• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

YSRCP: వైసీపీకి దెబ్బ మీద దెబ్బ..!

YS Jagan: మళ్ళీ అదే ఫార్ములానా..?

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.. మరో రెండు మున్సిపాలిటీలు చేజారిపోయాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీలో వైస్ ఛైర్మన్‌ గొలగాన రమాదేవిపై కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. అలాగే ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్‌ ఛైర్మన్‌ చిర్లంచర్ల బాలమురళీకృష్ణారావుపై కూడా అవిశ్వాసం నెగ్గింది. బొబ్బిలిలో మొత్తం 30 మంది కౌన్సిలర్లలో 22 మంది అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. మార్కాపురంలో 35 మంది కౌన్సిల్‌ సభ్యుల్లో 19 మంది అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఇద్దరు ఛైర్మన్‌లు పదవులు కోల్పోయారు.

బొబ్బిలి మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్‌ గొలగాన రమాదేవిపై అవిశ్వాసం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే బేబినాయనతో సహా 22 మంది సభ్యులు హాజరయ్యారు. వైఎస్సార్‌సీపీకి చెందిన 10 మంది, టీడీపీకి చెందిన 10 మంది కౌన్సిలర్లు, స్వతంత్ర అభ్యర్థి వనజాక్షి రమాదేవికి వ్యతిరేకంగా ఓటు వేశారు. మొత్తం 30 మంది కౌన్సిలర్లలో 22 మంది మద్దతుతో అవిశ్వాసం నెగ్గినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అవిశ్వాసం నెగ్గడంతో మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవికి ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. అయితే గొలగాన రమాదేవిపై పెట్టిన అవిశ్వాసానికి అదే పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ ఛైర్మన్ 2 చెలికాని మురళీకృష్ణారావు మద్దతు పలికి షాకిచ్చారు.. ఆయన మద్దతు తెలపడంతో అంతా ఆశ్చర్యపోయారు. అంతేకాదు కలెక్టర్‌కు ఇచ్చిన అవిశ్వాస నోటీసులో ఆయన సంతకం లేదు. ఇటీవల బొబ్బిలి మున్సిపల్ ఛైర్మన్ సావు వెంకట మురళీకృష్ణారావుపై కూడా అవిశ్వాసం పెట్టడంతో ఆయన పదవి కోల్పోయారు. వైఎస్సార్‌సీపీకి చెందిన 10 మంది కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు పలకడంతో రాంబార్కి శరత్‌బాబు మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.

ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్‌ ఛైర్మన్‌ చిర్లంచర్ల బాలమురళీకృష్ణారావుపై కూడా అవిశ్వాసం నెగ్గింది. త్వరలోనే ఈ పదవి టీడీపీకి దక్కనుంది. మొత్తం 35 మంది కౌన్సిలర్లు ఉంటే.. వైఎస్సార్‌సీపీకి 30 స్థానాలు.. 5 స్థానాలు టీడీపీ గెలించింది. ఇటీవల మున్సిపల్ ఛైర్మన్‌ పనితీరు నచ్చక 12మంది వైఎస్సార్‌సీపీ సభ్యులు రెండు నెలల క్రితం టీడీపీలో చేరారు. అనంతరం 24 మంది కౌన్సిలర్లు కలెక్టర్‌ను కలిసి బాలమురళీకృష్ణారావుపై అవిశ్వాసం పెట్టమని కోరారు. ఈ మేరకు నోటీసు జారీ చేసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 23 మంది కౌన్సిల్‌ సభ్యులతో పాటు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి హాజరయ్యారు.. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 19 మంది ఓటు వేశారు. మిగతా వారు తటస్థంగా ఉన్నారు. దీంతో ఛైర్మన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. ఈ పదవి టీడీపీ ఖాతాలోకి చేరనుంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు వైఎస్సార్‌సీపీకి చేజారగా.. కూటమి ఖాతాలోకి వెళ్లిపోయాయి.

Tags: #AndhraPolitics#APpolitics#BobbiliMunicipality#CouncillorPolitics#LocalBodyElections#MarkapuramMunicipality#MunicipalElections#MunicipalityPolitics#NoConfidenceMotion#PoliticalSetback#PoliticalSwitch#PowerShift#PrakasamDistrict#TDPGain#TDPVictory#TeluguNews#UrbanLocalBodies#VijayanagaramNews#YSRCPCrisis#YSRCPLoss
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Keerthy Suresh: నెటిజన్లు ఆగ్రహం.. ఎందుకంటే?

Next Post

Raja Raghuvanshi murder case highlights: సంచలన వాస్తవాలు వెలుగులోకి..!

Related Posts

AP Politics:  సర్వేలు ఏం చెబుతున్నాయి?
Andhra Pradesh

AP Politics: సర్వేలు ఏం చెబుతున్నాయి?

Talliki Vandanam Scheme: ఆనందంలో కుటుంబాలు
Andhra Pradesh

Talliki Vandanam Scheme: ఆనందంలో కుటుంబాలు

Niharika Konidela: సీక్రెట్‌గా నిశ్చితార్థం నిజమేనా?
Entertainment

Niharika Konidela: సీక్రెట్‌గా నిశ్చితార్థం నిజమేనా?

Hari Hara veeramallu: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
Entertainment

Hari Hara veeramallu: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

OnePlus 13s: వన్‌ప్లస్ 13s ఫస్ట్ సేల్ ఆఫర్లు..
Business

OnePlus 13s: వన్‌ప్లస్ 13s ఫస్ట్ సేల్ ఆఫర్లు..

Raja Raghuvanshi murder case highlights: సంచలన వాస్తవాలు వెలుగులోకి..!
Big Story

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

AP Politics:  సర్వేలు ఏం చెబుతున్నాయి?

AP Politics: సర్వేలు ఏం చెబుతున్నాయి?

Rana Naidu Season 2 Review: ‘రానా నాయుడు సీజన్ 2’ రివ్యూ

Rana Naidu Season 2 Review: ‘రానా నాయుడు సీజన్ 2’ రివ్యూ

Talliki Vandanam Scheme: ఆనందంలో కుటుంబాలు

Talliki Vandanam Scheme: ఆనందంలో కుటుంబాలు

Niharika Konidela: సీక్రెట్‌గా నిశ్చితార్థం నిజమేనా?

Niharika Konidela: సీక్రెట్‌గా నిశ్చితార్థం నిజమేనా?

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info