ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ‘CBN’: పెట్టుబడులకు చిరునామాగా ఏపీ, యువతకు ఉపాధి లక్ష్యంగా చంద్రబాబు విజన్
ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన బ్రాండ్ ఒక్కటే… అది N. Chandrababu Naidu. ఈ రోజు Google, TCS, Cognizant వంటి అగ్రగామి సంస్థలు ఏపీలో పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయంటే, దానికి ప్రధాన కారణం చంద్రబాబు గారి విశ్వసనీయత, దూరదృష్టి, అంతర్జాతీయ స్థాయి నాయకత్వమే అని పారిశ్రామిక వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి.
అయితే మరోవైపు, ఏపీలో పెట్టుబడులు రాకుండా అడ్డుకునే ఒక “ఏడుపుగొట్టు టీమ్” ఉందన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పారిశ్రామికవేత్తలను కలిస్తే ఏడుపు, కంపెనీలు వస్తే క్రెడిట్ చోరీ అంటూ ఆరోపణలు… ఇలా ప్రతీ అభివృద్ధి ప్రయత్నాన్ని అడ్డుకోవడమే ఆ టీమ్ లక్ష్యంగా కనిపిస్తోంది. కానీ పెట్టుబడులు తేవడంలో చంద్రబాబు గారి పాత్రను తగ్గించేందుకు చేసే ఈ ప్రయత్నాలు ప్రజల్లో పెద్దగా నమ్మకం పొందడం లేదన్నది వాస్తవం.
దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్థిక సమావేశాల్లో చంద్రబాబు గారి పాత్ర ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. గత ఏడాది దావోస్‌లో జరిగిన భేటీల ఫలితంగా ఏపీకి వచ్చిన పెట్టుబడుల్లో 20 ప్రాజెక్టులకు సంబంధించి రూ.2.36 లక్షల కోట్ల పెట్టుబడులకు SIPB ఆమోదం లభించింది. ఇందులో గూగుల్ క్లౌడ్, కాగ్నిజెంట్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఉండటం విశేషం. ఈ విజయాలకే గుర్తింపుగా Kishore Lulla చంద్రబాబు గారిని “దావోస్ మ్యాన్” అంటూ ప్రశంసించారు.
దావోస్‌కు ఎందుకు వెళ్లలేదంటే “చలిగా ఉంది” అని చెప్పిన నాటి కోడిగుడ్డు మంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వ్యంగ్యంగా మారాయి. ఎంత చలిగా ఉన్నా, ఎంత వేడిగా ఉన్నా… తెలుగు ప్రజల కోసం, యువత భవిష్యత్తు కోసం కష్టపడే వ్యక్తి చంద్రబాబు గారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా డిజిటల్ మీడియా, వర్చువల్ ప్రొడక్షన్, గేమింగ్, యానిమేషన్, ఫిల్మ్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని చంద్రబాబు గారు Eros International చైర్మన్‌తో సమావేశంలో స్పష్టం చేశారు. ఇది ఏపీని కేవలం ఐటీ హబ్‌గా కాకుండా క్రియేటివ్ & డిజిటల్ ఎకానమీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగు.
అనంతరం భారత రాయబారి Mridul Kumar తో సమావేశమై ఫార్మా, వైద్య పరికరాలు, మిషనరీ తయారీ, హార్డ్‌వేర్–ఎలక్ట్రానిక్స్, రైల్ కంపోనెంట్స్, టెక్నికల్ టెక్స్‌టైల్స్, ఆర్‌అండ్‌డీ కేంద్రాల వంటి రంగాల్లో సహకారం కోరారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీలు, పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన నిర్ణయాలను ఆయనకు వివరించారు.
ఇక రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh జ్యూరిచ్‌లో Buhler Group ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సలహాదారు & ఇండియా ఛైర్మన్ Deepak Mane తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో బ్యూలర్ ఫుడ్స్ & గ్రెయిన్ టెక్నాలజీ అప్లికేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని, పైలట్ ట్రయల్స్, ప్రొడక్ట్ లోకలైజేషన్ ద్వారా అగ్రి ఎక్స్‌పోర్ట్ క్లస్టర్లకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని దీపక్ మానే హామీ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మొత్తానికి, చంద్రబాబు గారి నాయకత్వంలో ఏపీ పెట్టుబడులకు, ఉపాధి అవకాశాలకు, అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారుతోంది. విమర్శలు ఎంత ఉన్నా, ఫలితాలే అసలైన సమాధానం అని ఈ పెట్టుబడి ఒప్పందాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.
NaraLokesh







