టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా వార్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాతోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. బీ టౌన్ స్టార్ హీరో హృతిక్ రోషన్, క్రేజీ బ్యూటీ కియారా అద్వానీ లీడ్ రోల్స్ లో నటించగా.. అనిల్ కపూర్, అశుతోష్ రాణా ముఖ్య పాత్రల్లో నటించారు.
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్-2ను యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మాత ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మించారు. యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా 2019లో వచ్చిన వార్ చిత్రానికి సీక్వెల్ గా రూ.400 కోట్లతో రూపొందించినట్లు సమాచారం. ఆగస్టు 14వ తేదీన గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా సినిమాను రిలీజ్ చేశారు.
అయితే రిలీజ్ కు ముందు క్రియేట్ చేసిన అంచనాలను మాత్రం సినిమా మాత్రం అందుకోలేకపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగినా.. మొదటి రెండు రోజులు సాలిడ్ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత కలెక్షన్స్ మాత్రం పడిపోయాయని చెప్పాలి. దీంతో సినిమాకు భారీ నష్టాలు వచ్చినట్లు ఇప్పుడు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
వార్-2 మూవీ ఫస్ట్ వీకెండ్ కల్లా రూ.174 కోట్లు సాధించింది. ఆ తర్వాత తొలి సోమవారం నాటికి వసూళ్లు పడిపోయాయి. కలెక్షన్లు సింగిల్ డిజిట్ లకు పరిమితమయ్యాయి. ఇప్పుడు రెండో ఆదివారం నాటికి రూ.6.5 కోట్లకు వసూళ్లు పడిపోయినట్లు ట్రేడ్ పండితులు స్నాక్నిల్క్ ఇటీవల అంచనా వేయగా, ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వార్-2 రూ.221 కోట్లను వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లు దాటిందని సమాచారం. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు సినిమా చాలా దూరంలో ఉంది. అంత ఈజీగా వసూలైనట్లు కనిపించడం లేదు. వార్ మూవీతో పోల్చుకుంటే పరిస్థితి దారుణంగా ఉందనే చెప్పాలి.
రూ.150 కోట్లతో నిర్మించిన వార్ మూవీ రూ.53 కోట్లతో ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా రూ.471 కోట్లు వసూలు చేసింది. భారీ లాభాలను తెచ్చిపెట్టింది. కానీ ఇప్పుడు వార్-2 లాభాలు కాదు.. నష్టాలు తెచ్చేలా ఉంది. YRF స్పై యానివర్స్ లో ఇప్పటివరకు అత్యంత కాస్ట్లీ మిస్ ఫైర్ మూవీగా వార్-2 నిలిచేలా కనిపిస్తుంది. మరి ఫుల్ రన్ లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.