ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ వేదికగా చేసుకుని భారీ వ్యూహ రచన చేస్తున్నారు. ఏపీలో విశాఖ అతి పెద్ద నగరంగా ఉంది. మెగా సిటీగా విశాఖనే చెప్పాలి. అటువంటి విశాఖలో చంద్రబాబు ఈ ఏడాది చివరిలో అతి పెద్ద పెట్టుబడుల సదస్సుని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దావోస్ కి వెళ్ళి పెట్టుబడుల కోసం ప్రయత్నం చేసి సక్సెస్ అయిన కూటమి ప్రభుత్వం ఇపుడు సింగపూర్ మీద ఫోకస్ పెడుతోంది సింగపూర్ లో ఏకంగా ఆరు రోజుల బిజీ షెడ్యూల్ ని పెట్టుకుని చంద్రబాబు ఆయన మంత్రివర్గం సీనియర్ అధికారుల టీం అక్కడ నుంచి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలని చూస్తోంది.
చంద్రబాబు ఒక వ్యూహం ప్రకారమే సింగపూర్ లో పర్యటిస్తున్నారు అని అంటున్నారు. ఆయన సింగపూర్ లో కొనసాగిస్తున్న పర్యటనలో భాగంగా ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరమ్ రోడ్‌షో లో పాల్గొన్నారు. ఈ రోడ్ షో ద్వారా ఆయన పెట్టుబడిదారులకు ఘనమైన ఆహ్వానమే పలికారు. తొందరలో విశాఖలో పెట్టుబడుల సదస్సుకు సన్నాహక సమావేశంగా కూడా దీనిని అభివర్ణించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్త పారిశ్రామిక పాలసీలు స్పీడ్ ఆఫ్ డూయింగ్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు వివరంచారు. అంతే కాదు గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, డిఫెన్స్, ఆటో మొబైల్ రంగాల్లో పెట్టుబడులపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇక ఆయా రంగాలలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను చంద్రబాబు వారికి విడమరచి చెప్పారు.
ఇదిలా ఉంటే ఈ ఏడాది నవంబర్‌లో విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు ప్రభుత్వం తెర వెనక కసరత్తును ముమ్మరం చేసింది. ఈ పెట్టుబడుల సదస్సు ఏపీ విజన్ ని ఫ్యూచర్ ని పూర్తిగా చేంజ్ చేస్తుందని భావిస్తున్నారు. ఇక విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ దిగ్గజ కంపెనీలను ఆహ్వానించిన చంద్రబాబు వారితోనే ఏపీ అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. మరో మూడు నెలలలో విశాఖ వేదికగా జరిగే పెట్టుబడుల సదస్సు పూర్తి సక్సెస్ కావాలన్న అజెండాతో చంద్రబాబు సింగపూర్ టూర్ సాగుతుంది అని అంటున్నారు.
ఈ రోజున ఏపీలో లేనిది లేదు అన్నది కూటమి ప్రభుత్వం చెబుతున్న విషయం. కావాల్సినంత భూమి ఉంది. ఇతర వనరులు ఉన్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని పారిశ్రామిక పాలసీలో మార్పులు తెచ్చారు. అంటే వేగవంతంగా అన్ని రకాలైన అనుమతులు మంజూరు చేస్తారు. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఏపీ డెస్టినీ పాయింట్ అని చెబుతున్నారు. దక్షిణాదిన ఏపీలో అభివృద్ధి పరిణామ క్రమం చూపిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది మిగిలిన రాష్ట్రాలలో చేయలేనిది ఏపీలో సాధ్యపడుతుందని అంటోంది ఎందువల్ల అంటే ఏపీ కొత్తగా రాజధానిని ఏర్పాటు చేసుకోబోతోంది. అది ప్రపంచ రాజధానిగా నిర్మాణం అవుతోంది. దాంతో ఏపీ రాజధానిలో పెట్టుబడులకు ఇదే మంచి తరుణం అని కూడా కూటమి ప్రభుత్వం చెబుతోంది. పెట్టుబడిదారులకు కోపరేట్ చేసే ఫ్రెండ్లీ గవర్నెన్స్ ఏపీలో ఉందని చాటి చెబుతున్నారు.
లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా చేసుకుని విశాఖలో పెట్టుబడుల సదస్సుని నిర్వహిస్తున్నారు. చంద్రబాబు సీఎం గా ఉండగా 2014 నుంచి 2019 మధ్యలో వరసగా ప్రతీ ఏటా పెట్టుబడుల సదస్సులు విశాఖలో జరిగాయి. ఇక వైసీపీ హయాంలో ఒకే ఒకసారి జరిగింది. ఇపుడు చూస్తే 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మొదటిసారిగా విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నారు. దాంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్వహించాలని చూస్తున్నారు. అంతే కాదు అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నది కూడా పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో సింగపూర్ నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు రానున్నారు అని అంటున్నారు. విశాఖ సదస్సు సక్సెస్ అయిత్గే ఏపీ దిశ దశ మొత్తం మారిపోతాయని కూటమి ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.