జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకుల్లో ఉన్న పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. క్రేజ్ అనే పదానికి పవన్ కళ్యాణ్ పర్యాయపదం అని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. పవన్ కళ్యాణ్ ను సీఎం పదవిలో చూడాలనేది అభిమానుల ఆకాంక్ష కాగా ఆరోజు ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ ఏదో ఒకరోజు కచ్చితంగా సీఎం అవుతారని ఆయన అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు.
ఒకవైపు సినిమాల్లో మరోవైపు రాజకీయాల్లో కెరీర్ ను కొనసాగిస్తూ సంచలన విజయాలను సొంతం చేసుకోవడం సులువైన విషయం కాదు. ఇటీవల పవన్ ఓజీ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్వాగ్ కు అభిమానులు ఫిదా అయ్యారు. ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దసరా పండుగ సెలవులను సైతం, ఈ సినిమా క్యాష్ చేసుకుంది.
తాత్కాలికంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పూర్తీ చేయగా వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఓజీ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుండగా ఈ సినిమా సీక్వెల్ లో పవన్ నటిస్తారా లేదా అనే చర్చ జరుగుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ నటించి ఇండస్ట్రీ హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సంచలన ఫలితాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ కు సక్సెస్ సులువుగా దక్కలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2008 సంవత్సరంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షునిగా పని చేశారు.
2011 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ పరంగా విరామం తీసుకున్నారు. 2014 సంవత్సరం మార్చి నెల 14వ తేదీన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు. 2014 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంలో పవన్ కీలక పాత్ర పోషించారు.
ఆ తర్వాత వేర్వేరు కారణాల వల్ల 2019 ఎన్నికల్లో జనసేన 140 స్థానాల్లో పోటీ చేసింది. 2019 ఎన్నికల్లో పవన్ భీమవరం, గాజువాక నుంచి పోటీ చేయగా వేర్వేరు కారణాల వల్ల ఆశించిన ఫలితాలు రాలేదు. అయితే రాజోలు నియోజకవర్గంలో మాత్రం జనసేన పార్టీ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో జనసేనకు ఆశించిన ఫలితాలు రాకపోయినా పవన్ మాత్రం ప్రజా సమస్యలపై పోరాటాలు, ఆందోళనలు నిర్వహించడంతో పాటు వైసీపీ విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఏపీలో పోటీ చేయగా రాష్ట్రంలో 164 స్థానాల్లో మూడు పార్టీల కూటమి విజయం సాధించింది. వైసీపీ మాత్రం కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. పవన్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి పొలిటికల్ కెరీర్ పరంగా సక్సెస్ అయ్యారు. పవన్ కు మంత్రి పదవి దక్కడంతో పాటు డిప్యూటీ సీఎంగా కూడా పవన్ పని చేస్తున్నారు
జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలలో 21 స్థానాలనూ గెలుచుకొని 100% స్ట్రైక్ రేట్‌ను నమోదు చేయడంతో పాటు 2 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించింది. పవన్ పొలిటికల్ కెరీర్ లో సాధించిన ఈ సంచలన విజయాలు అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
ఈ ఏడాది జూన్ నెల 11వ తేదీన పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యాతలు స్వీకరించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు మంత్రిగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అటు పొలిటికల్ కెరీర్ లో ఇటు సినీ కెరీర్ లో సక్సెస్ సాధించి ప్రత్యేకతను చాటుకున్నారు.
పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్న వివరాల ప్రకారం 2039 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2029, 2034 సంవత్సరాల్లో కూడా కూటమి తరపున సీఎం అభ్యర్థిగా చంద్రబాబు పోటీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. పవన్ ఎప్పుడు సీఎం అయినా అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో దేశ రాజకీయాల్లో సైతం సంచలనాలు సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు. సినిమాల్లో, రాజకీయాల్లో సంచలనాలు సృష్టించిన రికార్డును పవన్ కళ్యాణ్ ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో రాజకీయాల్లో మరిన్ని సంచలనాలు సృష్టిస్తారేమో చూడాల్సి ఉంది.


















