ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Crime

Anantapur: యువతి హత్య కేసులో అసలేం జరిగింది?

Anantapur: యువతి హత్య కేసులో అసలేం జరిగింది?
ADVERTISEMENT

అనంతపురం జిల్లాలో వెలుగు చూసిన ఓ యువతి హత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోంది.

అనంతపురం శివార్లలోని టీవీ టవర్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువతి జూన్ 3వ తేదీ రాత్రి నుంచి కనిపించడంలేదంటూ జూన్ 4వతేదీన తల్లిదండ్రులు అనంతపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.అయితే ఈనెల 8న కూడేరు మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో నేషనల్ హైవే పక్కనే ముళ్ల పొదల్లో ఒక యువతి శవాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసుల సమాచారంతో ఘటనాస్థలికి చేరిన తల్లిదండ్రులు మృతదేహం తమ బిడ్డదేనని గుర్తించారు.తమ బిడ్డకు కొందరు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి హత్య చేశారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నిందితులు యువతి తలపై కొట్టి హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. పోస్టుమార్టం రిపోర్టు ఇంకా రాలేదు.

బిడ్డను హత్య చేశారనే అనుమానంతో కొందరు యువకుల పేర్లు చెప్పామని కానీ, కాల్ లిస్ట్ పేరుతో పోలీసులు ఆలస్యం చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. మరోవైపు ఈ హత్య రాజకీయంగా కూడా కలకలం సృష్టిస్తోంది. వైసీపీ దీనిని మరో దిశ ఘటనగా వర్ణిస్తోంది.జూన్ 3వ తేదీ మంగళవారం రాత్రి నుంచి తమ బిడ్డ కనిపించకుండా పోయిందని, నాలుగు రోజుల తర్వాత శవంగా కనిపించిందని మీడియాతో ఆమె తల్లిదండ్రులు చెప్పారు.”అమ్మాయి మంగళవారం రాత్రి 9 గంటలకు వెళ్లిపోయింది. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో వెతికాం. బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాం. తర్వాత కూడా వెతికాం. పోలీసులు కాల్‌లిస్ట్ తెప్పిస్తామని, వెతుకుతామని చెప్పారు . మాకు ఓ అబ్బాయిపై సందేహం ఉందని చెబితే వాళ్లు స్పందించలేదు. తర్వాత కూడేరు దగ్గర మణిపాల్ కాలేజీ సమీపంలో మా బిడ్డ మృతదేహం దొరికింది. మా అమ్మాయి కేసులో న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం” అని మృతురాలి తండ్రి లక్ష్మీపతి అన్నారు.

”మంగళవారం రాత్రి వెళ్లిపోయింది. అతను నమ్మించి తీసుకెళ్లాడు. ఎంతమంది ఏం చేశారో తెలీడం లేదు. పోలీసులు నిజంగా ఎలాంటి జాగ్రత్తా తీసుకోలేదు. ఆరు రోజులైంది. మీకు దండం పెడతా మా పాపకు న్యాయం చేయండి” అని మృతురాలి తల్లి అన్నారు.అనుమానితులను విచారించకుండా పోలీసులు జాప్యం చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.”బుధవారం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే, మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కొన్ని నంబర్లపై అనుమానం ఉందని చెప్పాం. వాళ్లలో ఒకరిని పిలిపించారు. అతను నాకు సంబంధం లేదు, నాకేం తెలీదన్నాడు. కానీ, అమ్మాయి వెళ్లిన రోజు 9 గంటలకు అతనికి ఫోన్ చేసింది. పోలీసులు కాల్ లిస్ట్ చెక్ చేస్తాం అన్నారు. దాని గురించి అడిగితే రేపురా, తర్వాత రా అని చెప్పారు. ఇప్పుడు కూడేరు పోలీసులు అమ్మాయి శవం దొరికిందని ఫోన్ చేశారు. మేం వెళ్లి ఆనవాళ్లు గుర్తుపట్టి మా పాపే అని క్లియర్ చేసుకున్నాం. మాకు న్యాయం చేయండి. అనుమానితుల నంబర్లు కూడా పోలీసులకు ఇచ్చాం. వారిని వాళ్లు పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అడిగి ఉంటే సరిపోయేది” అని మృతురాలి బంధువు చెప్పారు.

యువతి హత్య కేసుపై అనంతపురం వన్ టౌన్ సీఐ రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడారు. యువతి కనపడటం లేదని ఈనెల 4వ తేదీన ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని, అదే రోజు మిస్సింగ్ కేసు నమోదు చేసి, విచారణ చేపట్టామని ఆయన చెప్పారు.”ఈనెల 3న విద్యార్థిని ఒక యువకుడితో రాత్రి 9 గంటల సమయంలో బైక్‌పై వెళ్లినట్లు ఆధారాలు సేకరించాం. అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. ఆమెకు ముగ్గురు యువకులతో పరిచయం ఉన్నట్లు సమాచారం ఉంది. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నాం. కూడేరు దగ్గర ఉన్న మణిపాల్ స్కూల్ వెనుక ప్రాంతంలో మంగళవారం రాత్రి బీర్ బాటిల్‌తో యువతి తల పగలగొట్టి హత్య చేశారు. సీసీటీవీ ఫుటేజీ తనిఖీ చేస్తున్నాం. దీని వెనుక ఎంతమంది ఉన్నారనేది విచారణ తర్వాతే తెలుస్తుంది” అని అన్నారు.యువతి హత్యపై మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ అకౌంట్‌లో స్పందించారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.

”ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తాం. హత్యకు గురైన సోదరి కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తాం” అని ఎక్స్‌లో తెలిపారు.చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలకు, యువతులకు రక్షణ లేకుండా పోయిందంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదివారం రాత్రి సీఎం చంద్రబాబును ట్యాగ్ చేస్తూ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు.’అమ్మాయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆరు రోజుల కిందట ఫిర్యాదు వచ్చినా సరే ఎందుకు పట్టించుకోలేదు? విద్యార్థిని హత్య ఘటనకు ముఖ్యమంత్రి, ప్రభుత్వం బాధ్యత వహించాలి” అని పోస్ట్ చేశారు.

Tags: #AnantapurCrime#AnantapurUpdates#AndhraPradesh#APCrimeNews#BrutalMurder#CrimeAgainstWomen#IndiaCrimeNew#JusticeForTanmayi#PoliceInvestigation#StopViolence#StudentMurderCase#TanmayiCase#TanmayiMurder#TeluguNews#YouthCrime
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Polavaram:పోలవరం పనుల్లో వేగం – 2027లో పూర్తి లక్ష్యం:మంత్రి నిమ్మల

Next Post

Ester Noronha: మగాళ్లకి అది మాత్రమే కావాలి!

Related Posts

TelanganaDGP
Big Story

TelanganaDGP:తెలంగాణ కొత్త డీజీపీ సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకారం – పోలీస్ వ్యవస్థలో కొత్త మార్పులకు నాంది

APCabinet
Andhra Pradesh

APCabinet:అమరావతి అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ – చంద్రబాబు దిశానిర్దేశంతో రాష్ట్రానికి కొత్త ఊపు

Telangana
Big Story

Telangana:సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్‌తో సమయానికి నాణ్యమైన సామగ్రి – సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు

CrimeNews
Crime

CrimeNews:భార్యపై నమ్మకం ప్రాణం తీసిందా? సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి

PoojaHegde
Entertainment

PoojaHegde:పూజా హెగ్డే గ్లామర్ హంగామా – “హై జవానీ తో ఇష్క్ హోనా హై” ప్రమోషన్స్‌లో లాఫ్టర్ చెఫ్స్ సెట్‌ను కుదిపేసిన స్టార్

MetroRail
Big Story

MetroRail:హైదరాబాద్ మెట్రో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి – రూ.1,461 కోట్లకు L&T షేర్ల కొనుగోలు

Next Post
Ester Noronha: మగాళ్లకి అది మాత్రమే కావాలి!

Ester Noronha: మగాళ్లకి అది మాత్రమే కావాలి!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

TelanganaDGP

TelanganaDGP:తెలంగాణ కొత్త డీజీపీ సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకారం – పోలీస్ వ్యవస్థలో కొత్త మార్పులకు నాంది

APCabinet

APCabinet:అమరావతి అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ – చంద్రబాబు దిశానిర్దేశంతో రాష్ట్రానికి కొత్త ఊపు

Telangana

Telangana:సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్‌తో సమయానికి నాణ్యమైన సామగ్రి – సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు

CrimeNews

CrimeNews:భార్యపై నమ్మకం ప్రాణం తీసిందా? సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info