వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమాల పట్ల పార్టీ తీరు పట్ల పెద్దగా సంతృప్తిగా లేరని అంటున్నారు. పదవులు ఇచ్చినా వాటిని కేవలం అలంకారప్రాయంగా భావిస్తూ పార్టీని పటిష్టం చేయకుండా టైం పాస్ చేస్తున్న వారి విషయంలో గట్టిగానే డెసిషన్ తీసుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారు అని అంటున్నారు. పార్టీని యాక్టివ్ చేయడమే లక్ష్యంగా చేసుకుని ఎంతటి కఠిన నిర్ణయం అయినా తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు అని అంటున్నారు. వైసీపీ ఓటమి తరువాత ఈ రోజుకీ ఇంకా చతికిలపడి ఉండడం చాలా చోట్ల నాయకులు దూకుడు చేయకపోవడం క్యాడర్ తో కలిసి ఉండకపోవడం భరోసా ఇచ్చే ప్రయత్నాలు చేయకపోవడం వంటివి అన్నీ జగన్ దృష్టిలో ఉన్నాయని అంటున్నారు.
పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని జగన్ బలంగానే నిర్ణయించుకున్నారు అని అంటున్నారు. ముఖ్యంగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంచార్జిల పనితీరు మీదనే ఆయన ఇటీవల కాలంలో ఫుల్ ఫోకస్ పెట్టారు అని అంటున్నారు. చాలా చోట్ల ఇంచార్జిల పనితీరు మీద పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని అంటున్నారు క్యాడర్ తో మమేకం కాకపోవడం పార్టీ గురించి పెద్దగా పట్టించుకోకపోవడం వంటి వాటి మీద జగన్ సీరియస్ గానే ఉన్నారు అని అంటున్నారు ఇక 2024 ఎన్నికల ముందు దాదాపుగా ఎనభై దాకా అసెంబ్లీ నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను అటు నుంచి ఇటు మార్చేశారు ఒక విధంగా భారీ ప్రయోగం చేశారు. దాని వల్ల పార్టీకి లాభం లేకపోగా ఇంకా ఇబ్బంది ఏర్పడింది, ఘోర ఓటమి సంభవించింది ఇక ఇపుడు వారిలో అనేక మందిని ఇంచార్జిగా ఉంచారు అయితే వారికి క్యాడర్ కి మధ్య అయితే బంధం ఏర్పడలేదు, చాలా చోట్ల క్యాడర్ ఈ తరహా ఇంచార్జిలను వ్యతిరేకిస్తున్నారు అని పార్టీకి అందిన సమాచారంగా ఉందని చెబుతున్నారు.
ఈ క్రమంలో జగన్ ఒక ముహూర్తం అయితే ఫిక్స్ చేశారు అని అంటున్నారు. దీనికి సంబంధించి నవంబర్ నెలలోనే పెద్ద నిర్ణయాలే తీసుకుంటారు అని అంటున్నారు. పార్టీలో ఎవరు ఏమిటి అన్నది జగన్ కి పూర్తి సమాచారం ఉంది అని అంటున్నారు. అంతే కాదు క్యాడర్ తో ఎవరు ఉంటున్నారు. ఎవరు దూరంగా ఉంటున్నారు అన్నది కూడా డేటా మొత్తం ఉందని అంటున్నారు. దాంతో ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటూ చాలా చోట్ల చురుకుగా పనిచేసే వారికే ఇంచార్జి పదవులు ఇస్తారు అని అంటున్నారు. అంతే కాదు ఈ విషయంలో క్యాడర్ కి లోకల్ లీడర్స్ అభిప్రాయాలకు పెద్ద పీట వేస్తారు అని అంటున్నారు.
ప్రతీ నియోజకవర్గంలో ఆయా స్థానిక నాయకుల అభిప్రాయాలను తెలుసుకుంటూ వారి మాట మీదనే ఇంచార్జిని కొనసాగించాలా లేక కొత్త వారికి చాన్స్ ఇవ్వాలా అన్నది జగన్ నిర్ణయిస్తారు అని అంటున్నారు. ఏపీలో హానీ మూన్ పీరియడ్ ఏనాడో ముగిసిందని కూటమి ప్రభుత్వం మీద ఎక్కడికక్కడ యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది. పార్టీ రాష్ట్ర స్థాయిలో ఇచ్చే కార్యక్రమాలతో పాటు స్థానికంగా ఉన్న సమస్యల మీద నిరంతరం ప్రజలలో ఉంటూ పోరాడితేనే పార్టీ హైలెట్ అవుతుందని భావిస్తున్నారుట. అలాంటి డైనమిక్ లీడర్ షిప్ కోసమే వైసీపీ చూస్తోందని అంటున్నారు.
ఇక కొత్త ఏడాది వస్తూనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ప్రతీ నియోజకవర్గంలో స్థానికంగా భారీ సమరం సాగనుంది దాంతో నియోజకవర్గం ఇంచార్జిలది కీలకమైన పాత్ర. వారే గట్టిగా ఉంటూ క్యాడర్ ని మొత్తం సమాయత్తం చేయాల్సి ఉంటుంది. అలాంటిది వారు డీలా పడినా పట్టించుకోకపోయినా అది పార్టీకే పెద్ద దెబ్బగా మారుతుందని అంటున్నారు. దాంతో జగన్ చాలా కీలక నిర్ణయాలను తీసుకుంటారని అంటున్నారు. మొత్తం మీద రిపేర్లకు అధినాయకత్వం రెడీ అవుతోంది. చూడాలి మరి రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో.


















