో మోత్కార్ శ్రీనివాస్, ప్రకాష్‌రెడ్డి, రాముడు, పలన్న, దివాకర్, మారుతిప్రసాద్, దమ్మూర్ శేఖర్, అలీఖాన్‌లు ఉన్నారు.ఘటనకు దారితీసిన కారణాలపై పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. వ్యక్తిగత విభేదాలా? రాజకీయ వైరం నేపథ్యమా? అనే కోణాల్లో విచారణ సాగుతోంది. బళ్లారిలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు. మరిన్ని వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
Bellary











