శ్రీకాళహస్తి యువకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడి హత్య కేసు ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పైగా ఈ కేసులో రకరకాల కొత్త కోణాలు వెలుగుచూస్తున్న వేళ మరింత సంచలనంగా మారిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ వేస్తూ, గతంలో పవన్ ప్రసంగాలు వెలికితీస్తూ సోషల్ మీడియా జనాలు విరుచుకుపడుతున్నారు.
దీంతో.. ఒక్కరోజులు ఎటు చూసినా జనసేన నుంచి తాజాగా సస్పెండ్ చేయబడిన కోట వినుత ట్రోలింగ్స్, ఆమె పేరు చెప్పి పవన్ పై ట్రోలింగ్స్ పీక్స్ కి చేరాయి. ఈ నేపథ్యంలో జనసేన సోషల్ మీడియా కౌంటర్స్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా.. వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. సొంత డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన మీరా మాకు చెప్పేది అంటూ విరుచుకుపడుతుంది.
ఇలా వినుత పేరు చెప్పి పవన్ ను.. అనంతబాబు పేరు చెప్పి జగన్ ను విమరిశిస్తూ సోషల్ మీడియా యాక్టివిస్టులు నెట్టింట రచ్చకు తెరలేపారు. దీంతో.. గత రెండు రోజులుగా సోషల్ మీడియా వేడెక్కిపోతుంది. ఈ నేపథ్యంలోనే… “వినుత వర్సెస్ అనంత” వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది! మరోవైపు… ఇప్పటికే వినుతపై జనసేన అధినాయకత్వం చర్యలకు ఉపక్రమించి.. పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన డ్రైవర్ ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్సీ అనంతబాబును పేరుకు మాత్రమే సస్పెండ్ చేసిన జగన్… అనంతరం కూడా పార్టీ కార్యక్రమాల్లోనూ, తన వెనుక తిప్పుకున్నారని జనసేన విమర్శిస్తుంది. అదేవిధంగా. వివేకానంద రెడ్డి హత్య కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి జగన్ మద్దతుగా నిలుస్తున్నారని చెబుతోంది! ప్రస్తుతం సోషల్ మీడియా అంతా… ఇదే “వినుత వర్సెస్ అనంత”!!
కాగా… చెన్నైలోని కూవం నది వద్ద ఓ యువకుడి మృతదేహాన్ని గుర్తించిన వ్యవహారంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ ఛార్జి వినుత కోటా సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చెన్నై పోలీసు కమిషనర్ అరుణ్ స్పందిస్తూ.. చెన్నై సెవెన్ వెల్స్ ఎంఎస్ నగర్ హౌసింగ్ బోర్డు వెనుక వైపు కూవం నది వద్ద ఈ నెల 8న సుమారు 25 ఏళ్ల వయసున్న యువకుడి మృతదేహం వెలుగు చూసిందని అన్నారు. ఆ సమయంలో… మృతదేహంపై గాయాలు ఉండటంతో హత్య చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ సమయంలో… మృతుడు శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాసులు (22) అలియాస్ రాయుడిగా తెలిసిందని అన్నారు. ఈ కేసులో జనసేన శ్రీకాళహస్తి ఇన్ ఛార్జి వినుత, ఆమె భర్త చంద్రబాబు, వారి సహాయకుడు గోపి, కారు డ్రైవరు షేక్ దాసన్, జనసేన ఐటీ వింగ్ నిర్వాహకుడు శివకుమార్ లను అరెస్టు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు.