మొంథా తుపాన్‌లో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు ఉచిత పంటల బీమాను చంద్రబాబు ఎగ్గొట్టారని.. అతడి తప్పిదంతో పంటలకు పరిహారం రావడం లేదని విమర్శించారు. ఉచిత పంటల బీమా ఎత్తేయడంతో రైతులకు నష్టం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి చంద్రబాబు ఆదుకోవాలని కోరారు.
కృష్ణా జిల్లాలో మొంథా తుఫాన్‌తో నష్టపోయిన పంట పొలాలను పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాలలో మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. పంట పొలాల్లోకి వెళ్లి రైతులను కలిసి వారికి భరోసా ఇచ్చారు. ‘రబీ నుంచి ఉచిత పంటల బీమా అమలు చేయాలి. ఇన్‌పుట్ సబ్సిడీ కింద కూడా రూ.600 కోట్లు బకాయి ఉన్నాయి. ఆ మొత్తం కూడా వెంటనే ఇవ్వాలి’ అని చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. ‘రైతుల కష్టనష్టాలకు రాష్ట్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత. రైతులకు న్యాయం చేసే వరకు పోరాడతాం. రైతుల పక్షాన నిలుస్తాం. వారికి తోడుగా ఉంటాం’ అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు.
‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి రైతుకు అండగా ప్రభుత్వం ఉంది. ప్రతి రైతులో ఒక భరోసా ఉండేది. జగన్ ఉన్నాడన్న నమ్మకం. పంటలకు పెట్టుబడి సాయం మొదలు ప్రతి అడుగులో తోడుగా యేటా కచ్చితంగా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించాం’ అని మాజీ సీఎం వైఎస్ జగన్ వివరించారు. ‘ప్రతి ఎకరా పక్కాగా ఈ–క్రాపింగ్. ఉచిత పంటల బీమా అమలు చేశాం’ అని తెలిపారు. నాడు వైఎస్సార్‌సీపీ పాలనలో రైతులకు మేలు చేసిన పథకాలు, కార్యక్రమాలన్నీ కనుమరుగయ్యాయని మాజీ సీఎం వైఎస్ జగన్ గుర్తుచేశారు.
‘ఇప్పుడు తూతూ మంత్రంగా ఈ–క్రాప్ నమోదు. టీడీపీ రైతులకు మేలు చేసేలా తప్పుడు వివరాలు. వాస్తవ భూమి, పంటల సాగుకు మించి ఈ–క్రాప్ నమోదు. ఒక్క జిల్లాలోనే ఏకంగా 128 శాతం వరకు నమోదు. ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా?’ అని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఒక్క రోజులో పంట నష్టం ఎలా సాధ్యమని నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి రైతుకు దగా చేశారని చంద్రబాబు తీరుపై మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు.
వైసీపీ అధినేత జగన రెడ్డి తుపాను వెళ్లిపోయిన వారానికి పొలాల్లో బురద కూడా పూర్తిగా ఆరిపోయిన రైతులను పరామర్శిస్తానంటూ ఊరేగింపుగా చేసిన యాత్ర పూర్తి స్థాయిలో నవ్వుల పాలయింది. ఎప్పట్లాగే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా జనసమీకరణ చేశారు.ఈ ర్యాలీ కారణంగా పలువురు గాయపడ్డారు కూడా. రైతులను పరామర్శించే పేరుతో ఆయన చేసిన డ్రామాలు ఎవర్నీ ఆశ్చర్యపరచలేదు కానీ..ఆయన చెప్పిన మాటలు మాత్రం నవ్వుల పాలయ్యాయి.
ఒక్కటంటే ఒక్క నిజం కూడా చెప్పలేదు. తమ హయాంలో పంటల బీమా గురించి ఆయన చెప్పినన్నీ అబద్దాలే. మూడేళ్ల పాటు ఆయన ప్రభుత్వం పంటల బీమానే కట్టలేదని స్వయంగా కేంద్ర మంత్రి పార్లమెంట్ లో చెప్పారు. ఎన్ని విపత్తులు వచ్చినా ఎప్పుడూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తామని చెబుతారు కానీ.. చివరికి వెయ్యి రూపాయలు కూడా ఉండదు. వాలంటీర్ల సాయంతో రైతుల కానివాళ్లు,నష్టపోని వైసీపీ నేతలే ఎక్కువగా ఆ పరిహారాన్ని దిగమింగేవారు.
ఇక పంటలకు మద్దతు ధర కోసం స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఆదుకున్నామని జగన్ చెప్పడం రైతుల్ని కూడా ఆశ్చర్యపరిచింది. అలాంటి నిధి కానీ..రైతుల్ని ఆదుకున్న చరిత్ర కానీ ఎవరికీ గుర్తు లేదు. టీడీపీ ఇప్పటికే మామిడి, ఉల్లి రైతుల కోసం 800 కోట్లు చెల్లించింది. తమ హయాంలో రైతులకు భరోసా ఉండేదని ఆయనకు ఆనే చెప్పుకున్నారు. కానీ అంతటి భరోసా ఇస్తే … రైతులు ఎందుకు పాతాళంలోకి తొక్కేశారో ఆయన గుర్తు చేసుకోలేకపోతున్నారు. ఈ క్రాప్ విషయంలోనూ అబద్దం చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే 97 ఈక్రాప్ నమోదు పూర్తయింది.
తన ఊహాలోకంలో ఉంటూ..తాను చెప్పేది అందరూ నమ్ముతారనుకునే మనస్తత్వం ఉన్న జగన్..వాస్తవ పరిస్థితుల్ని అర్తం చేసుకోలేకపోతున్నారన్న విమర్శలు ఈ పర్యటన ద్వారా ఎదుర్కోవాల్సి వచ్చింది.


















