ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

 AP : వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదా.. అసెంబ్లీ స్పీకర్ అయన్నపాత్రుడు ఎమన్నారంటే?

AP Assembly :ఫిబ్రవరి 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు
ADVERTISEMENT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌ను ఉద్దేశించి ఏపీ శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారంలో ఉంది.

11మంది సభ్యులతో ఏకైక విపక్షంగా ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ కొన్నాళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ మేరకు 2024 జూన్‌ 24న శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడుకు లేఖ రాశారు.

ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ ఆయన తన పార్టీ సభ్యులు సహా అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరువుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదా అంశంపై కీలకప్రకటన చేశారు. ప్రతిపక్ష హోదాపై వైఎస్ జగన్ హైకోర్టుకు వెళ్లారని.. ప్రతిపక్ష నాయకుడిలా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారని తెలిపారు. జగన్ పిటిషన్ తీసుకోవాలా వద్దా అనే దశలో ఉందని.. ఏమీ తేలకముందే ప్రతిపక్ష హోదాపై జగన్‌ అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. హైకోర్టు స్పీకర్ కు నోటీసులు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం జరిగిందని.. ఇవన్నీ తెలిసి కూడా జగన్‌ చేసిన వ్యాఖ్యలను క్షమించి వదిలేస్తున్నాను అన్నారు.

తనకు అభియోగాలు, బెదిరింపులతో జగన్‌ నాకు గతేడాది జూన్‌లో లేఖ రాసినట్లు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ జగన్ బెదిరించారని.. ఒకవేళ ఆయన కావాలనుకుంటే కోర్టుకు వెళ్లొచ్చని సూచించారు. సభలో పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తామన్న విషయాన్ని జగన్ గమనించాలన్నారు. లోక్ సభలో టీడీపీ నేత ఉపేంద్రకు ప్రతిపక్ష హోదా అప్పట్లో ఇవ్వలేదని.. అది వాస్తవం కాదన్నారు. ఉపేంద్రను కేవలం టీడీపీ గ్రూప్‌కు మాత్రమే నాయకుడిగా ప్రకటించారన్నారు. పద్దెనిమిది సీట్లు లేకుండా తాను చేసి చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయగలగనని జగన్ వ్యాఖ్యలు చేశారన్నారు. ఈ మేరకు స్పీకర్ ఒక ప్రకటనను విడుదల చేశారు.

‘ఈ 16వ శాసన సభలో సభ్యులైన వైఎస్ జగన్మోహన రెడ్డి 24.6.2024 తేదీన నాకు ఒక లేఖ రాశారు. ఆ లేఖ అంతా అభియోగాలు. ప్రేలాపనలు. బెదిరింపుల మయం. దానికి తోడు, తనకు ప్రతిపక్ష నాయకుడి హోదాకు అర్హత ఉందంటూ అసంబద్ధ వాదనలు. కానీ ఆ లేఖలో ఎలాంటి ప్రత్యేక అభ్యర్థన లేదన్న విషయం గమనించాలి. ఆ లేఖ రాసిన కొద్దిరోజుల తరువాత వైఎస్ జగన్ ఆంధ్ర ప్రదేశ్‌ హై కోర్టుని ఆశ్రయించారు. విచిత్రం ఏమిటంటే, తనను ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించ వలసిందిగా. శాసన సభ కార్యదర్శిని, స్పీకర్‌ కార్యదర్శిని ఆదేశించాలని ఆయన రిట్‌ పిటిషన్‌ లో విజ్జప్తి చేశారు’ అంటూ ప్రకటనలో ప్రస్తావించారు.

వైఎస్ జగన్ పిటిషన్‌, ఇంకా విచారణకు అర్హత కలిగి ఉన్నదో, లేదో అని నిర్ధారించే దశలోనే ఉంది. ఆ పిటిషన్‌ లో వై.యస్‌. జగన్మోహన రెడ్డి, స్పీకర్‌ ను, శాసన వ్యవహారాల మంత్రిని ప్రతి వాదులుగా చేర్చినప్పటికీ. ఆ ఇద్దరినీ మినహాయించాలని గౌరవ అడ్వకేట్‌ జనరల్‌ గారు చేసిన సూచనతో గౌరవ కోర్టు ఏకీభవించింది. ఈ న్యాయ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చే వరకు వేచి చూద్దాం అనుకున్నాను. కానీ ఇటీవలి కాలంలో ఈ అంశంపై వైఎస్ జగన్, ఇంకా వారి పార్టీ నాయకులు చేస్తున్న పలు వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. గౌరవ హైకోర్టు, స్పీకర్‌ కు ‘సమన్లు’ జారీ చేసిందని, “ఉత్తర్వులు జారీ చేయాలని స్పీకర్‌ ను ఆదేశించిందని” జగన్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. నిజానికి, ఈ నాటి వరకు, హైకోర్టులో జగన్ వేసిన పిటిషన్‌ కు విచారణకు అర్హత ఉందో, లేదో ఇంకా నిర్ధారణే కాలేదు’ అన్నారు.

వైఎస్ జగన్ ఈ రకమైన తప్పుడు ప్రచారం చేయడంలో ఆశ్చర్య పడవలసింది ఏమీ లేదు. 24.6.2024 తేదీ లేఖలో చేసిన నిరాధార ఆరోపణల ఆధారంగానే ఈ తప్పుడు ప్రచారం కొనసాగించారు. కాకపోే ఈ దఫా ఆయన తన కల్పిత వాదనలను, ఆకాంక్షలను గౌరవ న్యాయస్థానానికి ఆపాదించడానికి సైతం వెనుకాడలేదు. దురదృష్ట వశాత్తు అదే ఆయన సహజ శైలి. జగన్, గౌరవ న్యాయ స్థానానికి ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్న అవాకులు, చెవాకులు, అసత్యాలు, గందర గోళానికి దారి తీస్తున్నాయి కనుక ఈ రూలింగు ద్వారా తప్పుడు ప్రచారానికి తెర దించాలని నిర్ణయించుకున్నాను’ అన్నారు.

వైఎస్ జగన్ లేఖలో చేసిన ఆరోపణలకు భిన్నంగా 21.6.2024 తేదీ నాడు ఆంధ్ర ప్రదేశ్‌ శాసన సభలో, ప్రమాణ స్వీకార కార్యక్రమం చిరకాల సాంప్రదాయాలను అనుసరించే నిర్వహించారు. వైఎస్ జగన్‌ని మాజీ ముఖ్య మంత్రి హోదాలో ప్రస్తుత మంత్రుల తర్వాత శాసన సభ్యునిగా ప్రమాణం చేయడానికి ఆహ్వానించారు. గతంలో 11.1.1995 నాడు. అప్పటి ఆంధ్ర ప్రదేశ్‌ శాసన సభలో కూడా అప్పటి మాజీ ముఖ్యమంత్రిని మంత్రుల తరువాతే ప్రమాణం చేయడానికి ఆహ్వానించారు’ అని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్‌ 16వ శాసన సభలో సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం 21.6.2024న జరిగింది. కాగా స్పీకర్‌ ఎన్నిక మరునాడు అంటే 22.6.2024 నాడు జరిగింది. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వగలిగే అధికారం కేవలం స్పీకర్‌‌కు మాత్రమే ఉంటుంది. అందుకే. సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం వైఎస్ జగన్‌కి ప్రతిపక్ష హోదా నిరాకరించడానికి సూచిక అన్న వాదన సరికాదు’ అన్నారు.

నిజానికి వైఎస్ జగన్ వైఎస్సార్‌సీపీ శాసన సభా పక్ష నాయకుడిగా ఎన్నికైనట్టు 26.6.2024 వరకు మా సచివాలయానికి తెలపనేలేదు. అలాంటప్పుడు, జూన్‌ 26 కంటే ముందే, అందునా స్పీకర్‌ ఎన్నిక జరక్కముందే ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి నిర్ణయం తీసుకోవడం సాధ్యమా?. ప్రతిపక్ష నాయకుని హోదాకు ఎవరైనా అర్హులా, కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు, కోర్టు తీర్పులు, చిరకాల సాంప్రదాయాల ఆధారంగా మాత్రమే నిర్ధారించగలరు. ఆంధ్ర ప్రదేశ్‌ వేతనాలు, పింఛనుల చెల్లింపు. అనర్హతల తొలగింపు చట్టం, 1953 లో, ప్రతిపక్ష నాయకుడి హోదా ప్రస్తావన ఉంది. ఆ చట్టంలో సెక్షన్‌ – 12 బీ ప్రకారం వారు చట్ట సభలో సభ్యులై ఉండాలి. వారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీకి సభలో నాయకుడై ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీల్లో వారి పార్టీకి అత్యధిక సంఖ్యా బలం ఉండాలి. మరీ ముఖ్యంగా ఆ వ్యక్తిని సభాపతి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి’అన్నారు.

ఒక వేళ అత్యధిక సంఖ్యాబలం కల ప్రతి పక్షాలు ఒకటి కన్నా ఎక్కువ ఉంటే. పార్టీల హోదాను దృష్టిలో ఉంచుకొని, వాటిలో ఏదో ఒక పార్టీ నాయకుడికి సభాపతి ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించ వచ్చు. ఈ విషయంలో సభాపతి నిర్ణయానికి తిరుగుండదని సెక్షన్‌ – 12 బి చెపుతోంది. పైన పేర్కొన్న చట్టం ప్రకారం. సభాపతులకు ఈ విషయంలో అవధుల్లేని అధికారాలు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పార్లమెంటులోనూ, రాష్ట్రాల చట్టసభల్లోనూ సభాపతులు ఈ అధికారాల వాడకంలో, లోక్‌ సభ మొదటి స్పీకర్‌ జీవీ మావలంకర్‌ ఇచ్చిన డైరెక్షన్‌ ప్రకారం నడుచుకుంటున్నారు. లోక్‌ సభ డైరెక్షన్‌ 121 ఇలా చెపుతుంది. పార్లమెంటరీ పార్టీ లేదా గ్రూపును గుర్తించేటప్పుడు స్పీకర్‌ కొన్ని సూత్రాలను పాటించాలి. సభ సమావేశం కావడానికి అవసరమైన కోరంకు కనీసం సరి
సమానంగా అంటే సభలో మొత్తం సభ్యుల్లో పదింట ఒక వంతు సంఖ్యా బలం తప్పక కలిగి ఉండాలి’ అన్నారు స్పీకర్.

Tags: #AndhraPradesh#APAssembly#ysjagan
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

రామానాయుడు విశ్రాంతి తీసుకునేలా రూలింగ్ ఇవ్వండి మంత్రి నిమ్మలపై లోకేష్ ఆప్యాయత

Next Post

 Donald Trump: టారిఫ్‌ల అమలుపై తగ్గేదేలే..!

Related Posts

Pink Power Run 3.0
Big Story

Pink Power Run 3.0: హైదరాబాద్‌లో ఘనంగా పింక్ పవర్ రన్.. వేలాదిగా పాల్గొన్న రన్నర్లు

AndhraPolitics
Andhra Pradesh

AndhraPolitics:విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్-సీపీఐ భేటీపై కొత్త చర్చ

#ManmohanSinghStatue, #ManmohanSingh, #ManmohanSinghNews, #RevanthReddy, #RevanthReddyNews, #Hyderabad, #Gachibowli, #WiproCircle, #Telangana, #TelanganaNews, #FormerPrimeMinister, #ManmohanSinghBirthday, #BharatRatna, #ManmohanSinghBharatRatna, #EconomicReforms, #1991EconomicReforms, #PVNarasimhaRao, #TelanganaFormation, #TelanganaStatehood, #HyderabadIT, #FinancialDistrict, #IndianEconomy, #Congress, #PoliticalNews, #TelanganaPolitics, #HyderabadNews
Big Story

Manmohan Singh Statue: హైదరాబాద్‌లో మాజీ ప్రధాని విగ్రహావిష్కరణ.. మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని రేవంత్ డిమాండ్

Rahul Gandhi vs ECI
Big Story

Rahul Gandhi vs ECI: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌పై కొత్త చర్చ.. SIRపై ఈసీ కీలక ప్రకటన

Warangal Development
Big Story

Warangal Development: వరంగల్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్.. UGD, ORR, ఎయిర్‌పోర్ట్‌పై కీలక ఆదేశాలు

Tirumala Laddu Ghee Case, Tirupati Laddu Ghee Case, Tirumala Laddu Controversy, Tirupati Laddu Controversy, TTD Ghee Case, CBI SIT Tirumala Laddu, CBI Investigation Tirupati Laddu, Tirumala Ghee Adulteration Case, Tirupati Laddu Latest News, TTD Latest News, Tirumala Laddu CBI Investigation, Tirupati Ghee Case, ED Investigation TTD, Tirumala Laddu Case 2026, Andhra Pradesh News, Tirupati News Today
Andhra Pradesh

Tirumala Laddu Ghee Case: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామాలు.. సీబీఐ దర్యాప్తులో ఏమి తేలింది?

Next Post
అమెరికాతో భారత్ వాణిజ్యమెంత?

 Donald Trump: టారిఫ్‌ల అమలుపై తగ్గేదేలే..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Pink Power Run 3.0

Pink Power Run 3.0: హైదరాబాద్‌లో ఘనంగా పింక్ పవర్ రన్.. వేలాదిగా పాల్గొన్న రన్నర్లు

AndhraPolitics

AndhraPolitics:విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్-సీపీఐ భేటీపై కొత్త చర్చ

#ManmohanSinghStatue, #ManmohanSingh, #ManmohanSinghNews, #RevanthReddy, #RevanthReddyNews, #Hyderabad, #Gachibowli, #WiproCircle, #Telangana, #TelanganaNews, #FormerPrimeMinister, #ManmohanSinghBirthday, #BharatRatna, #ManmohanSinghBharatRatna, #EconomicReforms, #1991EconomicReforms, #PVNarasimhaRao, #TelanganaFormation, #TelanganaStatehood, #HyderabadIT, #FinancialDistrict, #IndianEconomy, #Congress, #PoliticalNews, #TelanganaPolitics, #HyderabadNews

Manmohan Singh Statue: హైదరాబాద్‌లో మాజీ ప్రధాని విగ్రహావిష్కరణ.. మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని రేవంత్ డిమాండ్

Rahul Gandhi vs ECI

Rahul Gandhi vs ECI: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌పై కొత్త చర్చ.. SIRపై ఈసీ కీలక ప్రకటన

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info