ఓ థ్రిల్లర్ లేదా సస్పెన్స్ సినిమా కధ వ్రాసుకునేటప్పుడు దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. సినిమా చివరి వరకు సస్పెన్స్ కొనసాగిస్తూ ప్రేక్షకులను కుర్చీలలో నుంచి కదలకుండా కూర్చోబెట్టేవిదంగా కధ నడిపిస్తాడు.ఏపీ సిఎంగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన జగన్ కూడా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా మద్యం కుంభకోణానికి రూపకల్పన చేసి ఎక్కడా ఒక లొసుగు లేకుండా 5 ఏళ్ళపాటు విజయవంతంగా అమలు చేశారు!రూ.250 పించన్ పెంపుకి ఏడాది చొప్పున గడువు పెట్టి 5 ఏళ్ళలో రూ.3,000కి చేర్చిన జగన్, మద్యం కుంభకోణం విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఎన్నికలలో వైసీపీ గెలిచిన వెంటనే మొదలైంది. అంటే ఈ విషయంలో జగన్‌కి ఎంత దూరదృష్టి ఉందో అర్ధమవుతుంది.
ఇదే తెలివితేటలు, ప్లానింగ్, నిబద్దత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో చూపించి ఉండి ఉంటే నేడు రాష్ట్రం ఎక్కడో ఉండేది. జగన్ పేరు దేశమంతా మారుమ్రోగిపోయేది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పేర్లు మరుగున పడిపోయి ఉండేవి.కానీ జగన్ అణుబాంబు లాంటివారు! అది ఎక్కడ పడితే అక్కడ విధ్వంసం తప్పదు. జగన్ దెబ్బకి వైసీపీ కూడా అలాగే విధ్వంసం అయ్యింది కదా?మద్యం కుంభకోణం విషయానికి వస్తే, దాని గురించి మీడియాలో వస్తున్న వివరాలు సామాన్య ప్రజలకు అర్దమవవంటే అతిశయోక్తి కాదు.ఇస్రో శాస్త్రవేత్తలు ఒక ఉపగ్రహాన్ని తయారు చేయడానికి, తర్వాత దానిని అంతరిక్షంలో ప్రవేశపెట్టడానికి ఎంత సునిశితంగా ప్రతీదీ ప్లాన్ చేసుకుంటారో జగన్ కూడా మద్యం కుంభకోణాన్ని అంతే ‘ప్రెసిషన్’గా ప్లాన్ చేసి అమలుచే రోల్ మోడల్‌గా నిలిచారు.మద్యం కుంభకోణంలో ‘బంగారం కధలు’ విన్నప్పుడు పానకంలో పుడకలా అనిపించవచ్చు. కానీ అవి ఆర్ధిక నిపుణులు సైతం ఊహించలేని ఆలోచనలే. నిజానికి ఇంత సంక్లిష్ట పద్దతిలో మద్యం కుంభకోణం చేయాలనే ఆలోచన కూడా చాలా గొప్పదే.
అందువల్లే టీవీ న్యూస్‌లో మద్యం కుంభకోణం కేసుకి సంబందించి వార్తలు వస్తున్నప్పుడు చాలామంది ఛానల్ మార్చేస్తారు. అవి చాలా గందరగోళంగా అనిపిస్తే, ఈ కేసులో ఎవరినైనా అరెస్ట్ చేస్తే అది మాత్రం అందరికీ కనిపిస్తుంది. అలాగే ‘రాజకీయ కక్ష సాధింపు’ అంటూ వైసీపీ నేతలు సింపుల్‌గా చెపుతున్న మాటలు ప్రజలకు బాగా చేరుతున్నాయి.కాకినాడ పోర్టు నుంచి షిప్పులో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసినట్లు ఈ కేసులో ఏదీ కళ్ళకు కనపడదు…. వైసీపీ నేతల అరెస్టులు …. వారి ఖండనలు తప్ప.కనుక ఏసీబీ అధికారులు దీనిపై ఎంత లోతుగా దర్యాప్తు జరిపినప్పటికీ వారు కూడా వేల పేజీలతో ఆభియోగ పత్రాలు వేయకతప్పడం లేదు. కనుక కనుక ఈ కేసులో సంక్లిష్టత కూడా భాగమే. ఈ సంక్లిష్టతే వాదోపవాదాలకు, కౌంటర్ పిటిషన్లకు మరింత ఉపయోగపడుతుంది.అంటే ఈ మద్యం కుంభకోణం ప్లానింగ్ దశలోనే జగన్ & కో ఒకవేళ ఈ కేసు కోర్టుకి వెళితే దీనిని ఏవిదంగా సాగదీయాలనే విషయం కూడా ఆలోచారన్న మాట!
కనుక అక్రమాస్తుల కేసు, వివేకా హత్య కేసులాగే ఈ మద్యం కుంభకోణం కేసుని కూడా న్యాయ విద్యార్ధులు ఓ కేసు స్టడీగా తీసుకొని అధ్యయనం చేస్తే వారికి తమ గురువులు కూడా చెప్పని పాఠాలు ఎన్నో ఈ మూడు కేసులలోనే లభిస్తాయి.మొదటి అణుబాంబు తయారుచేసిన శాస్త్రవేత్త (జె. రాబర్ట్ ఓపెన్ హైమర్) గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ అది ఎప్పుడు ఎక్కడ వేశారో అందరికీ తెలుసు.అదేవిదంగా ఈ కేసులో ప్రధాన శాస్త్రవేత్తని కనిపెట్టడం చాలా కష్టం కావచ్చు కానీ ఈ కేసు గురించి నాలుగు తరాలు తప్పకుండా చెప్పుంటాయి.వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంపై సిట్ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. 300 పేజీలతో ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్‌ను సిట్ అధికారులు కోర్టుకు సమర్పించారు. దీనితో పాటు వందకు పైగా ఫొరెన్సిక్ ల్యాబ్ నివేదికలు, ఎలక్ట్రానిక్ పరికరాలను దీనికి జతచేశారు. మొత్తం రూ.62 కోట్లు సీజ్ చేసినట్లు అధికారులు కోర్టుకు తెలిపారు. 268 మంది సాక్షులను విచారించినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. 11 మంది వాంగ్మూలాలు, రిమాండ్ రిపోర్ట్లు, ఇతర పత్రాలను దీనికి జతచేశారు.
ఆసుపత్రులు, వివిధ బ్యాంకులు, బంగారం షాపులు, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడుల వివరాలకు సంబంధించిన స్టేట్‌మెంట్‌లను కూడా స్వాధీనం చేసుకుని ఛార్జ్‌షీట్‌లో సిట్ పొందుపరిచింది. అయితే వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పేరు దీనిలో ఉన్నప్పటికీ ఆయన పాత్రను అధికారులు పేర్కొనలేదు. మద్యం ముడుపుల సొత్తును షెల్ కంపెనీల ద్వారా రావడం, బ్లాక్‌ను వైట్‌గా మార్చడం తదితర అంశాలను వివరించింది. 20 రోజుల్లో మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని కోర్టుకు సిట్ తెలిపింది. మరోవైపు దర్యాప్తు కీలక దశలో ఉందని త్వరలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు.
మద్యం కుంభకోణం వివరాలు :
2024 సెప్టెంబర్ 25న కేసు నమోదు చేసిన సీఐడీ2024 అక్టోబర్ 22, 23 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా మద్యం డిస్టిలరీ కంపెనీల్లో తనిఖీలు2025 ఫిబ్రవరి 5న మద్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు ఏపీలో మద్యం అక్రమాలపై సిట్విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో మొత్తం ఏడుగురు సభ్యులతో సిట్సిట్‌కు కావాల్సిన సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించిన సర్కార్ప్రతి 15 రోజులకోసారి దర్యాప్తు అంశాలను ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలుమార్చి 12న సిట్ విచారణకు హాజరైన ఎంపీ విజయసాయిరెడ్డిమద్యం కుంభకోణం కీలకపాత్రధారి రాజ్ కెసిరెడ్డి అని మీడియాకు విజయసాయిరెడ్డి వెల్లడిమార్చి 21న ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన ఎంపీ మిథున్‌రెడ్డిమద్యం కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని మిథున్‌రెడ్డి పిటిషన్ఏప్రిల్ 14న హైదరాబాద్‌లోని రాజ్ కెసిరెడ్డి కంపెనీలు, నివాసంలో సిట్ సోదాలుఏప్రిల్ 16న రాజ్ కెసిరెడ్డికి నోటీసులు జారీచేసిన సిట్‌ఏప్రిల్ 19న విచారణకు హాజరుకావాలని సిట్ నోటీసునాలుగుసార్లు రాజ్ కెసిరెడ్డికి సిట్ నుంచి నోటీసులుఏప్రిల్ 15న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ మరోసారి నోటీసులుఏప్రిల్ 18న సిట్ విచారణకు హాజరుకావాలని విజయసాయిని కోరిన సిట్‌ఏప్రిల్ 18న విచారణకు హాజరైన విజయసాయిరెడ్డిఏప్రిల్ 18న సిట్ విచారణకు వచ్చిన రాజ్ కెసిరెడ్డి తండ్రి ఉపేంద్రఏప్రిల్ 19న సిట్ విచారణకు హాజరైన ఎంపీ మిథున్‌రెడ్డిఏప్రిల్ 21న హైకోర్టులో రాజ్ కెసిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ఏప్రిల్ 22న విదేశాలకు పారిపోయే యత్నంలో రాజ్ కెసిరెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ఏప్రిల్ 24న మద్యం కేసులో బూనేటి చాణక్య అరెస్ట్ఏప్రిల్ 25న మద్యం కేసులో సజ్జల శ్రీధర్‌రెడ్డి అరెస్ట్మే 2న మద్యం కేసులో నిందితుడు దిలీప్ అరెస్ట్మే 8న సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి ఇళ్లలో సిట్ తనిఖీలుమద్యం కుంభకోణంపై వివరాలు కోరిన ఈడీమే 8న ఈడీ అధికారుల నుంచి సిట్‌కు అందించిన లేఖ బహిర్గతంమే 9న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీకి సిట్ నోటీసులుమే 14న గోవిందప్ప బాలాజీని కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో అరెస్ట్ చేసిన సిట్‌మే 14న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి సిట్ విచారణకు హాజరుమే 16 వరకు మూడు రోజులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి విచారణధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టుమే 16న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అరెస్ట్జూన్ 18న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్‌నాయుడును ఎయిర్‌పోర్టులో అడ్డగింతబెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరిని అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులుజూన్ 18న బెంగళూరు వెళ్లి చెవిరెడ్డి, వెంకటేశ్‌నాయుడిని అరెస్ట్ చేసిన సిట్‌జులై 12న సిట్ విచారణకు హాజరుకావాలని విజయసాయిరెడ్డికి నోటీసులుసిట్‌కు సమాచారం ఇచ్చి విచారణకు గైర్హాజరైన విజయసాయిరెడ్డిఈనెల 18న ముందస్తు బెయిల్ విషయంలో సుప్రీంకోర్టులో మిథున్‌రెడ్డికి దక్కని ఊరటఇప్పటికే హైకోర్టులో మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేతవిదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసిన సిట్‌మద్యం కేసులో మిథున్‌రెడ్డి అరెస్ట్‌కు ఈనెల 18న ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్.. తర్వాత అరెస్ట్!