వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటన ఫిక్స్ అయింది. ఆయన 2024 ఎన్నికల్లో భారీ ఓటమిని అందుకున్న తరువాత మొదటిసారి ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తున్నారు. ఇది రాజకీయంగా ఆసక్తిని రేపే అంశంగా ఉండబోతోంది. జగన్ ఇప్పటిదాకా పరామర్శలు జైలుకి వెళ్ళిన నేతలతో ములాఖత్ లు అన్నీ చేసి వచ్చారు. అయితే ఇవన్నీ దక్షిణాంధ్రాలోనే ఎక్కువగా జరిగాయి. క్రిష్ణా గుంటూర్, రాయలసీమ జిల్లాలలో జగన్ అడపా దడపా పర్యటించారు కానీ గోదావరి జిల్లాల వైపు చూడలేదు, ఉత్తరాంధ్ర వైపు కనీసం చూడలేదు. కానీ దానికి ముహూర్తం అయితే ఇపుడు కుదిరిపోయింది.
ఇక ఉత్తరాంధ్రాలో జగన్ తొలి అడుగు ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం లో ఉండబోతోంది అంతే కాదు అక్కడ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఉన్నారు. ఆయన ఇలాకా అన్న మాట. అక్కడికే జగన్ వస్తున్నారు. ఇది రాజకీయంగా చూస్తే ఇంకా ఆసక్తికరంగా ఉండబోతోంది. స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఉన్నా కూడా వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారు. అంతే కాదు ఆయన మెడికల్ కాలేజీల మీద కూడా తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. ఇక రాజకీయంగా చూసినా ఉత్తరాంధ్రాలో సీనియర్ మోస్ట్ లీడర్ ఫైర్ బ్రాండ్ అయిన అయ్యన్న ఇలాకా నుంచే వైసీపీ సౌండ్ చేస్తే అది రీసౌండ్ గా మారుతుంది అన్న వ్యూహంతోనే నర్శీపట్నాన్ని ఎంచుకున్నారు అని అంటున్నారు.
ఇదిలా ఉంటే మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో అప్పగించడం మీద వైసీపీ మండిపడుతోంది జగన్ అయితే ప్రెస్ మీట్ పెట్టి మరీ గత నెలలో కూటమి సర్కార్ మీద విరుచుకుపడ్డారు. ఈ ఇష్యూలో సర్కార్ దిగివచ్చేంతవరకూఒ తాము జనంలో ఉంటూ ఆందోళనలు చేస్తామని కూడా ఆనాడు చెప్పారు. అవసరం అయితే తాను జనం మధ్యలోకి వచ్చి మరీ ప్రభుత్వం చేసే తప్పుని ఎండగడతాను అని అన్నారు. దానికి తగినట్లుగానే జగన్ ఇపుడు మెడికల్ కాలేజీల విషయంలో రంగంలోకి దిగారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఏపీలో మెడికల్ వార్ స్టార్ట్ అయింది. వైసీపీ నాయకులు అంతా ఇదే అంశం మీద గత ఇరవై రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అయితే పోస్టులు పెద్ద ఎత్తున పెడుతున్నారు. మరో వైపు వైసీపీ సానుభూతిపరులు అమరావతికి లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీల నిర్మాణానికి పెట్టలేరా అని కూడా పోస్టులు పెడుతున్నారు ఒక విధంగా ఇది లాజిక్ తో కూడిన ప్రశ్నగా ఉంది. దీనికి ప్రభుత్వం వద్ద ఆన్సర్ ఉందో లేదో తెలియదు కానీ జనాలు అవును సుమీ అనుకునేలా ఉంది అని అంటున్నారు.
ఇక ఉత్తరాంధ్రలో వైసీపీ గత ఎన్నికల్లో బాగా దెబ్బతినిపోయింది. దాంతో మళ్లీ పుంజుకోవడానికి చూస్తోంది. దానికి జనాలకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే ఇష్యూగా మెడికల్ కాలేజీలను ఎంచుకున్నారు అని అని అంటున్నారు. జగన్ ఉత్తరాంధ్రా రావడంతోనే ఈ తరహా ఇష్యూని ఎంచుకోవడం ద్వారా ఈ ప్రాంతంలోని బీసీలు పేదలకు టచ్ అయ్యేలా కూటమి మీద ఘాటు విమర్శలు చేస్తారు అని అంటున్నారు. మొత్తానికి పోయిన చోట వెతుక్కోవాలన్నది వైసీపీ గ్రహించి జనంలోకి వస్తోంది. అదే సమయంలో తమకు ప్రతిష్టగా ఉన్న మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తోంది. జగన్ నేరుగానే ఈ ఇష్యూలో పాలు పంచుకోవడంతో ఇక మీదట ఈ వేడి స్టేట్ లేవెల్ లో మరో లెవెల్ లో సాగుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.