ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఎవరికి ఎలాంటి ఇబ్బందో తెలియదు కానీ తెలంగాణాలో బీఆర్ఎస్ కి మాత్రం చాలా చిక్కులు తెచ్చిపెడుతున్నాయని అంటున్నారు. లోక్ సభలో ఎంపీలు లేరు. కానీ రాజ్యసభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. ఈ నలుగురు ఎంపీల మద్దతు కావాలని అయితే బీజేపీ అడగడం లేదు. కాంగ్రెస్ వైపు నుంచి ఏమీ కబురు లేదు, సీఎం రేవంత్ రెడ్డి అయితే జనరల్ గా మీడియా ముందు వైసీపీ టీడీపీలతో పాటుగా బీఆర్ఎస్ కి కూడా ఒక్క అప్పీల్ చేసు ఊరుకున్నారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధికి ఫుల్ మెజారిటీ ఉంది. అయినా తాము కూడా ఆ వైపున నిలబడి ఓటేస్తే పొలిటికల్ ర్యాగింగ్ కాంగ్రెస్ వైపు నుంచి మామూలుగా ఉండదని బీఆర్ఎస్ పెద్దలు ఆలోచిస్తున్నారుట. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న స్లోగన్ అందుకుంటే అది బీజేపీ కంటే తమకే పెద్ద నష్టమని లెక్కలేసుకుంటున్నారుట. అంతే కాదు తెలంగాణాకు చెందిన వారిని తెచ్చి ఉన్నత పదవికి పోటీగా పెడితే మీ తెలంగాణా వాదం ఇంతేనా అని ఆడిపోసుకుంటారు అన్న బెంగ బెదురూ కూడా ఉన్నాయట. పోనీ అలా కాదు అని కాంగ్రెస్ కి ఓటు వేయాలనుకున్నా ఇబ్బందే అని అంటున్నారు. ఎందుకంటే తెలంగాణాలో అధికారంలో కాంగ్రెస్ ఉంది. ఆ పార్టీతోనే డైరెక్ట్ పోరు. మరి ఆ పార్టీ తరఫున నిలబెట్టిన అభ్యర్ధికి ఓటేసి ఎలా మళ్ళీ జనాలకు చెప్పుకోవడం, క్యాడర్ కి కూడా ఎలా సమాధానపరచడం అన్నది కూడా బీఆర్ఎస్ లో ఉందని అంటున్నారు.
న్యూట్రల్ గానే ఉంటారా :
దీంతో బీఆర్ఎస్ అన్నీ ఆలోచించి న్యూట్రల్ గా ఉంటే సరిపోతుంది అన్న నిర్ణయానికి వచ్చినా రావచ్చు అంటున్నారు. ఎటూ తమ ఓట్లుతో గెలిచేది లేదు, అలాగని ఓడేది లేదు. అందువల్ల తాము ఏ కూటమి అభ్యర్ధిని సపోర్టు చేయకుండా ఓటింగుకు వెళ్ళకుండా అదే న్యూట్రల్ విధానం కంటిన్యూ చేస్తే సరిపోతుందని ఆలోచిస్తున్నారుట. దాని వల్ల అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కి సమదూరం పాటించామని చెప్పుకోవచ్చు అని అంటున్నారు.
అప్పటి దాకా సస్పెన్స్ :
అయితే ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక సెప్టెంబర్ 9న జరుగుతుంది. ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఎవరి నుంచి ఒత్తిడి రాయబారాలు లేవు కాబట్టి తాపీగా ఉంటూ ఈ సస్పెన్స్ ని కొనసాగించాలన్నది బీఆర్ఎ వ్యూహంగా ఇప్పటికి ఉంది అని అంటున్నారు. ఎన్నికల ముందు రోజు వరకూ ఆలాగే ఉంటూ ఆ టైం కి తాము ఓటింగులో పాల్గొనడం లేదని చెప్పడం ద్వారా తమ విధానం క్లియర్ గా చాటవచ్చునని అంటున్నారు. ఏది ఏమైనా బీఆర్ స్ మాత్రం ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో కొంత తర్జన భర్జన పడుతోంది అని అంటున్నారు.