బెంగాలీ మూవీ ‘భలో థేకో’ తో 2003లో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ విద్యా బాలన్. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే నటిగా మంచి గుర్తింపు దక్కించుకోవడంతో పాటు, అందాల ఆరబోతతో స్టార్‌డం దక్కించుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోలకు ఒకానొక సమయంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా, లేడీ ఓరియంటెడ్ సినిమాలకు వాంటెడ్‌గా విద్యా బాలన్ పేరు దక్కించుకుంది.
అలాంటి విద్యా బాలన్ అనారోగ్య సమస్యల కారణంగా బరువు విపరీతంగా పెరగడం, కొన్నాళ్ల తర్వాత తగ్గడం తరచూ జరుగుతూనే ఉంటుంది. విద్యా బాలన్ తన బరువు సమస్య గురించి పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆమె ఎప్పటికప్పుడు తన సమస్యను అధిగమిస్తూ వచ్చింది.
సాధారణంగా హీరోయిన్స్ మూడు పదుల వయసు వరకు యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పుడైతే నాలుగు పదుల వయసులో పడుతారో అప్పటి నుంచి అందాల ఆరబోత తగ్గిస్తూ ఉంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంది హీరోయిన్స్ కనీసం స్కిన్ షో కి సైతం ఆసక్తి చూపించరు. కానీ కొందరు మాత్రం నాలుగు పదుల వయసులోనూ పాతికేళ్ల పడుచు అమ్మాయిలతో సమానంగా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.
విద్యా బాలన్ ఆ కోవలోకి వస్తుంది. నాలుగు పదుల వయసు దాటిన విద్యా బాలన్ సినిమాల విషయంలోనూ జోరు తగ్గడం లేదు. గత ఏడాది విద్యా బాలన్ నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
తాజాగా ప్రముఖ మ్యాగజైన్ పికాక్ కవర్ పేజ్‌పై విద్యా బాలన్ కన్నుల విందు చేసింది. పింక్ డ్రెస్‌లో విద్యా బాలన్ చూపు తిప్పుకోనివ్వడం లేదు. అల్ట్రా మోడ్రన్ హెయిస్ స్టైల్‌తో పాటు, వయసు సగానికి పైగా తగ్గించి చూపించే విధంగా మేకోవర్‌తో విద్యా బాలన్ ఆకట్టుకుంది. అంతే కాకుండా ఆమె డీప్ నెక్ క్లీ వేజ్ షో మతి పోగొడుతోంది.
మొత్తంగా విద్యా బాలన్ దాదాపు 15 ఏళ్ల క్రితం చేసిన డర్టీ పిక్చర్‌లో ఎలా అయితే అందంగా, శృంగార తారగా కనిపించిందో ఇప్పటికీ అదే మాదిరిగా కనిపిస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయి అందాల ఆరబోత చేస్తున్న నేపథ్యంలో విద్యా బాలన్ మరో పదేళ్ల పాటు ఇండస్ట్రీలో టాప్ స్టార్‌గా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
తెలుగులో బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్‌లో విద్యా బాలన్ నటించిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్ భార్య బసవ తారకం పాత్రలో విద్యా బాలన్ నటించి మెప్పించింది. అంతే కాకుండా ఇంకా పలు సినిమాల డబ్బింగ్ వర్షన్‌లతోనూ విద్యా బాలన్ తెలుగు ప్రేక్షకులను అలరించిన సందర్భాలు ఉన్నాయి.
బాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియన్ మూవీస్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న విద్యా బాలన్ అందాల ఆరబోత ఫోటోలు చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇప్పటికీ ఇంత అందంగా ఉన్న విద్యా బాలన్ సౌత్‌లో మరిన్ని సినిమాలు చేస్తే చూడాలని ఆశగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.