How To Exchange 2,000 Notes With Post Office : కేంద్ర ప్రభుత్వం రూ.2,000 నోట్ల ఉపసంహరణ అనంతరం ఇంకా ఎవరి వద్ద అయినా ఆ నోట్లు మిగిలి ఉంటే వాటిని మార్చుకునే అవకాశం రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తపాలాశాఖ ద్వారా కల్పించింది.
పంపిణీ విధానం :ఇండియా పోస్ట్ లేదా ఇన్షూర్డ్ రిజిస్టర్ పోస్టు ద్వారా పంపాలి.
పరిమితి : ఒక్కసారి రూ.20,000 వరకు మాత్రమే పంపవచ్చు
ఎక్కడికి పంపాలి :రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ధారించిన ఏదైనా ఆర్బీఐ ఆఫీస్‌కి మాత్రమే పంపాలి. హైదరాబాద్‌లో ఆర్బీఐ ఆఫీస్ ఉంది.
ఇన్సూరెన్స్ తప్పనిసరి :పంపే రూ.2,000 నోట్ల విలువకు సరిపడే రీతిలో ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి.
తీసుకునే పోస్టాఫీసులు : జిల్లా హెడ్ పోస్టాఫీసులు, సబ్ పోస్టాఫీసుల్లో మాత్రమే ఈ సౌకర్యం ఉంది. బ్రాంచి పోస్టాఫీసుల్లో లేదు. నగదు పంపే వ్యక్తికి సంబంధించి బ్యాంకు అకౌంట్ నెంబరు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, నోట్ల సీరియల్ నంబర్లు, సంబంధిత అప్లికేషన్ ఫారంలో నింపి పంపాలి.
రూ.2000 నోట్లలో 98.26 శాతం తిరిగి వచ్చాయి :రూ.2,000 నోట్లపై ఆర్బీఐ బుధవారం కీలక ప్రకటన చేసింది. రూ.2 వేల నోట్లు పూర్తిస్థాయిలో మాకు చేరలేదని చెప్పింది. ప్రజల వద్ద ఇంకా రూ.6,181 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ఉన్నాయని పేర్కొంది. 2023 మే 19 నాటికి చలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 98.26 శాతం తిరిగి వచ్చాయని ప్రకటించింది. రూ.2,000 నోట్లను ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో మార్చకోవచ్చని అవకాశం కల్పించింది ఆర్బీఐ. రూ.2 వేల నోట్లను 2023 మే 19 న ఆర్బీఐ రద్దు చేసింది.
2023 అక్టోబర్ 7వ తేదీ వరకు బ్యాంకులో మార్చుకోడానికి, డిపాజిట్ చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2023 అక్టోబర్ 9 నుంచి ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాల్లో రూ.2000 వేల నోట్లను మార్చుకోడానికి అవకాశం కల్పించింది. వీటిని వ్యక్తుల, సంస్థల పేరుతో నేరుగా ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత ఇండియాలో ఉన్న పోస్టాఫీసుల నుంచి నోట్లను ఆర్బీఐకి పంపిస్తే వారి ఖాతాల్లో నగదు క్రెడిట్ అయ్యే అవకాశం కల్పించింది.