దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆ సమయంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ఫోటో ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. “మిస్ యూ డా” అని రాశారు జగన్!
అవును… వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు వైఎస్ జగన్ ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతితో పాటు ఇతర కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు, అభిమానులు పాల్గొన్నారు. ఇదే సమయంలో షర్మిల నివాళులు ఆర్పించారు.
మిస్ యూ డాడ్!: వైఎస్సార్ జయంతి వేళ ఆయన తనయుడు జగన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా… “మిస్ యూ డాడ్” అంటూ ఇవాళ ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన ఫొటోలను ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. షర్మిల తాజా కోరిక ఇదే!: వైఎస్సార్ జ్ఞాపకార్థం హైదరాబాద్ లో స్మృతివనం ఏర్పాటు చేయాలని ఏపీసీసీ చీఫ్ షర్మిల కోరారు. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళులర్పించిన షర్మిల… ఈ డిమాండ్ చేశారు! ఈ విషయంపై సోనియాగాంధీకి లేఖ రాసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే దీనిని నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
కడపలోని వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు వారం రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి లేకపోవడం, ఏడీసీఈటీ విడుదలపై వారు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ఇడుపులపాయలో జగన్ ను వాళ్లు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా స్పందించిన జగన్… సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తానని.. విద్యార్ధులకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
మనసున్న మారాజు
డాక్టర్ వైస్ రాజశేఖర్ రెడ్డి 76 వ జయంతి సందర్బంగాఆధునిక భగీరధుడు , 6 సార్లు ఎమ్మెల్యేగా4 సార్లు లోక్‌సభ సభ్యుడిగా
మొతం 10 సార్లు ఎన్నికైన ఓటమి ఎరుగని యోధుడు డాక్టర్ YSR
1) 2004 లో సీఎం అయ్యాడు YS5 సం పాలించిన తరువాత, 2009 ఎన్నికల్లో TDP ,TRS కమ్మూనిస్టులు కలిసి మహా కూటమి పేరుతొ పోటీ చేసినా ,మరో వైపు మెగా స్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ కు అండ గ ఉన్న కాపుల ఓట్లు కొల్లగొట్టినా ఒంటరిగా కాంగ్రెస్ ను ఎన్నికల గోదాలో ముందుండి నడిపిన YS ను మరల రెండవసారి ప్రజలు సీఎం ను చేసారుఅంటే YS గొప్పతనం తెలియడం లేదా .
2) వైఎస్ బ్రతికుంటే రాష్ట్ర విభజన జరిగేది కాదు-ప్రొఫెసర్ నాగేశ్వర్సోనియా ను ఎదురించి రాష్ట్ర విభజనను ఆపాడు YS అని మన్ మోహన్ సింగ్ మీడియా సలహాదారు సంజయ్ బారువా CNN IBN ఇంటర్వ్యూ లో చెప్పాడు .
3 ) YS జలయజ్ఞం ద్వారా 18 లక్షల ఎకరాలకు సాగు నీరు అందింది అని చంద్రబాబు సీఎం అయినాక 2014 లో గవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పించాడు.ఇది YS జలయజ్ఞానికి బాబు సర్కార్ ఇస్తున్న సర్టిఫికెట్-ప్రొఫెసర్ నాగేశ్వర్
4) 2009 ఎన్నికల ప్రచారం ఆరంభిస్తూ2009 మార్చిలో పెద్దల ఆశీర్వాదం కోసం బాబు తన సొంత వూరు నారావారి పల్లెకు వెళ్లి నప్పుడుబాబు చిన్నాన్న చెప్పిన మాటలు”నేను అధికారం లోకి వస్తే YS లాగా మంచి పాలనా అందిస్తా అని ప్రజలకు చెప్పు, ఓట్లు వస్తాయి బాబు”-ఇది ఆనాడు ఆంధ్రజ్యోతి లో వచ్చింది
.
5) 2009 లో YS గెలిచి సీఎం అయినాకఅప్పటి టీడీపీ నాయకురాలు రోజా వెళ్లి YS ని కలిసింది ,అప్పుడు I-News లో అంకం రవి అనే ఆయన చర్చ పెట్టాడు YS కు బాబు కు తేడా ఏమిటి అని ?అప్పుడు చర్చలో పాల్గొన తెలంగాణ సీనియర్ BC జర్నలిస్ట్ పాశం యాదగిరి”ఇద్దరూ రాయలసీమకు చెందిన వారు రాయలసీమ భాషలో పోల్చుతా YS బెంగళూరు లాంటోడు అయితే బాబు పుంగనూరు లాంటోడు ,ఎన్ని పుంగనూరు లు కలిస్తే బెంగళూర్ అవుద్ది కాబట్టి YS ముందు బాబు తేలిపోతాడు, బాబు క్యారెక్టర్ చాల వీక్” అని ఆన్నాడు
6) అలాగే 2009 ఎన్నికలకు ముందు అప్పటి HMTV CEO రామచంద్రమూర్తి సర్వే చేసి మరల YS గెలుస్తాడు అని చెప్పాడుఆ సందర్బంగా
YS ప్రజల మధ్య ఉండి యుద్ధం చేస్తాడు కానీ బాబు మీడియా వెనకాల దాక్కొని యుద్ధం చేస్తాడుఅని .చెప్పాడు
7) వైఎస్ రాజనీతిజ్ఞుడు-తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు ( జులై 14 , 2016 )దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజనీతిజ్ఞత కారణంగానే ఆంధ్రప్రదేశ్‌లో ఆయన మొదలుపెట్టిన 84 ప్రాజెక్టుల్లో చాలావరకు ఇప్పుడు పూర్తవుతున్నాయని విద్యాసాగర్‌రావు అన్నారు.
(లక్ష కోట్ల వ్యయం తో కోటి ఎకరాలకు నీరందించేలా ఒకేసారి 84 ప్రాజెక్టులు చేపట్టి ఐదేళ్లలో 16 ప్రాజెక్ట్ లను పూర్తి చేసి ,24 ప్రాజెక్ట్ లను పాక్షికంగా పూర్తి చేసి మొత్తంగా 41 ప్రాజెక్ట్ ల ద్వారా 19 .53 లక్షల ఎకరాలకు నీరు అందించి , 3 .96 లక్షల ఎకరాలను స్థిరీకరించి టోటల్ గా 23 .49 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాడు)
8)2016 లో అనుకుంటా, NTV నిర్వహించిన సర్వే లో బెస్ట్ సీఎం ఎవరు అంటే చనిపోయి చాల ఏళ్ళు అయినా కూడా YS బెస్ట్ సీఎం అని తెలుగు ప్రజలు తేల్చి చెప్పారు
9) కృష్ణ పట్నం పోర్ట్ ,శ్రీ సిటీ సెజ్ YS ప్రాంభించినవేశ్రీసిటీలో 300 పరిశ్రమలు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం సుమారు లక్షమంది ప్రత్యక్షంగా,
పరోక్షంగా మరో లక్షమందికి పైగా ఉపాధి పొందుతున్నారు
10) నిజానికి హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందింది YS హయములోనే అని 2015 లో JNTU శాస్త్రవేత్తలు రిపోర్ట్ ఇచ్చారు
శంషాబాద్ ఎయిపోర్టు, పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ హైవే, బయోటెక్నాలజీ పార్క్, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్,
కైజెన్ టెక్నాలజీస్ వంటి అనేక ప్రాజెక్టులు వైఎస్ హయాంలోనే ప్రారంభమయ్యాయి.YS హయాములో IIT , US Consulate, BITS Pilani ,Cognizant, Infosys,TCS లు వచ్చాయి.Microsoft మూడో దశ, Wipro రెండో దశ పనులు మొదలయ్యాయి.9 శివారు మునిసిపాలిటీలు కలిపి GHMC ఏర్పాటు చేసారుహైదరాబాద్ కు కు A1 స్టేటస్ తెచ్చారుదీనివలన ఉద్యోగుల HRA 10 శాతము పెరిగింది.ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు అయిందిYS హయాంలోనే 50 వేల ఎకరాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌రీజియన్ (ఐటీఆర్) ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఆమోదం లభించింది.పేద విద్యార్థులు ఇంజినీరింగ్ మెడిసిన్ లాంటివి చదివి ఏంటో లబ్ది పొందారుఆరోగ్య శ్రీ ద్వారా ఆదుకొని ఎంతో మంది పేదల ఆరోగ్య అవసరాలుతీర్చిఅప్పులపాలు కాకుండా చూసాడుజలయజ్ఞం ద్వారా రైతుల కంట పన్నీరు పండించాడు